డైపర్ దద్దుర్లు అంటే ఏమిటి?
డైపర్ దద్దుర్లు లేక “డైపర్ డెర్మాటిటిస్” అని కూడా పిలువబడే ఈ శిశు సమస్యలో శిశువు యొక్క పాయువు (ముడ్డి) చర్మంపై ఎరుపు రంగులో దద్దుర్లు ఏర్పడుతాయి. డైపర్, పరిశుభ్రత అభ్యాసాలు, టాయిలెట్ ట్రైనింగ్ మరియు పిల్లల పెంపకం పద్ధతుల అనుసరణలో ఉన్న వ్యత్యాసాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నివేదితమైన (reported) డైపర్ దద్దుర్లు భిన్నమైనవి. శిశువులలో, ఈ డైపర్ దద్దుర్ల అంచనా ప్రాబల్యం 7-35%. డైపర్ దద్దుర్లు శిశువు పుట్టిన తరువాత ఒక వారంలోపలే సంభవించవచ్చు. కానీ డైపర్ల గరిష్ట సంభవం 9-12 నెలల వయస్సు గల శిశువుల్లోనే ఉంటుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రధాన లక్షణాలు:
- చర్మం ఎరుపుగా కనిపించవచ్చు; సున్నితత్వం తొడలు, పిరుదులు లేదా జననాంగాల్లో సంభవించవచ్చు.
- పిల్లలు కేకలు పెట్టి ఏడుస్తారు మరియు అసౌకర్యంగా భాధపడతారు; డైపర్ ప్రాంతం తడిసిపోయినపుడు మరింత అసౌకర్యంతో శిశువులు ఓపట్టాన ఏడుపు మానరు.
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
డైపర్ దద్దుర్లు ఎక్కువగా డైపర్లను అసంబద్ధంగా మార్చడంవల్ల ఏర్పడతాయి. తడి డైపర్లను ఎక్కువకాలంపాటు ఉపయోగించడం లేదా డైపర్లను చాలా అరుదుగా మార్చడం కారణంగా దద్దుర్లు ఏర్పడతాయి.ఇలాంటి అసంబద్ధ డైపర్ మార్చే పద్దతులు చర్మం సున్నితత్వానికి దారితీస్తుంది. డైపర్ దద్దుర్ల సాధారణ కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- చర్మానికి దీర్ఘకాలంపాటు డైపర్ అతుక్కుని ఉండడంవల్ల ఈ శిశువుకు చికాకు, మంట వంటివి కలిగించవచ్చు.
- ఇన్ఫెక్షన్ - మూత్రంతో తడిసిన డైపర్ శిశువు ఒంటిపై చాలా కాలం పాటు ఉన్నప్పుడు చర్మం pH (potential of Hydrogen) ను మార్చవచ్చు; అందువలన సూక్ష్మజీవుల (బాక్టీరియా) పెరుగుదలకు అనుకూలత ఏర్పడి శిశువుకు ఇన్ఫెక్షన్ అవచ్చు.
- అలెర్జీ - కొన్ని డైపర్ల తయారీ పదార్థం (the material woven with) శిశువుల లేతచర్మానికి సున్నితత్వాన్ని కలుగచేయవచ్చు.
డైపర్ దద్దుర్లను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఎరుపు రంగుదేలిన ఎర్రని దద్దుర్లను (రెడ్ పాచెస్) పరిశీలించడం ద్వారా మరియు శిశువు యొక్క మొత్తం ప్రవర్తనను గమనించడం ద్వారా డైపర్ దద్దుర్లను నిర్ధారణ చేయవచ్చు. డైపర్ దద్దుర్లకు ప్రత్యేకమైన పరీక్షలు అవసరం లేవు మరియు ఇంట్లో కూడా దీనికి చికిత్స చేసుకోవచ్చు.
చికిత్స:
- తేలికపాటి స్టెరాయిడ్ క్రీమ్ ఉపయోగించండి.
- యాంటీ ఫంగల్ క్రీమ్.
- పైపూతకు ఉపయోగించే యాంటీబయాటిక్స్.
- స్వీయ రక్షణ చిట్కాలు:
- శిశువుకు డైపర్ ను వేసిన చర్మ భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి. మరియు డైపర్ ను వేసిన చర్మ భాగాన్ని శుభ్రపరుస్తున్నపుడు సున్నితంగా వ్యవహరించండి.
- బట్టతో తయారైన డైపర్లను బ్లీచ్లో శుభ్రం చేయండి. లేక 15 నిమిషాల పాటు బట్ట డైపర్ లను వేన్నీళ్ళతో కాచండి.
- బట్ట డైపర్లను ఉతికేటపుడు డిటర్జెంట్ సోపు పూర్తిగా బట్టనుండి తొలగిపోయేవరకూ నీటిలో బాగా శుభ్రం (rinse) చేయండి/నీళ్లలో ౙాడించండి. .
- శిశువుకు డైపర్ వేసే భాగంలో బాగా గాలి ఆడనివ్వండి. అంటే కొంతసేపు డైపర్ లేకుండా బిడ్డను అలాగే ఉంచడం ద్వారా డైపర్ వేసే భాగంలో శుశువుకు బాగా గాలి తాకనివ్వండి.
- దద్దుర్లుపైన సున్నితమైన లోషన్లు/సారాంశాలు (creams) ఉపయోగించండి.
- సాలిసిలేట్ (Salicylates), బెంజోయిక్ (benzoic) ఆమ్లాలు, కర్పూరం, బోరిక్ ఆమ్లం, మరియు ఫినాల్ కలిగిన ఉత్పత్తులను శిశువుకు వాడకండి.
- వెచ్చని నీరు మరియు సువాసన లేని సబ్బులుతో ప్రతిరోజు మీ బిడ్డకు స్నానం చేయించండి. .
డైపర్ దద్దుర్లు అనేది సరైన చికిత్సతో వేగంగా పరిష్కరించగల శిశు సమస్య. అయినప్పటికీ, మంచి ఆరోగ్యపరమైన మరియు పరిశుభ్రమైన అభ్యాసాల సహాయంతో శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించడం మంచిది.