డిస్లిపిడెమియా అంటే ఏమిటి?
డిస్లిపిడెమియా రక్తంలో అసాధారణమైన లిపిడ్ స్థాయిలని సూచిస్తుంది, అది కరోనరీ గుండె వ్యాధికి యొక్క ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. ఇది అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలలో తగ్గుదలను మరియు పూర్తి కొలెస్ట్రాల్ లేదా తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (చెడు కొలెస్ట్రాల్) యొక్క అధిక స్థాయిని కలిగి ఉంటుంది.
దాని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ పరిస్థితికి లక్షణాలు ఎక్కువగా కారణం పై ఆధారపడి ఉంటాయి. డిస్లిపిడెమియా స్వయంగా ఏ విధమైన వైద్య పరమైన లక్షణాలను చూపించదు.
దాని కారణాలు మరియు ప్రమాద కారకాలు ఏమిటి?
క్రమం తప్పిన లిపిడ్ స్థాయిలకు ఖచ్చితమైన కారణాలు ఏమి లేవు. అయితే, ఊబకాయం అనేది వ్యాధికి సంభందించిన అత్యంత గుర్తింపదగిన ప్రమాద కారకాల్లో ఒకటి. ఇతర ప్రమాద కారకాలు:
- పెద్ద వయస్సు
- అధిక రక్త పోటు
- మధుమేహం
- ధూమపానం
- పురుషులు
- కార్డియోవాస్క్యులార్ డిజార్డర్స్ ( cardiovascular disorders) లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్న కుటుంబ చరిత్ర
- శారీరక శ్రమ లేకపోవడం
- చలనంలేని (ఎల్లపుడు కూర్చుని ఉండే) జీవనశైలిని పాటించడం
ఈ ప్రమాద కారకాల్లో అధికభాగం, శరీరంలో ప్రమాద కారకాలు పెరిగేకొద్దీ అవి డిస్లిపిడెమియా సంభావ్యతను పెంచుతాయని నిర్ధారించబడింది.
వేరే వ్యాధుల యొక్క లక్షణాల మూలంగా ద్వితీయ పరంగా సంభవించే డిస్లిపిడెమియా కారణాలు:
- నెఫ్రోటిక్ సిండ్రోమ్
- హైపోథైరాయిడిజం
- అనోరెక్సియా
- పిత్తాశయ అడ్డంకులు
- డైయూరిటిక్స్ (diuretics), స్టెరాయిడ్, అమయోడరోన్ (amiodarone), సిక్లోస్పోరిన్ (cyclosporine), మరియు ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ (protease inhibitors) వంటి మందులు.
డిస్లిపిడెమియాను ఎలా నివారించవచ్చు?
క్రమమైన శారీరక శ్రమ మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించడం ద్వారా డిస్లిపిడెమియాను నివారించవచ్చు. ధూమపానం ఆపివేయడం మరియు బరువు తగ్గించడం వలన డైస్లిపిడెమియా నివారణకు మాత్రమే కాకుండా, కార్డియోవాస్క్యులార్ రుగ్మతలు మరియు ఇతర సమస్యలను కూడా నివారించవచ్చు.
డిస్లిపిడెమియా యొక్క నిర్ధారణ మరియు చికిత్స ఏమిటి?
డిస్లిపిడెమియా రోగి యొక్క ఆరోగ్య చరిత్ర ఆధారంగా అనుమానించబడుతుంది మరియు లిపిడ్ స్థాయిలను గుర్తించడానికి రక్త పరీక్షలు చేసి, దాని ఆధారంగా తుది రోగనిర్ధారణ చేయబడుతుంది.
చికిత్స:
- డిస్లిపిడెమియా యొక్క చికిత్సలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను తగ్గిస్తుంది, ఇది స్టాటిన్ (statin) మందుల సహాయంతో సాధ్యపడుతుంది, ఈ మందులను వైద్యులు సూచిస్తారు.
- ఇతర మందుల ఉపయోగం మధుమేహం లేదా హృదయనాళ రుగ్మత (cardiovascular disorder) లేదా డిస్లిపిడెమియాకు కారణమైన ద్వితీయ స్థాయి కారకాలపై ఆధారపడి ఉంటుంది,అలాగే మందుల యొక్క దీర్ఘకాలిక ఉపయోగం గురించి కూడా నిర్ణయించబడుతుంది.
- చాలా సార్లు కేవలం మందుల చికిత్స ఈ సమస్యకు సరిపోదు అందుకే సమస్య యొక్క సరైన నిర్వహణ కోసం కొన్ని జీవనశైలి మార్పులను చేయటం కూడా ముఖ్యం. వీటిలో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మరియు శరీర ద్రవ్యరాశి సూచిక(బాడీ మాస్ ఇండెక్స్) మరియు బరువు తగ్గించటానికి శారీరక శ్రమ చేయడం వంటివి పాటించాలి.
- పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వినియోగించడంతో పాటు ఆహారంలో ఫైబర్స్, ఫైటోస్టిరోల్స్ (phytosterols) మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు (omega 3 fatty acids) తీసుకోవడం అనేవి ఈ సమస్యను అధిగమించడానికి సహాయం చేస్తాయి. అదే సమయంలో, మద్యం మరియు ట్రాన్స్ క్రొవ్వులు తీసుకోవడం తగ్గించాలని గమనించాలి. (మరింత సమాచారం: కొవ్వుల వనరులు)
డిస్లిపిడెమియా యొక్క నిర్ధారణ పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. హృదయ సంబంధ రుగ్మతల సంభవించిన వ్యక్తులలో ప్రస్తుతం అలాంటి రుగ్మతలు లేని వారితో పోలిస్తే డిస్లిపిడెమియా సంభవించే ప్రమాదం ఎక్కుగా ఉంటుంది.ఐనప్పటికీ, ఈ వ్యాధి ఎలా సంభవిస్తుందో చెప్పలేము .