కోలోరెక్టల్ కాన్సర్ అంటే (Colorectal cancer) అంటే ఏమిటి?
కోలోరెక్టల్ కాన్సర్ (పెద్దప్రేగు కాన్సర్), అనేది పెద్దప్రేగు భాగాలను బాధించే వ్యాధి. ఇది పెద్ద పేగు, పురీషస్థానము లేదా రెండు భాగాలకు కూడా బాధించవచ్చు. పెద్దపేగు, పురీషనాళం యొక్క లోపలి గోడల్లో బుడిపెల్లా పైకి ఉబికివచ్చినట్లు ప్రారంభమవుతుంది ఈ వ్యాధి. మలంలో అధిక నీటిని పెద్దపేగు పీల్చుకుంటుంది, మలవిసర్జన అయ్యేంతవరకూ పురీషనాళం మలాన్ని నిల్వ చేస్తుంది.
భారతీయుల ఆహారసేవనం మరియు దేశంలో తక్కువ ఊబకాయం రేట్లు కారణంగా భారత్ లో పెద్దపేగుల కాన్సర్ ఇతర దేశాల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది, కానీ, ఈ వ్యాధితో బాధపడేవాళ్ళ మనుగడ రేటు (ఇతర దేశాలతో పోల్చితే) అయిదు సంవత్సరాలు తక్కువగా ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- మలవిసర్జన అలవాట్లలో మార్పు, నీళ్ల విరేచనాలు లేదా మలబద్దకంలో మలం గట్టిపడడంవల్ల మలవిసర్జనకు సుదీర్ఘకాలం పట్టడం.
- మలవిసర్జన అసంపూర్తిగా అయిందన్న భావన.
- మలవిసర్జనలో సన్నని పరిమాణపు (narrow-sized) మలం
- పెద్దప్రేగు లేదా పురీషనాళంలో రక్తస్రావం కారణంగా రక్తంతో కూడిన (లేదా రక్తం చారలతో కూడిన) మలం.
- పొత్తి కడుపు నొప్పి .
- బలహీనత .
- ఉద్దేశ్యపూర్వకం కాని బరువు నష్టం.
సాధారణంగా, వ్యాధి లక్షణాలు రుగ్మత వచ్చిన తరువాతి దశలలో కనిపించటం మొదలుపెడతాయి మరియు వ్యక్తి నుండి వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు మరియు వ్యాధి తీవ్రత మారుతాయి.
ఈ లక్షణాలు క్రోన్'స్ వ్యాధి, పెద్దప్రేగు వ్రణోత్పత్తి , మొలలు (హెమెరోయిడ్లు) మరియు అంటువ్యాధులు వంటి పరిస్థితులలో కనిపిస్తాయి.
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
దీనికి ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు, కానీ పెద్దపేగు క్యాన్సర్ రావడానికి కింద తెలిపిన పరిస్థితులు కారణం కావచ్చు:
- 50 ఏళ్లు వయసు పైబడిన పురుషులు.
- పెద్ద పేగు కాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్) వ్యక్తి యొక్క కుటుంబంలోనివారికి ఉన్నప్పుడు.
- ఊబకాయంతో ఉన్నవారు
- సిగరెట్ ధూమపానం.
- మద్యం సేవించే వారు.
- ఎరుపు మాంసం (red meat) మరియు ప్రాసెస్ చేసిన మాంసం తినే నియోగదారులు.
- పీచుపదార్థాలు (ఫైబర్) తక్కువగా ఉండే ఆహారం తినే వ్యక్తులు .
- భౌతిక వ్యాయామం లేని నిశ్చల జీవనశైలి ఉన్నవారు.
- అవయవ మార్పిడి తరువాత ప్రతిరక్షా నిరోధక మందులను పుచ్చుకుంటున్నవారు
- హెచ్ఐవి సంక్రమణ, ఇన్సులిన్ నిరోధకత కల్గిన డయాబెటిస్ మెల్లిటస్ వ్యాధి వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారు .
- ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులవంటి రేడియోధార్మిక చికిత్సకు గురైనవ్యక్తులు. .
- కుటుంబంలో పిత్తాశయం తొలగింపు చరిత్ర కలిగిన వారు.
- కరోనరీ హార్ట్ డిసీజ్ యొక్క చరిత్ర కలిగిన వ్యక్తులు .
ప్రమాద కారకాలు ఉంటే క్యాన్సర్ రాగలదని కాదు; అయితే, ఆ ప్రమాద కారకాలు కాన్సర్ వచ్చే అవకాశం పెంచుతాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మలవిసర్జనలో మీకు రక్తసిక్తమైన మలం పడినట్లైనా లేదా పురీషనాళంలో రక్తస్రావం అనుభవించిన వెంటనే మీ డాక్టర్ను సంప్రదించండి. ఇది సాధారణ స్థితి కాదు.
మీ వైద్యుడు మీ పురీషనాళాన్ని పరీక్ష చేస్తాడు. దీనివల్ల పురీషనాళంలో ఏదైనా అడ్డు తగులుతోందా అనే విషయం తెలుస్తుంది. లేక మరేదైనా అసాధారణతను వైద్యుడు గుర్తించడానికి ఈ పరీక్షవల్ల వీలవుతుంది. వైద్యులు మీ హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణం లెక్కింపు (రక్త నష్టం కారణంగా రక్తకణాలు తగ్గీ ఉండొచ్చు) మరియు ఇతర సెల్ గణనలు, కాలేయ పరీక్షలు మరియు మూత్రపిండ పరీక్షలు నిర్వహిస్తారు. పునరావృత వ్యాధి పరిస్థితిలో, రక్తంలో ఒక నిర్దిష్ట రక్షకపదార్థ జనకం (యాంటిజెన్) యొక్క స్థాయిలను కనుగొనడానికి పరీక్షలు నిర్వహిస్తారు. కొలొరెక్టల్ క్యాన్సర్ కు చేసే ఓ స్క్రీనింగ్ పరీక్ష కొలొనోస్కోపీ చేస్తారు, దీనివల్ల పాలిప్లను గుర్తించడానికి వీలుంటుంది. కొన్నిసార్లు ఛాతీ x- రే, అల్ట్రాసోనోగ్రఫీ మరియు CT స్కాన్ పరీక్షల్ని ఈ క్యాన్సర్ శేరీర ఇతర అవయవాలకు వ్యాప్తి చెందిందేమోనని కనుగొనటానికి నిర్వహిస్తారు.
శస్త్రచికిత్స మొదటి చికిత్స ఎంపిక. కెమోథెరపీ ఔషధాలు కూడా చికిత్స కోసం ఇవ్వబడుతాయి. కొన్ని పరిస్థితులలో తప్ప రేడియేషన్ థెరపీని విస్తృతంగా ఉపయోగించబడదు. ఈ క్యాన్సర్ ముదిరిపోయిన దశల్లో రోగనిరోధకచికిత్స (Immunotherapy) ఉపయోగించబడుతుంది.