డయాబెటిక్ గాస్ట్రోపరేసిస్ అంటే ఏమిటి?
కడుపులోని పదార్థాలు చిన్న ప్రేగుల్లోకి చేరడం ఆలస్యం కావడాన్నే “గాస్ట్రోపరేరిస్” అనే రుగ్మత గా పరిగణించబడుతుంది. చిన్న ప్రేగులోనికి కడుపులో ఉన్న ఆహారం యొక్క కదలిక తగ్గిపోతుంది లేదా ఆగిపోతుంది. చక్కెరవ్యాధి కల్గినవాళ్లకు గాస్ట్రోపరేరిస్ పరిస్థితి ఏర్పడితే దాన్నే “డయాబెటిక్ గాస్ట్రోపరేసిస్” అంటారు. ఒకటో రకం మరియు రెండో రకం చక్కెరవ్యాధి ఉన్న వ్యక్తులు ఈ వ్యాధికి గురికావచ్చు. సాధారణంగా, మనం ఆహారాన్ని తిన్నప్పుడు, అది కడుపులో మరింత మథనానికి గురవుతుంది, అటుపై అది చిన్న ప్రేగులోకి ప్రవేశింపబడుతుంది. గ్యాస్ట్రోపరేసిస్ తో బాధపడుతున్నవారికి వారి కడుపు కండరాలు సరిగా పనిచేయవు మరియు కడుపులోని ఆహారపదార్థాలను ఖాళీ చేయడానికి చాలా సమయం పడుతుంది.
డయాబెటిక్ గాస్ట్రోపరేసిస్ ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
డయాబెటిక్ గాస్ట్రోపరేసిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:
- భోజనాన్ని తినేందుకు ప్రారంభించిన వెంటనే కడుపు పూర్తిగా నిండిపోయిందన్న భావనను అనుభవిస్తారు
- వికారం
- వాంతులు
- ఉబ్బరం
- త్రేనుపు
- ఆకలి లేకపోవడం,లేక ఆకలి తక్కువ అవడం
- గుండెల్లో మంట
- ఎగువ ఉదరంలో నొప్పి (మరింత సమాచారం: కడుపు నొప్పి యొక్క కారణాలు)
కడుపు యొక్క కదలికను తగ్గించే కొన్ని మందులు గ్యాస్ట్రోపరేసిస్ యొక్క లక్షణాలను మరింత పెంచుతాయి. .
డయాబెటిక్ గాస్ట్రోపరేసిస్ ప్రధాన కారణాలు ఏమిటి?
చాలా సందర్భాలలో, గ్యాస్ట్రోపరేసిస్ యొక్క అంతర్లీన కారణం తెలియదు. అయినప్పటికీ, చక్కెరవ్యాధి గ్యాస్ట్రోపరేసిస్ యొక్క అత్యంత సాధారణ కారణం. చక్కెరవ్యాధి కడుపు కండరాలను కలిగి ఉన్న వాగస్ నాడిని దెబ్బతీస్తుంది. వాగస్ నాడి దెబ్బతిన్నప్పుడు లేదా పని చేయకపోయినా, కడుపు మరియు చిన్న ప్రేగుల కండరాలు సాధారణంగా పనిచేయవు.
డయాబెటిక్ గాస్ట్రోపరేరిస్ ని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ డాక్టర్ మీరు తీసుకుంటున్న మందులు, శస్త్రచికిత్స చరిత్ర లేదా ఏ ఇతర ఆరోగ్య సమస్యలతో సహా వివరణాత్మక వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటారు. పూర్తిస్థాయి భౌతిక పరీక్ష జరుగుతుంది, రక్తపోటు మరియు ఉష్ణోగ్రత తనిఖీ, అసాధారణ ఉదర శబ్దాల తనిఖీ మరియు నిర్జలీకరణకు సంబంధించిన సంకేతాలను వైద్యుడు తనిఖీ చేస్తారు..
ఈ రుగ్మతకు చేసే పరీక్షలు:
- 4-గంటల గ్యాస్ట్రిక్ ఎమ్ప్టింగ్ సింటిగ్రఫీ - ఈ విధానం గ్యాస్ట్రిక్ ఖాళీచేయడం (gastric emptying)లో అసాధారణ లక్షణాలను గుర్తించడానికి ప్రత్యేక రేడియోధార్మిక పదార్థాన్ని ఉపయోగిస్తుంది.
- అల్ట్రాసోనోగ్రఫీ మరియు ఎం.ఆర్.ఐ కడుపును ఖాళీ చేయడంలో సమాచారాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి, కానీ ఇందుకు నిపుణుల పనితనం అవసరం.
- గ్యాస్ట్రోపోరేసిస్ నిర్ధారణకు సింగల్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (SPECT) ఇమేజింగ్ను ఉపయోగించవచ్చు.
ఇన్సులిన్ తో మీ రక్తం గ్లూకోస్ స్థాయిని నియంత్రించడం ద్వారా డయాబెటిక్ గాస్ట్రోపరేరిస్ కు ఉత్తమంగా చికిత్స చేయబడుతుంది. ప్రోకినిటిక్స్ మరియు యాంటిఎమెటిక్స్లు కడుపు నుండి చిన్న ప్రేగు వరకు ఆహార కదలికను వేగవంతం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది కూడా నెమ్మదిగా తినడం, మీ ఆహారాన్ని బాగా నమలడం, చిన్న చిన్న ప్రమాణాల్లో భోజనం తినడం, భోజనం తర్వాత నిటారుగా కూర్చునేది అభ్యసించడం, భోజనం తర్వాత నడక వంటివి చేయాల్సి ఉంటుందని మీకు సలహా ఇవ్వడమైంది. భోజనం తర్వాత కనీసం 2 గంటలు పడుకోవద్దు. మీ డాక్టరు మీ ఆహారం లో కొవ్వు మరియు ఫైబర్ ను తగ్గించడానికి మీకు సలహా ఇవ్వవచ్చు. మద్యం మరియు కార్బోనేటేడ్ పానీయాలను తాగొద్దు. శరీరంలో నీటిని కావాల్సినంతగా నింపుకుని ఉండేందుకు నీరు మరియు ఎలెక్ట్రోలైట్స్ ను పుష్కలంగా తాగండి.