మెల్లకన్ను - Cross-Eyes in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

November 30, 2018

October 29, 2020

మెల్లకన్ను
మెల్లకన్ను

మెల్లకన్ను అంటే ఏమిటి?

మెల్లకన్ను, వైద్యపరంగా స్ట్రాబిస్మస్ (strabismus) అని పిలుస్తారు, అది కళ్ళ యొక్క క్రమరహిత స్థితి. ప్రభావిత వ్యక్తి రెండు కళ్ళుతో ఒకే  దిశను చూడలేడు. ఒక కన్ను లోపలికి వెళ్ళిపోయినట్టు (ఎసోట్రోపియా,esotropia), వెలుపలికి వచ్చినట్టు (ఎక్సోట్రోపియా,exotropia), పైకి ఉన్నట్టు (హైపెర్ట్రోపియా,hypertropia), లేదా క్రిందికి ఉన్నట్టు (హైపోట్రోపియా,hypotropia) ఉండవచ్చు. మెల్లకన్నుకి  సాధారణంగా ఉపయోగించే మరొక పదం వరస తప్పిన కళ్ళు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెల్లకన్ను యొక్క సంకేతాలు మరియు లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి  

  • ఒకే దిశలో చూడవలసివచ్చినప్పు ఒకే వరసలో లేని కళ్ళు  
  • వరసలో లేని కళ్ళ బదులు కోసం అసాధారణ తల భంగిమ
  • సుదీర్ఘ దూరాన్ని లేదా సూర్యకాంతిని చూసేటందుకు  వంకరగా చూడడం లేదా ఒక కన్ను మూసి చూడడం
  • కళ్ళు రుద్దుకోవడం

వ్యక్తికీ ఎప్పుడూ లక్షణాలు ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు ఉండే లక్షణాలు ఉన్నాయి

  • రెండుగా కనిపించడం లేదా చీలిపోయినట్టు కనిపించడం
  • అలసట
  • అస్థిర రూపాలు కనిపించడం
  • ఒక కన్ను అమరిక బయటకు వెళ్ళిపోతున్న భావన
  • అధికమైన దూరదృష్టి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది పెద్దలలో సంభవించినప్పటికీ, శిశువులు మరియు పిల్లల్లో మెల్లకన్నును ఎక్కువగా గమనించవచ్చు.

సాధారణ కారణాలు

  • చిన్నతనంలో సరిగ్గా అభివృద్ధి చెందని కంటి సమన్వయం
  • అధికమైన దూరదృష్టి (హైపెరోపియా)
  • కంటి కండరాలు, నరముల సమస్యలు లేదా కంటి కదలికను ప్రభావితం చేసే మెదడు సమస్యలు
  • మానసిక అఘాతం, స్ట్రోక్, లేదా ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలు

ప్రమాద కారకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • మెల్లకన్ను యొక్క కుటుంబ చరిత్ర
  • డౌన్ సిండ్రోమ్ లేదా మస్తిష్క పక్షవాతం
  • అధికమైన సరిచెయ్యని దూరదృష్టి

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

మెల్లకన్ను నిర్ధారణ మరియు చికిత్సకు  సమగ్ర కన్ను పరీక్ష అవసరం. లక్షణాల యొక్క కుటుంబ చరిత్రకు సంబంధించిన విషయాలను వైద్యులు అడగవచ్చు. దృష్టిని మరియు కంటి సమన్వయమును అంచనా వేయడానికి ఒక నేత్ర వైద్యులు కొన్ని పరీక్షలను నిర్వహిస్తారు. వాటిని పరిశీలించడానికి పరీక్షలు ఉన్నాయి

  • విజువల్ ఎక్యూటీ (Visual Acuity): ఈ పరీక్ష కంటి చూపు ఎంత వరకు ప్రభావితమైందో అంచనా వేస్తుంది. ఈ పరీక్షలో వివిధ పరిమాణాలలో ఉన్న అక్షరాలను దూరం నుండి చదవడం ఉంటుంది, ఇది కంటి చూపు సామర్ధ్యం గురించి సూక్ష్మమైన ఫలితం ఇస్తుంది.
  • రిఫ్రాక్టివ్ ఎర్రర్ (Refractive Error):  లోపాన్ని భర్తీ చేసి అవసరమైన లెన్స్ శక్తిని నిర్ధారించడానికి వైద్యులు రిఫ్రాక్టివ్ ఎర్రర్ ను నిర్ధారిస్తారు
  • కంటి ఆరోగ్యం: వైద్యుడు కళ్ళ ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి స్ప్లిట్ లెన్స్ సూక్ష్మదర్శిని (split lens microscope) ని ఉపయోగించవచ్చు.

మెల్లకన్ను చికిత్స ఈ విధంగా ఉంటుంది

  • కళ్ళజోళ్ళు లేదా కాంటాక్ట్ లెన్సులు
  • చూపు చికిత్స (Vision therapy)
  • కంటి శస్త్ర చికిత్స (Eye surgery)