శూలనొప్పి (శిశువుల్లో కడుపునొప్పి) - Colic in Telugu

Dr. Pradeep JainMD,MBBS,MD - Pediatrics

December 06, 2018

March 06, 2020

శూలనొప్పి
శూలనొప్పి

శిశువుల్లో కడుపునొప్పి  అంటే ఏమిటి?

పెద్దవాళ్ళు మరియు శిశుల్లో కడుపునొప్పి లేక శూల నొప్పి అనేది ఒక సాధారణ పరిస్థితి. సాధారణంగా శూలనొప్పి అనేది శిశువుల్లోనే ఎక్కువగా కడుపునొప్పి రూపంలో వస్తుంటుంది. శిశువులు పుట్టిన తొలి నెలల్లో ఈ శూలనొప్పి లేదా కడుపునొప్పికి గురవుతుంటారు. ప్రతి 5 మంది శిశువుల్లో ఒకరు ఇలా కడుపునొప్పికి గురవుతుంటారు.  శిశువు పొత్తి కడుపులో నొప్పి లేదా అసౌకర్యం కారణంగా విపరీతంగా ఏడుస్తుంటుంది, ఎంతగా ఊరడించినా ఏడ్పు ఆపదు. ఇలాంటి పరిస్థితినే శూలనొప్పి లేక కడుపునొప్పి అని నమ్మడం జరుగుతోంది. రోజులో కనీసం మూడు గంటలు పాటు నిలపకుండా బాధతో ఏడవడం, ఇలా వారంలో మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు బిడ్డకు శూలనొప్పి వచ్చి బాధ పడుతూ ఏడుస్తూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితిలో శిశువుకు రోగనిర్ధారణ అవసరమవుతుంది.

పిల్లలు తమ అవసరాలను తెలిపేందుకే ఏడుస్తారు. శిశువు యొక్క నిరంతర ఏడుపు ఆకలి, నిద్ర, అలసట, వేడి లేదా ఎక్కువ చలవ లేదా మాసిపోయి, తడిసిన తువాలుగుడ్డ లేదా డైపర్ కారణంగా కానపుడు, కడుపునొప్పి లేదా శూలనొప్పి కారణంగానే బిడ్డ బాధపడుతోందని మనం  భావించడం చాలా సురక్షితం.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

శిశువులు శూల నొప్పి లేదా కడుపునొప్పిని ఎదుర్కొంటున్నప్పుడు లేదా ఈ రుగ్మతకు  గురవుతున్నపుడు వారిలో కింది వ్యాధి లక్షణాల్ని మీరు గమనించవచ్చు:

  • సక్రమంగా లేని నిద్ర లేదా చెదిరిన నిద్ర
  • శిశువు మామూలుగా పాలు తాగడంలోని క్రమపద్ధతులు (patterns)  క్రమరహితమైనపుడు, ఎక్కువగా ఏడవడం కారణంగా వి పాలు తాగడానికి అంతరాయం కలిగినపుడు
  • విశ్రాంతి లేకపోవటం (అశాంతి, వ్యాకులత)
  • శిశువులో ఉద్రిక్తత (వ్యాకులత) లాంటిది- శిశువు పిడికిళ్లు బిగించడం, వీపును వంపులు తిప్పడం, మోకాలు  మూడవడం, మరియు పొత్తికడుపు కండరాల్లో ఉద్రిక్తత
  • శిశువు లంకించుకున్న ఏడ్పును ఎంతగా ఊరడించినా ఆపకపోవడం, శిశువు దృష్టిని ఏడ్పు నుండి మరల్చేందుకు చెసే ప్రయత్నాలన్నీ వృధా అవడం.  
  • ప్రతి రోజు ఒకే సమయంలో శిశువు ఇలా ఓ నమూనారీతిలో కల్లోలానికి, అసౌకర్యానికి గురి కావడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

