డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ అంటే ఏమిటి?
డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్(DH) అనేది బొబ్బలతో కూడిన చర్మ దద్దురు ఇది గ్లూటెన్ తీసుకోవడం ద్వారా సంభవిస్తుంది. దీనిని డుహ్రింగ్స్ వ్యాధిగా కూడా పిలుస్తారు మరియు ప్రేగు వెలుపల సెలియాక్ వ్యాధి యొక్క లక్షణం. ఇది స్వయం ప్రతిరక్షక (autoimmune) వ్యాధి, మరియు డెర్మాటిటిస్ హెర్పెటిఫార్మిస్ తో ఉన్న వారిలో చాలా శాతం మందికి గ్లూటిన్ సెన్సిటివ్ ఎంటెరోపతి (gluten-sensitive enteropathy) ఉంటుంది. సెలియాక్ వ్యాధి ఉన్నవారికి డెర్మాటిటిస్ హెర్పెటిఫార్మిస్ వచ్చే ప్రమాదం ముందే నిర్ణయించబడుతుంది. ఇది భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లక్షణాలు:
- శరీరం రెండు వైపులా దురదతో కూడిన గడ్డలు లేదా బొబ్బలు
- గుంపులుగా ఏర్పడే చిన్న చిన్న బొడిపెలు
- పంటి ఎనామెల్ లో లోపాలు
డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ ప్రధానంగా ప్రజల యొక్క క్రింది సమూహాలను ప్రభావితం చేస్తుంది:
- 15-40 సంవత్సరాల వయస్సులో ఉండే కాసెసియన్లు (Caucasians) లో
- ఎక్కువగా పురుషులు ప్రభావితం అవుతారు
- 20 సంవత్సరాల లోపు వయస్సున్న మహిళలు
- జన్యు పరంగా సంక్రమించే ప్రమాదం ఉన్నవారు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ కు ప్రధాన కారణం చర్మం కణజాలంలో ఇమ్యునోగ్లోబులిన్ A యొక్క నిక్షేపణ (ఎక్కువగా చేరడం), అప్పుడు ఇది పుండు ఏర్పడటానికి దోహదపడుతుంది. డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ ఉన్నవారిలో హైపో థైరాయిడిజం కూడా ఉండే అవకాశం ఉంది. సమస్యలు వీటిని కలిగి ఉంటాయి:
- దంత సమస్యలు
- గుండె సమస్యలు
- పునరావృత్తమయ్యే గర్భస్రావాలు
- అసాధారణ కాలేయ పనితీరుకి కారణమయ్యే కాలేయ కొవ్వు వ్యక్తి (ఫ్యాట్టి లివర్)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ ప్రధానంగా వీటిని ఉపయోగించి నిర్ధారించవచ్చు:
- చర్మ జీవాణుపరీక్ష (బయాప్సీ)
- పోషకాహార లోప పరీక్ష
- రక్త పరీక్షలు
- చిన్న ప్రేగు జీవాణుపరీక్ష (బయాప్సీ)
రోగి సహన శక్తి ఆధారంగా డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ ను సల్ఫోన్ (sulfone) లేదా సల్ఫా మందుల (sulfa drugs) తో చికిత్స చేస్తారు. కొన్ని స్టెరాయిడ్లను కూడా అవసరమవ్వచ్చు.
స్వీయ రక్షణ చిట్కాలు:
- గ్లూటిన్ ఉన్న ఆహారాన్ని నివారించాలి.
- వ్యాధి యొక్క పురోగతి మరియు ఔషధాల యొక్క ప్రభావాన్నితెలుసుకోవడానికి క్రమముగా వైద్యులని సంప్రదించాలి.
- ఆహార ఉత్పత్తులు గ్లూటెన్ రహితంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి లేబుళ్ళను చదవాలి.
- మాంసాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, మరియు కూరగాయలు వంటి ఆహారాలు తినాలి.
- ధాన్యపు గింజలు (Cereal grains), చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు మరియు దుంపలు అనేవి ఇతర సురక్షిత ప్రత్యామ్నాయాలు.
గ్లూటెన్ను నివారించడం ద్వారా డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ను నివారించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు. అనేక మంది ప్రజలు గ్లూటెన్ రహిత ఆహారం తీసుకోవడం ద్వారా వారి డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ సమస్య తగ్గిపోయిందని తెలిపారు. అందువల్ల, తగిన జీవనశైలి మార్పులను డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ను నిర్వహించడం కోసం పాటించాలి.