తినడంలో అస్తవ్యస్తం రుగ్మత (ఈటింగ్ డిసార్డర్) - Eating Disorder in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 06, 2018

March 06, 2020

తినడంలో అస్తవ్యస్తం రుగ్మత
తినడంలో అస్తవ్యస్తం రుగ్మత

తినడంలో అస్తవ్యస్తం లేదా ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి?

తినడంలో అస్తవ్యస్తం లేదా ఈటింగ్ డిజార్డర్స్ అంటే ఆహారాన్ని సక్రమంగా తినే అలవాటు లేకపోవడమే. అధికంగా తినడం లేదా తక్కువ తినడం వంటి క్రమం లేని తినే పద్ధతినే “తినడంలో అస్తవ్యస్తం” (eating disorder)  అంటారు. తినడమనే ఈ నిత్య ప్రక్రియలో (లేదా అలవాటులో) క్రమంగా అస్తవ్యస్తంతో లేక క్రమరాహిత్యంతో (disorder) పురోగతి చెందుతుంటారు కొందరు, ఇలాంటి సమస్యను సరైన సమయంలోనే గుర్తించి సవరించుకుంటే చాలా ఉత్తమం.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

తినడంలో అస్తవ్యస్తం (ఈటింగ్ డిజార్డర్స్) సమస్యను సకాలంలోనే గుర్తించి నిర్ధారించుకోవడమనేది ఈ రుగ్మతకు చేసే చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులచే గుర్తించబడింది. అందువలన, తినే రుగ్మతల సాధారణ సంకేతాలను మరియు లక్షణాల గురించి జాగ్రత్త వహించాలి:

  • ఆకలి మాంద్యము (anorexia) అనగా ఆకలి లేకపోవడం, చాలా తక్కువ పరిమాణంలో ఆహారం తినే వ్యక్తుల్లో ఆకలి కోల్పోవడం.  
  • బలహీనత మరియు చిక్కిపోవడము
  • ఆందోళన
  • నలుగురిలో కలువకుండా (సామాజిక ఉపసంహరణ) ఒంటరిగా మిగిలిపోవడం
  • బులీమియా రోగం లేదా ఆబగా తినేసేరోగం, రోగి చాలా పెద్ద పెద్ద పరిమాణాల్లోఆహారాన్ని చాలా తరచుగా తినేస్తుంటారు.
  • అమితంగా తినడం:ఒక నిర్దిష్ట సమయ పరిధిలో రోగి పెద్ద మొత్తంలో ఆహారాన్నితినడం
  • ఆకలి కాకపోయినా తినడమనే రుగ్మత
  • తక్కువ స్వీయ గౌరవం (Low self-esteem)
  • మానసిక కల్లోలం
  • శరీర బరువు మరియు ఆకారం మీద ఆకస్మిక దృష్టి
  • శరీర బరువులో ఆకస్మిక మరియు ప్రముఖ మార్పులు

తినడంలో అస్తవ్యస్తం రుగ్మతకు గల ప్రధాన కారణాలు ఏమిటి?

వివిధ కారణాల వలన తినడంలో అస్తవ్యస్తం (ఈటింగ్ డిజార్డర్స్) సమస్య సంభవించవచ్చు. అయితే, చాలా సాధారణమైన కారణాల్లో కొన్నింటిని కింద ఇవ్వబడ్డాయి:

  • మానసిక కారణాలైన ఒత్తిడి, ఆత్మగౌరవంలేమి మరియు శరీర సౌష్ఠవం గురించి ఏమాత్రం భావన లేకపోవడం
  • జీవసంబంధ కారకాలైన పోషకాహార లోపాలు, జన్యు వ్యాధిలక్షణం, హార్మోన్ల అంతరక్రియలు (hormonal interplay) లేదా ఇతర వైద్య సమస్యలు
  • గతంలోని సంఘటనలు వంటి వ్యక్తిగత సమస్యలు రోగిని గాయపర్చవచ్చు లేదా వ్యాకులతతో బాధించవచ్చు
  • ఆకస్మిక సాంస్కృతిక భేదాలు
  • వృత్తిపరమైన అవసరాలు కూడా కొన్ని ఆహారపదార్ధాల్ని తినడం లేదా కొన్ని తినే పద్ధతుల్ని బలవంతంగా అనుకరణ చేయాల్సిన అవసరం వచ్చి ఉండవచ్చు.

