డస్ట్ అలెర్జీ అంటే ఏమిటి?
డస్ట్ అలెర్జీ అనేది రినిటిస్,కళ్ళ కలక, తామర, మరియు ఉబ్బసం వంటి వాటితో పాటు దుమ్ము, ధూళికి బహిర్గతం అవడం వలన సంభవించే ఒక రకమైన అలెర్జీ. సహజంగా, ఈ ప్రతిచర్యలకు కారణమయ్యే డస్ట్ అలెర్జీ కారకం సాధారణంగా ఇంటిలో ఉండే దుమ్ములోని ఒక చిన్న పురుగు. ఆ కీటకాలను దుమ్ము పురుగులు అని పిలుస్తారు మరియు అవి చాలా చిన్న పరిమాణంలో ఉండి,మామూలు కంటికి కనిపించవు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85% మంది ఆస్తమా రోగులు ఈ దుమ్ము పురుగులకు అలర్జీక్ గా ఉన్నారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
డస్ట్ అలెర్జీ కారకం ఇంట్లో తేమ పరిస్థితుల్లో పెరుగుతుంది మరియు ఇంటి లోపలి వాతావరణంలో చాలా బాగా అమిరిపోతుంది. డస్ట్ అలెర్జీ ఉంటె కనుక, ఆ వ్యక్తి ఈ క్రింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను అనుభవించవచ్చు:
- తుమ్ములు
- ముక్కు కారడం
- కంటి చికాకు మరియు కళ్ళలో నీళ్లు
- చర్మ చికాకు
- ముసుకుపొయిన ముక్కు
డస్ట్ అలెర్జీచే ఆస్తమా కూడా ప్రేరేపించబడితే ఈ క్రింది లక్షణాలు ఉండవచ్చు
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- ఛాతీ నుండి గుర్రుగుర్రుమనే శబ్దం
- నిద్రలో సమస్య
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
మనుషుల మీద నుండి రాలిన మృత చర్మకణాలను ఈ దుమ్ము పురుగులు తింటాయి, ఇది ప్రధానంగా ఇంట్లో దుమ్ముకు కారణమవుతుంది. దుమ్ము పురుగులను గృహ దుమ్మూ పురుగులు మరియు గోదాము దుమ్ము పురుగులుగా రెండురకాలుగా వర్గీకరించవచ్చు మరియు అవి శ్వాస మార్గాలు మరియు ముక్కు సంబంధ అవయవాల వాపుకు కారణమవుతాయి.
దుమ్ము పురుగు వంటి ఒక అలెర్జీ కారకం శరీరంలోకి ప్రవేశించినప్పుడు, శరీరం ఆ అలెర్జీ కారకానికి ప్రతిస్పందనగా యాంటీబాడీస్ను (IgE) ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిస్పందన ఒకే ప్రాంతంలో ఉండవచ్చు లేదా ఏదైనా ఒక శరీర భాగంలో ఉండవచ్చు.
అరుదైన సందర్భాలలో, డస్ట్ అలెర్జీ అనాఫిలాక్టిక్ షాక్ కు కూడా దారి తీస్తుంది, ఇది కేవలం దుమ్ము పురుగు కడుపులోకి ప్రవేశించడం ద్వారా సంభవించే ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఈ దుమ్ము పురుగులు దుప్పట్లు, తివాచీలు, సామాన్లలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, దుమ్ము పురుగులు ఆహారాన్ని కలుషితం చేయవచ్చు. చిన్నపిల్లలు, ఆస్తమా రోగులు, మరియు గర్భిణీ స్త్రీలకు అలాంటి అలెర్జీలు సంభవించే అవకాశంఎక్కువగా ఉంటుంది.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
డస్ట్ అలెర్జీ కలిగించిన ఖచ్చితమైన అలెర్జీ కారకాన్ని గుర్తించడానికి, రోగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం అవసరం. సాధారణ పరీక్షలో చర్మ గాటు పరీక్ష (skin prick test) ఉంటుంది, ఇందులో ఇంటి దుమ్ము పురుగు యొక్క సారాన్ని అలెర్జీని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు, మరియు అలెర్జీ ప్రతిస్పందనను చర్మ గాటు ప్రదేశంలో సంభవించిన గడ్డ లేదా ఎరుపుదనం యొక్క కొలత ప్రకారం లెక్కిస్తారు. వ్యక్తి చర్మ పరీక్షకు సున్నితమై ఉంటే, రక్త పరీక్షను చేయవచ్చు. అలెర్జీని సూచించే కొన్ని యాంటీబాడీలు రక్త పరీక్షలలో గుర్తించబడతాయి. ముక్కు శ్లేష్మ పొర యొక్క భౌతిక పరీక్ష లేదా కంటి ఎరుపుదనం ద్వారా కూడా అలెర్జీ ప్రతిస్పందనను నిర్ధారించవచ్చు.
అలెర్జీ కారకం తెలిసిన తరువాత డస్ట్అలెర్జీలకు సులభంగా చికిత్స చేయవచ్చు. చికిత్స శరీరంలో ఉన్న మధ్యవర్తుల (mediators) పై ఆధారపడి ఉంటుంది, అంటే హిస్టామిన్ (histamine) మరియు ల్యుకోట్రియెన్ (leukotriene) వంటివి, ఇవి అలెర్జీ ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి:
- యాంటిహిస్టమిక్ (Antihistaminic) మరియు మాస్ట్ సెల్ నిరోధకాలు (mast cell inhibitors)
- లుకోట్రియెన్ నిరోధకాలు (Leukotriene inhibitors)
- ఇమ్యునోథెరపీ - రోగి యొక్క అలెర్జీ సున్నితత్వాన్ని ఈ చికిత్స నిర్వహిస్తుంది, ఇది ఇటీవలి కొత్తగా ఉపయోగిస్తున్న మరొక రకం చికిత్సా విధానం. ఇది దీర్ఘకాలం పాటు మంచి ఫలితాలను చూపిస్తుంది
- లక్షణాల ఆధారిత చికిత్స - నోటి స్టెరాయిడ్లు వంటి మందులు, అలెర్జీని నియంత్రించడానికి ఇవ్వవచ్చు
కొన్ని నివారణ చర్యలు దుమ్ము కారణంగా ఏర్పడే అలెర్జీని నివారించడానికి మరియు నిరోధించడానికి సహాయపడతాయి.
- దుప్పట్లు మరియు దిండ్లను వేడి నీటితో ఉతకడం
- తివాచీలను కప్పి ఉంచడం
- సామాన్లను వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రపరచడం
చివరిగా, డస్ట్ అలెర్జీలు ప్రపంచవ్యాప్తంగా 85% అలెర్జీలని కలిగి ఉంటాయి. దుమ్ము చేరడాన్ని తొలగించడం ద్వారా అలెర్జీ కారకాన్ని నివారించడం అనేది ఉత్తమ మార్గం. లక్షణాల ఆధారిత చికిత్స అలెర్జీ ప్రేరేపిత మార్గం యొక్క సరైన సంరక్షణకు సహాయం చేస్తుంది. అలెర్జీ కారకాన్నిఉపయోగించి అలెర్జీల సున్నితత్వానికి అలవాటు పడేలా చెయ్యడం అనేది విస్తృతంగా ఉపయోగించబడుతున్న చికిత్స విధానం.