సిస్టైటిస్ అంటే ఏమిటి?
సిస్టైటిస్ అనేది మూత్రాశయంలోని వాపుకు కారణమయ్యే ఒక సాధారణ సంక్రమణం. ఇది మూత్ర మార్గము క్రింది భాగంలో సంక్రమిస్తుంది (ఇన్ఫెక్షన్) మరియు పురుషులతో పోల్చితే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. 25 సంవత్సరాల వయసు పై బడిన వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, మరియు వారు ఆసుపత్రిలో చేరడానికి ప్రధాన కారణం అవుతుంది. సిస్టైటిస్ ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా ఉన్నారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- నిరంతరమైన మరియు బలమైన మూత్రవిసర్జన కోరిక (మరింత సమాచారం: తరచూ మూత్రవిసర్జన కారణాలు)
- మూత్రవిసర్జన సమయంలో మంట
- ముదురు రంగు మరియు బలమైన వాసనతో కూడిన మూత్రం
- తొడ ఎముకల ప్రాంతంలో అసౌకర్యం
- తేలికపాటి జ్వరం
- మూత్రంలో రక్తం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇది చాలా తరచుగా బాక్టీరియా సంక్రమణ వలన సంభవిస్తుంది. చికిత్స చేయని పక్షంలో, ఈ అంటురోగం మూత్రపిండాల వరకు వ్యాపించి వాటిని కూడా ప్రభావితం చేయగలవు అది పైలొనెఫ్రిటిస్ (pyelonephritis) దారితీస్తుంది. ఆడవారి మూత్ర నాళము చిన్న పరిమాణంలో ఉండడం వలన పురుషులు కంటే స్త్రీలలో తరచుగా ఈ వ్యాధి సోకుతుంది.
ఇతర కారణాలు:
- మూత్రాశయ కార్యకలాపాలలో లోపం.
- మూత్రాశయాన్ని చికాకు పెట్టె ఏదైనా బయటి పదార్థం.
- మూత్రాశయం యొక్క నరాలు పనిచేయకపోవడం.
- రోగనిరోధక వ్యవస్థ యొక్క రుగ్మత కూడా కొన్నిసార్లు సిస్టైటిస్ కు దారి తీయవచ్చు.
- మూత్రాశయ రాళ్లు
అరుదుగా, ఇది మందులు, రేడియేషన్ థెరపీ లేదా స్త్రీలకు శుభ్రత కోసం ఉపయోగించే స్ప్రేలు లేదా స్పెర్మిసైడ్లు (spermicides) లో ఉండే ఇరిటెంట్లు కారణంగా కూడా సంభవించవచ్చు. కాథెటర్ (మూత్రం సేకరించే గొట్టము) సంబంధిత మూత్ర మార్గ అంటువ్యాధులు కూడా సాధారణం.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
మొదటిగా, ఇతర సమస్యల సాధ్యతను నిర్ములించడానికి వ్యాధి లక్షణాలు, వాటి వ్యవధి, మరియు రోజువారీ కార్యకలాపాల పై వాటి ప్రభావాన్ని అంచనా వేస్తారు. రోగ నిర్ధారణలో ఇవి ఉంటాయి:
- శారీరక మరియు నరాల సంబంధ పరీక్షలు
- నొప్పి అంచనా పరీక్షలు మరియు మూత్ర విసర్జన పరీక్షలు (urine voiding tests)
- మూత్ర విశ్లేషణ
- మూత్రంలో సంక్రమణను గుర్తించడానికి మూత్ర సాగు
- సిస్టోస్కోపీ (Cystoscopy) - మూత్రాశయం లోపలికి భాగాలను పరిశీలించడానికి ఒక గొట్టానికి కెమెరాను బిగిస్తారు.
- అల్ట్రాసోనోగ్రఫీ మరియు పెల్విస్ యొక్క ఎక్స్-రే వంటి ఇమేజింగ్ పరీక్షలు
సిస్టైటిస్ చికిత్స కోసం వ్యాధికారక జీవిని నిర్మూలించడానికి యాంటీబయాటిక్స్ను ఉపయోగిస్తారు. స్వల్ప సంక్రమణ కోసం, యాంటీబయాటిక్ కోర్సు ఆడవారికి 3 రోజులు మరియు మగవారికి 7-14 రోజులకు మించకపోవచ్చు. లక్షణాలు మెరుగుపడినప్పటికీ, పూర్తి యాంటీబయాటిక్ కోర్సును వాడడం తప్పనిసరి. ఆమ్లత గుణాలు వ్యాధికారక జీవులను చంపుతాయి కాబట్టి, ఓస్-ది-కౌంటర్ మందులు మరియు ఆస్కార్బిక్ ఆమ్లం (ascorbic acid) ఉండే కొన్ని ఆమ్ల ఉత్పత్తులు ఈ సంక్రమణపై ప్రభావవంతంగా ఉండవచ్చు.
జీవనశైలి మార్పులు వీటిని కలిగి ఉంటాయి:
- నీటి పుష్కలంగా తాగాలి
- ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆ ప్రాంతంలో వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలి
- అసౌకర్యాన్ని కలిగించే ఆహారాల జాబితాను తయారు చేసి వాటిని నివారించాలి.
- మసాలాలు, చాక్లెట్ మరియు కెఫిన్ వంటి కొన్ని ఆహారా పదార్దాలను నివారించాలి.
- మూత్ర విసర్జన సమయంలో మూత్రాన్ని పట్టి ఉంచడం ద్వారా మూత్రాశయ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.
- మూత్ర విసర్జన తర్వాత, ప్రత్యేకించి స్త్రీలు మూత్రనాళ సంక్రమణలు వ్యాపించకుండా నివారించడానికి ముందు నుండి వెనుకకు తుడుచుకోవాలి.
- స్నానాల తొట్టిలో స్నానం చేయడం బదులుగా షవర్లను ఉపయోగించడం సంక్రమణను తగ్గిస్తుంది.
సిస్టైటిస్ ను సరిగ్గా పట్టించుకోకపోతే అది అసౌకర్యవంతంగా తయారవుతుంది, కానీ సాధారణంగా సరైన చికిత్సతో సులభంగా మరియు సమర్థవంతంగా దీనిని నివారించవచ్చు.