సారాంశం
దగ్గు అనేది శ్వాసకోశ మార్గాలు మరియు గొంతులోని శ్లేష్మం మరియు పొగ లేదా ధూళి వంటి చికాకులను తొలగించే ఒక ఒత్తిడితో కూడిన చర్య. పొడి దగ్గు గొంతులో ఎటువంటి కఫాన్ని (చిక్కని శ్లేష్మం) ఉత్పత్తి చేయకుండా కిచ్ కిచమనే సంచలనాన్ని కలిగిస్తుంది. అయితే తడి దగ్గు కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది వాయుమార్గాన్ని శుభ్రం చేస్తుంది. చాలామందిలో, ఏ మందుల అవసరం లేకుండా మూడు వారాల లోపు దగ్గు తగ్గిపోతుంది. అయితే, దగ్గు నిరంతరంగా ఉంటే కనుక, తక్షణ చికిత్స కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.
ఉదాహరణకు, ఫ్లూ, సైనసైటిస్, లారింజైటిస్, అలెర్జిక్ రినైటిస్ లేదా ఆస్తమా, దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక వ్యాధులు నిరంతర దగ్గును కలిగించేటువంటి అనేక ఆరోగ్య సమస్యలు. స్వల్పకాలిక దగ్గుకు మందులు అవసరం ఉండదు ఎందుకంటే అది కొన్ని వారాలలోనే తగ్గిపోతుంది. తగినంత ద్రవాలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం మరియు సాధారణ గృహ చిట్కాలు దగ్గును తగ్గించడంలో సహాయపడతాయి. ఒక నిర్దిష్ట కారణం వలన దగ్గు సంభవిస్తే, ఆ కారణానికి చికిత్స చేయడం వలన దగ్గు తగ్గుతుంది. అరుదైన సందర్భాల్లో, నిరంతర దగ్గు ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య వలన కావచ్చు, ఉదాహరణకు, క్షయవ్యాధి లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటివి, వీటికి సకాలంలోనే చికిత్స అందించాలి. ఈ వ్యాసంలో దగ్గు గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.