డయాబెటిక్ న్యూరోపతీ అంటే ఏమిటి?
చక్కెరవ్యాధితో కూడిన నరాల వ్యాధి లేదా డయాబెటిక్ నరాలవ్యాధి అనేది నరాల సమస్యగా చెప్పవచ్చు, ఇది మధుమేహం యొక్క సమస్యగా కనిపిస్తుంది. ఇది కేవలం చేతులు మరియు కాళ్ళలో వ్యాధి లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది. డయాబెటిక్ జనాభాలో దాదాపు 50% డయాబెటిక్ నరాలవ్యాధిని కలిగి ఉంటారు, మధుమేహం యొక్క దీర్ఘకాలిక రోగుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. మీ రక్తంలో గ్లూకోస్ స్థాయిని సరిగా నిర్వహించడం వలన ఈ రుగ్మతను నిరోధించవచ్చు.
డయాబెటిక్ నరాలవ్యాధి క్రింది రకాలను కలిగి ఉంటుంది:
- చేతులు మరియు పాదాల యొక్క తిమ్మిరి, నొప్పి లేక జలదరింపు కి కారణమయ్యే పరిధీయ నరాల వ్యాధి
- మీ శరీర వ్యవస్థను నియంత్రించే నరాలను ప్రభావితం చేసే స్వతంత్ర నరాలవ్యాధి (Autonomous neuropathy)
- చేయి, కాలు, తల, మరియు మొండెంలలో ఒకే నరాన్ని బాధించే ‘ఫోకల్ న్యూరోపతీ’
- సన్నిహిత నరాలవ్యాధి (proximal neuropathy), శరీరం వెనుక లేదా కింది వైపు వచ్చే వ్యాధి రకం, తుంటి, పిరుదులు, లేదా తొడ యొక్క నరాలను బాధిస్తుంది. ఇది శరీరం యొక్క ఒక వైపు మాత్రమే బాధిస్తుంది, చాలా అరుదుగా రెండో వైపు కూడా బాధిస్తుంది. ఇది తీవ్రమైన నొప్పిని కల్గిస్తుంది మరియు గణనీయమైన బరువు నష్టానికి కారణమవుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
డయాబెటిక్ నరాలవ్యాధి లక్షణాలు దాని రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
పరిధీయ నరాలవ్యాధి విషయంలో, క్రింది లక్షణాలు సంభవిస్తాయి:
- పాదాల్లో స్పర్శజ్ఞానాన్ని కోల్పోవడం లేదా పాదాల్లో మండేనొప్పి లేదా పోటునొప్పి
- సంతులనం లేదా సమన్వయం కోల్పోవడం
- తాకితే పెరిగిపోయే సున్నితత్వం
స్వతంత్ర నరాలవ్యాధి అంతర్గత అవయవాలకు సంబంధించిన నరాలను బాధిస్తుంది కాబట్టి, దీని లక్షణాలు:
- జీర్ణ సమస్యలు
- తగ్గిన రక్తపోటు
- నిగ్రహరాహిత్యం లేక ఆపుకొనలేనితనం
- మూర్ఛ మరియు మైకము
- చెమట పట్టడం ఎక్కువ కావడం
- నొప్పి యొక్క తక్కువ అవగాహన
ఒకే నరాన్నీ బాధించే కేంద్ర నరాల వ్యాధి (ఫోకల్ నరాలవ్యాధి)లో ఆ నేరానికి కల్గిన బాధను బట్టి ఈ క్రింది వ్యాధి లక్షణాలు గుర్తించబడతాయి:
- తొడల నొప్పి
- దిగువ వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి (మరింత సమాచారం: నడుము నొప్పి కారణాలు)
- గుండెపోటులా అనిపించే ఛాతీ నొప్పి
- దృష్టి సమస్యలు, కళ్ళ కేంద్రీకరణచర్యలో చిక్కులు
- వినికిడి సమస్యలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
డయాబెటిక్ నరాలవ్యాధికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఈ రుగ్మతకు కారణమయ్యే కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి
- రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు, ఇది నరాల్లో రసాయనాల మార్పులకు దారితీస్తుంది, ఇంకా ఈ నరాలకు పోషణను అందించే రక్తనాళాలను, నరాలను కూడా దెబ్బ తీయడం జరుగుతుంది.
- డయాబెటిక్ నరాలవ్యాధి జన్యు లక్షణాల కారణంగా వారసత్వంగా పొందవచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పూర్తి భౌతిక పరీక్ష తరువాత, మీ డాక్టర్ కింది విషయాల్ని మీకు చెప్పవచ్చు
- కండరాల బలం మరియు కండర ప్రతిచర్యల్ని తనిఖీ చేయండి
- బాధకు గురైన స్థానంలో, కంపన కదలికలు, ఉష్ణోగ్రత, మరియు తేలికపాటి తాకిడితో కండరాల సున్నితత్వం తనిఖీ చేయండి
- ఎలక్ట్రోమియోగ్రఫీ, నరాల ప్రసరణ అధ్యయనాలు, ఆల్ట్రాసౌండ్, మరియు నరాల బయాప్సీ వంటి అదనపు పరీక్షలకు అభ్యర్థన.
ఈ రుగ్మతకు చికిత్స రోగి వయస్సు, ఆరోగ్యం మరియు వైద్య చరిత్రపై ఆధారపడి ఉంటుంది. రోగి నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గించేందుకు నొప్పినివారణ మందులతో చికిత్స చేస్తారు. ఆందోళన లేదా వ్యాకులత నివారిణా మందులు (యాంటిడిప్రేసంట్) పైపూతకు క్రీములారూపంలో ఉండే మందులు, యోచిత సారాంశాలు, ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రిక్ నర్వ్ స్టిమ్యులేషన్ థెరపీ, సడలింపు థెరపీ (relaxation therapy), మరియు ఆక్యుపంక్చర్ చికిత్సల్ని నరాలకు అదనపు నష్టాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు.