ఆచరణ పరంగా ఎవరికైనా సాధారణ జలుబు రాకుండా పూర్తిగా నివారించడం అనేది అసాధ్యం. ఇందుకు బాహ్య కారణాలెన్నో. అలాంటి కారణాల్లో ప్రముఖమైనవి పర్యావరణం మరియు చుట్టూ ఉన్నవాళ్ళే. అయితే, మనం మరియు మా కుటుంబసభ్యులకు కాలానుగుణంగా లేదా పదే పదే కొన్ని సూక్ష్మజీవుల ద్వారా రోగాలు సంక్రమించకుండా నిరోధించడానికి ప్రయత్నించదగ్గ కొన్ని చర్యలున్నాయి.
క్రమం తప్పకుండా మీ చేతులను కడగాలి
క్రమం తప్పకుండా చేతులను కడగడమనేది సాధారణ జలుబు నుండి నిరోధించే ఉత్తమమైన మరియు భద్రమైన మార్గంగా చెప్పవచ్చు. చేతులను కడుక్కోవడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి సార్వత్రిక ప్రాంతాలను సందర్శించిన్నపుడు అక్కడ పలువురు ముట్టుకునేటువంటి తలుపుల గుబ్బలు (door knobs), మెట్లనెక్కేటపుడు ఊతకోసం లభించే స్టెయిర్ కేసు సపోర్ట్ కమ్ములు వగైరాలను తాకడం జరుగుతుంది. కనుక చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఉత్తమం.
ఒకవేళ మీరు జలుబు బాధిత వ్యక్తికి సమీపంలో ఉన్ననూ, ఆ వ్యక్తి నుండి మీ దరికి చేరే సూక్ష్మక్రిములను నాశనం చేయడానికి మీకుండే తరచు చేతులను కడుక్కునే అలవాటు సహాయపడుతుంది. మీరు సార్వత్రిక స్థలాలకు వెళ్లేటప్పుడు చేతుల్ని శుభ్రపరుచుకునే “హ్యాండ్ శానిటైజర్ల”ను మీతో పాటు తీసుకెళ్ళటం ఉత్తమం. దీనిద్వారా మీకు జలుబును దాపురింపజేసే సూక్ష్మక్రిములు, ఇతర రోగకారక క్రిములను చంపడానికి ఇది సహాయపడుతుంది. అంతేగాక, మీ పిల్లలకు కూడా చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలి.
మీరు సార్వత్రిక ప్రదేశానికి వెళ్ళినపుడు సూక్ష్మ క్రిములుండే ఉపరితలాలను తాకడం, లేదా జలుబు సోకిన వ్యక్తిని కలిసిన తర్వాత మీ చేతులతో మీ ముక్కు, నోరు మరియు కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తాకవద్దు. చేతుల్ని శుభ్రపర్చుకునేంతవరకూ ఇలా మీ ముఖాన్ని తాకకుండా నివారించడం మంచిది. ఇలా చేయడం ద్వారా మీరు మీ శరీరంలోకి సూక్ష్మక్రిములు ప్రవేశించకుండా ఆపినవారవుతారు.
సిగరెట్ల పొగ, అందులో ఉండే తారు వంటి పదార్ధం మన ముక్కు మరియు ఊపిరితిత్తుల శ్వాసమార్గాల్లో మంటను పుట్టించడమో లేక చికాకుపరచడమో జరుగుతుంది. అంతేగాక ధూమపానం వల్ల సాధారణ జలుబు, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యే సంభావ్యత ఎక్కువగా ఉంది. మీరు ఆశ్చర్యపోవచ్చు కాని మీరు పొగతాగడం కేవలం మీకే కాదు మీ పిల్లలపైన కూడా ప్రభావం చూపి సాధారణ జలుబును మీకు, మీ పిల్లలక్కూడా దాపరింపజేసే అవకాశం కల్పిస్తుంది.
మీ కుటుంబంలోని సభ్యులెవరికైనా సాధారణ జలుబు వచ్చినపుడు ఒకసారి వాడి పారవేయదగ్గ పాత్రల్ని (use and throw utensils) మరియు స్నానాలగదిలో కాగితపు తువ్వాళ్ల (Paper napkins) వంటి వాటిని వాడమని వారికి సిఫారస్ చేయండి. ఇలా జాగ్రత్త తీసుకోవడం మూలంగా జలుబుకారక సూక్ష్మజీవులు మొత్తం కుటుంబ సభ్యులకందరికీ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
వంటగదిలో మరియు బాత్రూంలో కాగితపు తువ్వాళ్లతో మీ చేతులను పొడిగా ఉంచండి:
అంటువ్యాధులు అనేక రోజులు వస్త్రపు తువ్వాళ్లలో దాగివుంటాయని అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి. అందువల్ల, పరిశుభ్రతను కాపాడటం మరియు తరచూ తువ్వాళ్లను ఉతకడం చాలా మంచిది. ప్రత్యామ్నాయంగా కుటుంబానికి చెందిన ప్రతి సభ్యునికి ప్రత్యేక టవల్ మరియు అతిథుల కోసం ప్రత్యేకమైన తువ్వాల్ ఉండాలి.
ఇంకనూ ముఖ్యమైన విషయమేమంటే మీకే గనుక జలుబు సోకినట్లయితే, మీరు టాయిలెట్లో ఉపయోగించే కాగితపు రుమాళ్ళను (paper knapkins) సరిగ్గా పారవేయాల్సిన అవసరం ఉంది. కాగితపు రుమాళ్ళను ఉపయోగించిన తర్వాత సరిగా తొలగించకపోతే, అది సూక్ష్మజీవుల యొక్క పెంపకానికి/పెరుగుదలకు దారితీయవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించండి:
వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం వల్ల సాధారణ జలుబును నివారించడానికి వీలవుతుంది, ఎందుకంటే పోషకాహారం రోగనిరోధకతను పెంచుతుంది కాబట్టి. ఆరోగ్యవంతమైన జీవనశైలి అంటే సరైన నిద్ర, ఆరోగ్యకరమైన పోషకాహారం తినడం, క్రమమైన వ్యాయామం దైనందిన జీవితంలో అలవర్చుకోవడమన్నమాట. దీని వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా వ్యాధికారక సూక్ష్మక్రిములతో పోరాడగలదు.
మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించండి:
ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మరియు భావోద్వేగ అసమతుల్యతను కలిగిన వ్యక్తుల మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. అలాంటి వ్యక్తులు సులభంగా వ్యాధికారక సూక్ష్మజీవులకు బలవుతారు. అందువల్ల మీరెలాంటి ఒత్తిడికి గురి కాకూడదని, ఒకవేళ ఒత్తిడి పరిస్థితులుంటే, వాటినుండి బయటపడే మార్గాలను అన్వేషించాలని మరియు ఉద్రిక్తతలు మరియు ఒత్తిడి పరిస్థితులను దూరంగా ఉంచాలని మీకు సిఫార్సు చేయడమైంది.