మూత్రం నిలుపుదల అంటే ఏమిటి?
మూత్రం నిలుపుదల (Urinary Retention) అనేది ఒక వ్యక్తి సంతృప్తికరంగా మూత్రవిసర్జన చేయలేకపోయే పరిస్థితి. వ్యక్తికి తన మూత్రాశయం భర్తీ అయిందని తెలుస్తుందిమరియు మూత్రవిసర్జన చేయాలని కోరుకుంటాడు, అయితే మూత్రవిసర్జనకు వెళ్ళినపుడు మూత్రవిసర్జనను పూర్తిగా, సంతృప్తికరంగా చేయలేక పోతారు.
తీవ్రమైన మూత్రం నిలుపుదల (acute urinary retention) సమస్య అకస్మాత్తుగా సంభవించవచ్చు. ఈ మూత్ర సమస్య బాధాకరమైన వ్యాధి లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు దీనికి వైద్యపరమైన శ్రద్ధ వెంటనే అవసరమవుతుంది. అయితే దీర్ఘకాలిక మూత్రం నిలుపుదల అనే సమస్య ఎలాంటి బాధాకరమైన వ్యాధి లక్షణాలను ఉత్పత్తి చేయకుండా సంవత్సరాల పాటు శరీరంలో అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో వ్యక్తి పూర్తిగా మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయలేకపోతాడు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
తీవ్రమైన మూత్రం నిలుపుదల రుగ్మత యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:
- మూత్రవిసర్జన చేసేందుకు అసమర్థత
- మూత్రవిసర్జన చేయాలన్న కోరిక ఉంటుంది
- దిగువ పొత్తికడుపులో నొప్పి
- దిగువ పొత్తి కడుపులో ఉబ్బరం
దీర్ఘకాలిక మూత్రం నిలుపుదల యొక్క లక్షణాలు:
- మూత్ర విసర్జనలో సమస్య
- బలహీనమైన మూత్రం ధార
- మూత్రవిసర్జన చేసివచ్చిన తరువాత కూడా తిరిగి వింటేనే మూత్రవిసర్జనకు వెళ్లాలనే కోరిక కల్గుతుంది.
- మూత్రవిసర్జన తర్వాత పొత్తికడుపులో తేలికపాటి అసౌకర్యం
మూత్రం నిలుపుదల సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి?
మూత్రం నిలుపుదలకు కారణాలు బహుళమైనవి మరియు ఇవి అంతర్లీన కారణాలు, ఇవి విస్తృత పరిధిలో విస్తరించి ఉంటాయి:
- కటిప్రదేశం లేదా జననేంద్రియ ప్రాంతంలో గాయం
- నరాల సమస్యలు
- సమస్య ఉన్న భాగంలో ఇటీవల శస్త్రచికిత్స
- డయాబెటిస్ లేదా మల్టిపుల్ స్క్లేరోసిస్ వంటి వైద్య పరిస్థితులు
- మూత్రాశయం యొక్క కండరాల బలహీనత
- మలబద్ధకం
- కొన్ని మందులు
- మూత్ర నాళాల సంక్రమణం
- మూత్రనాళం లేదా మూత్రమార్గం యొక్క అవరోధం
మూత్రం నిలుపుదల రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
తీవ్రమైన మూత్రం నిలుపుదల లేదా దీర్ఘకాలిక మూత్రం నిలుపుదలను నిర్ధారించడానికి, వైద్యుడు కింది పరీక్షలను నిర్వహించవచ్చు
- భౌతిక పరీక్ష
- సిస్టోస్కోపీ
- CT స్కాన్లు
- మూత్రపిండ పరీక్షలు (మూత్రాశయం ఎంత బాగా మూత్రాన్నినిల్వచేస్తోంది, మూత్రనాళం ఎంత సమర్థంగా మూత్రాన్ని విడుదల చేస్తోందన్న విషయాన్ని ఈ పరీక్షలు విశదీకరిస్తాయి)
- ఎలెక్ట్రోమ్యయోగ్రఫీ (రుగ్మత సోకిన భాగంలో నరాల పనితీరుచర్యను కొలిచేందుకు మరియు నిర్ధారించేందుకు)
డాక్టర్ క్రింది పద్ధతుల ద్వారా మూత్రం నిలుపుదల రుగ్మతకు చికిత్స చేయవచ్చు:
- మూత్రనాళ విస్తరణ (Urethral dilation) (మూత్రం తొలగింపును ప్రోత్సహించడానికి మూత్రనాళ ద్వారాన్ని విస్తరించడం)
- యూరెథ్రాల్ స్టెంట్ ప్లేస్మెంట్ (మూత్రనాళాన్ని విస్తరించడానికి ఒక కృత్రిమ ట్యూబ్ ను చొప్పించడం)
- ప్రోస్టేట్ మందులు (మూత్రం నిలుపుదల యొక్క లక్షణాలను తగ్గించడానికి ప్రోస్టేట్ యొక్క పెరుగుదలను ఆపడానికి మందుల వాడకం)
- మూత్రాశయాన్ని కాలువ (జలదారి) ద్వారా ఖాళీ చేయడం (ట్యూబ్ను ఉపయోగించి మూత్రాశయాన్ని ఖాళీ చేయడం)
- శస్త్రచికిత్స (సర్జరీ)