శిశువుల్లో ఎవరికైనా కడుపునొప్పి లేదా శూల నొప్పి వస్తుంది. ఈ కడుపునొప్పి లేదా శూలనొప్పి కేవలం పుట్టిన బిడ్డల్లోనే లేదా బాల్యదశలోనే ఎక్కువగా వస్తుందని ఊహించడం కష్టం. అలాగే తల్లి పాలు తాగే శిశువులకంటే కేవలం బాటిల్ ద్వారా పాలు తాగే శిశువులకే ఈ ఉదరశూలనొప్పి వస్తుందని అంచనా వేయడం కష్టం. శిశువులందరికీ కడుపునొప్పి (శూలనొప్పి) వచ్చే అవకాశం ఉంది. శిశువుల్లో కడుపునొప్పి యొక్క కొన్ని కారణాలు కింద సూచించినవి కావచ్చు:

  • తల్లి రొమ్ము పాలలో ఉన్న కొన్ని పదార్థాలకు శిశువు నుండి ప్రతిస్పందన (ప్రతిచర్య)
  • పాలల్లో వేసే చక్కర శిశువుకు పడకపోవడం (లాక్టోజ్ అసహనం)
  • అజీర్ణం
  • గర్భధారణ మయంలో తల్లులు ధూమపానం చేసియున్నట్లైతే వారి శిశువులకు కడుపునొప్పి (శూలనొప్పి) రావచ్చు.  

దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కడుపు నొప్పితో బాధపడే శిశువుకు రోగ నిర్ధారణ చేసే ముందు వైద్యులు సాధారణంగా శివువుకు ఓ సాధారణ పరీక్ష చేస్తారు, ఈ పరీక్షలోనే ఆపుకోలేనంతగా బాధపడుతున్న శిశువు కడుపునొప్పికి ఏ ఇతర సాధ్య కారణాలో లేవని వైద్యులు గ్రహించడానికి వీలవుతుంది. సామాన్యంగా ఏ పరీక్షలు లేదా రోగనిర్ధారణ దర్యాప్తు జరగక పోవచ్చు.

చాలా మంది వైద్యులు సలహా ఇచ్చేదేమంటే శిశువు కడుపు నొప్పి తగ్గిపోయేంతవరకూ మరియు శిశువు తిరిగి చేతరించుకునేంతవరకూ ఓర్పుగా ఉండమని. శిశువుకు బాటిల్ పాలు పడటం లేదని (లాక్టోజ్ అసహనం) అనుమానం ఉన్నట్లయితే ఆవుపాలు పట్టడం మానేయమని కొంతమంది వైద్యులు సలహానిస్తారు. లేదా బిడ్డకు తల్లి పాలిస్తున్నట్లైతే, తల్లి కొన్ని ఆహార పదార్థాలను సేవించడం మానేయమని వైద్యులు సూచించడం జరుగుతుంది.

కడుపు నొప్పితో ఏడ్చే శిశువుకు బాల్యానంద చర్యలైన ఊపడం (rocking) శిశువును బట్టలో చుట్టడం,(swaddling), మరియు శిశువు నోట్లో చీకడానికి పాలబుడ్డను (pacifier) ఉంచడం వంటివి చాలా సందర్భాలలో ఉపయోగకరంగా ఉంటాయి. పాలు పట్టిన శిశువుకు తేన్పులు తెప్పించడం, శిశువుకు స్నానం చేయించే ముందు చమురు మర్దన ఇవ్వడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శిశువు కడుపుబ్బరం తగ్గించే (simethicone) చుక్కలమందులవల్ల కొన్నిసార్లు పిల్లలు సులభంగా తేన్పుల ద్వారా గాలిని వదిలి ఉపశమనాన్ని పొందటానికి సహాయపడతాయి.



వనరులు

  1. National Health Service [Internet]. UK; Colic
  2. National Health Service [Internet]. UK; Colic
  3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Colic
  4. Healthdirect Australia. Colic in babies. Australian government: Department of Health
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Colic and crying: self-care

శూలనొప్పి (శిశువుల్లో కడుపునొప్పి) వైద్యులు

Dr. Pritesh Mogal Dr. Pritesh Mogal Pediatrics
8 Years of Experience
Dr Shivraj Singh Dr Shivraj Singh Pediatrics
13 Years of Experience
Dr. Abhishek Kothari Dr. Abhishek Kothari Pediatrics
9 Years of Experience
Dr. Varshil Shah Dr. Varshil Shah Pediatrics
7 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

శూలనొప్పి (శిశువుల్లో కడుపునొప్పి) కొరకు మందులు

Medicines listed below are available for శూలనొప్పి (శిశువుల్లో కడుపునొప్పి). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.