తినడంలో అస్తవ్యస్తం రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

పైన చెప్పిన సంకేతాలు మరియు లక్షణాలను మీలో మీరు గమనించినట్లైతే మీరు డాక్టర్ని తప్పక సంప్రదించాలి. ఈ రోగనిర్ధారణలో, మీ ఆహారపు అలవాట్లు మరియు మీ రోజువారీ దినచర్య (రొటీన్) కు సంబంధించి వైద్యుడు అడిగే ఇతర ప్రశ్నలు-వాటికి మీరిచ్చే జవాబుల ఆధారంగా, మీకు తినడంలో అస్తవ్యస్త రుగ్మత ఉందా లేదా అన్న విషయాన్ని డాక్టర్ నిర్ణయించవచ్చు.

  • రోగనిర్ధారణ సమయంలో, వైద్యుడు మిమ్మల్ని శారీరకంగా పరిశీలిస్తారు మరియు అవసరమైతే, మొత్తం ఆరోగ్య స్థితి మరియు పోషకాహార లోపాన్ని అంచనా వేయడానికి కొన్ని ప్రయోగశాల పరీక్షలు చేయించుకొమ్మని మిమ్మల్ని అడగవచ్చు.
  • రోగ నిర్ధారణను ధృవీకరించడానికి వైద్యుడు మీ గురించిన మానసిక పరిశీలనను కూడా చేస్తాడు.

తినడంలో అస్తవ్యస్తం రుగ్మత (ఈటింగ్ డిజార్డర్స్)కు చికిత్స ఆరోగ్యకరమైన ఆహారసేవనం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన అనేక అంశాలను కలిగి ఉంటుంది. అయితే, ఈటింగ్ డిజార్డర్స్ రుగ్మత చికిత్సకు కొన్ని సాధారణ చికిత్సలు ఉన్నాయి

  • ధ్యానం
  • ఆరోగ్యకరమైన భోజనం
  • మేధో ప్రవర్తనా చికిత్స (cognitive behavioural therapy) లో మీ మానసిక కల్లోలం మరియు తినే అలవాట్లు పరిశీలించబడుతాయి. పర్యవసానంగా, మానసిక కల్లోలాన్ని అధిగమించడానికి మీరు తినకూడదని ఈ చికిత్సలో మీకు తెలుపబడుతుంది.
  • తినడంలో అస్తవ్యస్తం రుగ్మతను నివారించడానికి  ఔషధాలు లేవు. అయితే, వేళ కాని వేళలో ఆహారం తినాలన్న కోరికను అధిగమించడానికి మీకు యాంటీడిప్రజంట్స్ మరియు యాంటీ-ఆందోళన మందులను వైద్యులు చించవచ్చు.
  • ఇంకా ఏవైనా లోపాలను అధిగమించడానికి పోషక ఆహార పదార్ధాలను వైద్యులు మీకు సూచించవచ్చు



వనరులు

  1. Pamela M Williams. Treating Eating Disorders in Primary Care. Am Fam Physician. 2008 Jan 15;77(2):187-195. American Academy of Family Physicians.
  2. National Eating Disorder Informative Centre. Clinical Definitions. Canada; [Internet]
  3. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Eating Disorders. National Institutes of Health; Bethesda, Maryland, United States
  4. Am Fam Physician. 2015 Jan 1;91(1):online. [Internet] American Academy of Family Physicians; Eating Disorders: What You Should Know.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Eating Disorders

తినడంలో అస్తవ్యస్తం రుగ్మత (ఈటింగ్ డిసార్డర్) వైద్యులు

Dr. Sumit Kumar. Dr. Sumit Kumar. Psychiatry
9 Years of Experience
Dr. Kirti Anurag Dr. Kirti Anurag Psychiatry
8 Years of Experience
Dr. Anubhav Bhushan Dua Dr. Anubhav Bhushan Dua Psychiatry
13 Years of Experience
Dr. Sumit Shakya Dr. Sumit Shakya Psychiatry
7 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు