సెలియక్ వ్యాధి అంటే ఏమిటి?
సెలియాక్ వ్యాధి అనేది ఒక జన్యుపరమైన స్వయం-ప్రతిరక్షక రుగ్మత. దీన్నే ఉదరకుహర వ్యాధి అని కూడా అంటారు. ఈ రుగ్మతలో జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. గోధుమ, రైధాన్యం మరియు బార్లీలో ఎక్కువగా కనిపించే “గ్లూటెన్” అనే ప్రొటీన్కు వ్యతిరేకంగా శరీరం ఓ రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది. గ్లూటెన్-కలిగిన ఆహారసేవనం తరువాత, పేగు వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది, ఎలాగంటే గ్లూటెన్ వల్ల ప్రేగుల చూషకాలు (villis) వాపుకు గురై ఈ పేగునష్టం ఏర్పడుతుంది. దీనివల్ల జీర్ణసంబంధ-సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇవి కూడా తీవ్రమైనది. ఈ ప్రక్రియ అంటా పోషక లోపాన్ని ప్రాప్తిపజేస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రేగు లక్షణాలు చాలా సాధారణంగా వస్తుంటాయి. ఈ పేగు లక్షణాలు పెద్దలు మరియు పిల్లలలో మారుతూ ఉంటాయి. అలాంటి లక్షణాల్లో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:
- అతిసారం
- కడుపు ఉబ్బరం
- మలబద్ధకం
- వాంతులు
- తెల్లబారిన, చాలా పలుచనైన, గ్యాస్‌తో కూడుకున్న మలవిసర్జన
- అజీర్ణం
- గుండెల్లో మంట
- పులి తేన్పులు (Acid reflux)
జీర్ణ వ్యవస్థ సమస్యలే కాక ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి
- రక్తహీనత మరియు బరువు నష్టం
- ఎముక సాంద్రత నష్టం
- దురదతో కూడిన చర్మంపై దద్దుర్లు (రాషెస్) (మరింత సమాచారం: చర్మ దద్దుర్లకు చికిత్స )
- దంతాలపై ఎనామెల్ నష్టం లేదా పండ్ల రంగులో మార్పు
- తలనొప్పి
- నోటి పూతలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సెలియాక్ వ్యాధి జన్యు కారకాలు, పర్యావరణ కారకాలు మరియు కొన్ని రోగనిరోధక రుగ్మతలు ( immunological disorders) వలన సంభవిస్తుంది, ఇవి ఆహారాలు నుండి గ్లూటెన్కు రోగనిరోధక ప్రతిచర్యను సృష్టిస్తాయి. టైపు 1 మధుమేహం , వ్రణోత్పత్తితో కూడిన పెద్దప్రేగు, థైరాయిడ్ రుగ్మతలు, మూర్ఛ , మరియు డౌన్ సిండ్రోమ్ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల ద్వారా కూడా ఇది సంభవించవచ్చు .
ఈ వ్యాధిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఉదరకుహర వ్యాధి లక్షణాలు తరచుగా మారుతూ ఉంటాయి; అందుకే, కేవలం 20% మంది రోగులు మాత్రమే సరైన సమయంలో వ్యాధిని కనుగొని నిర్ధారణ చేసుకుంటున్నారు. రోగ నిర్ధారణ తరచుగా కుటుంబ చరిత్ర, వైద్య చరిత్ర, మరియు ఆహార నమూనాలను తనిఖీ చేయడాన్ని కలిగి ఉంటుంది మరియు రక్త పరీక్షలు మరియు జీవాణుపరీక్షలు కూడా ఉంటాయి. రెండు రకాల రక్త పరీక్షలు జరుగుతాయి: ఒకటి-గ్లూటెన్కు వ్యతిరేకంగా యాంటీబాడీ ఉనికిని గుర్తించేందుకు మరియు మరొకటి మానవ లీకోసైట్ యాంటిజెన్ (HLA) కోసం జన్యు పరీక్ష. పేగు చూషకాలకు ఏవైనా నిర్మాణాత్మక నష్టాన్ని తనిఖీ చేయడానికి ప్రేగు బయాప్సీ నిర్వహిస్తారు. ఖచ్చితమైన మరియు సరైన ఫలితాల కోసం రోగనిర్ధారణ అయ్యేంతవరకూ గ్లూటెన్-రహిత ఆహారపదార్థాలనే సేవించడం చాలా ముఖ్యం. తదుపరి పరీక్షలు ఏటా మరియు జీవితకాలం కొనసాగించబడాలి.
సెలియాక్ వ్యాధికి శాశ్వత చికిత్స కావాలంటే గ్లూటెన్-రహిత ఆహారాన్ని తీసుకోవడమే ఏకైక మార్గం. ఈవిధమైన గ్లూటెన్-రహిత కఠిన ఆహార నియమాన్ని పాటించాలి గ్లూటెన్ తో కూడిన ఆహార పదార్ధాలు, మందులు, విటమిన్ సప్లిమెంట్స్, లేదా పానీయాలను అసలు తీసుకోకూడదు. ముఖ్యమైన ప్రోటీన్లను ఏమాత్రం కోల్పోని వ్యక్తిగత గ్లూటెన్-రహిత ఆహారాన్నిఓ పోషకాహార నిపుణుడు మీ కోసం ఏర్పాటు చేసేస్తారు. దెబ్బతిన్న పేగులు నయమవడం వైద్యంవల్ల వారాల్లో మొదలవుతుంది, కొన్ని నెలల్లో దెబ్బతిన్న పేగుల చూషకాలు కూడా తిరిగి పెరగడం జరుగుతుంది. పేగు నిర్మాణం మళ్ళీ మొదలవుతుంది. పేగుల వాపు సమసిపోతుంది, ఈ వ్యాధి లక్షణాలు అదృశ్యం అవుతాయి. తినే ఆహార పదార్ధాలు, పానీయాల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార పదార్థాలు కొనేటప్పుడు గ్లూటెన్ యొక్క ఉనికి ఉన్నదీ/ లేకపోవడం నిర్ధారించడానికి ప్యాక్ చేసిన ఆహార లేబుల్స్ ను జాగ్రత్తగా చదవండి. గ్లూటెన్ రహిత ఆహారం, ధాన్యాలు లేదా పిండి పదార్ధాలు కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం.
- మొక్కజొన్న, కొయ్య తోటకూర లేక పెరుగుతోటకూర (అమరాంత్), మొక్కజొన్న, బియ్యం, బుక్వీట్ రకం గోధుమలు, టేపియోకా (బార్లీ గింజలవంటివి), మరియు పాలగుండ (యారో్రోట్)
- తాజా మాంసం, చేపలు , కోడిమాంసాది పౌల్ట్రీ ఆహారం, చాలామటుకు పాల ఉత్పత్తులు, మరియు కూరగాయలు