ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఫలదీకరణ చెందిన గుడ్డు గర్భాశయం (గర్భకోశం) వెలుపల, అంటే వేరే ఎక్కడైనా నాటుకుంటుంది (అంటుకుంటుంది) , సాధారణంగా ఫెల్లోపియన్ గొట్టాలలో లేదా అరుదుగా అండాశయంలో, గర్భాశయ మార్గము లేదా ఉదరం లోపల కానీ ఫలదీకరణ చెందిన గుడ్డు నాటుకోవచ్చు. ఫెల్లోపియన్ ట్యూబు అనేది అండాశయాల నుండి గర్భాశయం వరకు అండాలను తీసుకువచ్చే గర్భాశయంతో జత చేయబడిన ఒక పొడవైన గొట్టం. ఇది పెరుగుతున్న ఫలదీకరణ చెందిన గుడ్డును పట్టి ఉంచలేదు మరియు బాగా విస్తరించి చివరికి చీలిపోవచ్చు. ఈ పరిస్థితిలో పిండం సాధారణంగా నిలిచి ఉండలేదు మరియు అది తల్లికి కూడా ప్రాణాంతకమవుతుంది, అందువలన ముందుగానే చికిత్స అవసరం.
ప్రపంచవ్యాప్తంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క సంభవం సుమారు 0.25-2%గా ఉంది, మరియు ప్రతి 161 గర్భాలలో 1 ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ గర్భధారణ సమయంలో, మహిళలు వికారం మరియు వాంతులు వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలు గర్భం ధరించిన 4-10 వారాలలో కనిపిస్తాయి.
సాధారణ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- కడుపుకి ఒకవైపున అకస్మాత్తుగా నొప్పి లేదా నిదానంగా తీవ్రతరమయ్యే నొప్పి (మరింత సమాచారం: గర్భధారణ సమయంలో కడుపు నొప్పి)
- సాధారణ రక్తస్రావంతో పోలిస్తే ఎక్కువగా లేదా తక్కువగా ఉండే యోని రక్త స్రావం, అది ముదురు రంగులో మరియు నీళ్ళ వలె ఉంటుంది
- బలహీనత
కొన్ని సందర్భాల్లో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫెలోపియన్ ట్యూబ్ యొక్క చీలికకు దారితీయవచ్చు మరియు అది అదనపు లక్షణాలను కలిగి ఉంటుంది:
- అధిక రక్తస్రావం
- భుజం చివరన నొప్పి
- మూత్రవిసర్జన సమయంలో లేదా మల విసర్జన సమయంలో నొప్పి
- మైకము
- చెమటలు
- పాలిపోవడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ కింది కారకాలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి:
- 40 సంవత్సరాలు పైబడిన వయసు
- పొత్తికడుపు శస్త్రచికిత్స యొక్క చరిత్ర, పెల్విక్ శస్త్రచికిత్స కణజాలం (గర్భ నిరోధం) మరియు కటి వాపు వ్యాధి (పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్)
- ఫెలోపియన్ ట్యూబ్ కు ఏదైనా గాయం జరగడం
- మునుపటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ
- జనన నియంత్రణ మాత్రలు లేదా గర్భాశయలోపలి పరికరాలు
- ఫెర్టిలిటీ మందులు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
గర్భధారణ సమయంలో పైన చెప్పిన లక్షణాలు ఏవైనా అనుభవించినట్లైతే, వైద్యులని (గైనకాలజిస్ట్) సంప్రదించాలి. వైద్యులు మొదట్లో నొప్పి యొక్క స్థానాన్ని మరియు ఆ స్థానంలో సున్నితత్వాన్ని గుర్తించడానికి పొత్తి కడుపు (పెల్విస్) యొక్క భౌతిక పరీక్ష చేస్తారు. గర్భాశయం యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు గర్భధారణ పరీక్షను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారించడానికి నిర్వహిస్తారు. హెచ్ సిజి (hCG) మరియు ప్రొజెస్టెరాన్ వంటి గర్భస్థ హార్మోన్లు కూడా పర్యవేక్షించబడతాయి.
ప్రస్తుతం, అందుబాటులో ఉన్నవి మందులు ద్వారా చికిత్స విధానం మరియు శస్త్రచికిత్సా విధానం. ఫెలోపియన్ గొట్టం చీలి తీవ్రమైన అంతర్గత రక్తస్రావం ఏర్పడినట్లయితే లాపరోటమీ (laparotomy) అని పిలవబడే శస్త్రచికిత్సా ప్రక్రియ చేయవచ్చు.
మొదటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తరువాత భవిష్యత్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి, కాని ఫెలోపియన్ ట్యూబులు దెబ్బతినకపోతే కనుక ఇంకా మంచిది.