గుండె కండరాల వ్యాధి లేదా కార్డియోమయోపతీ అంటే ఏమిటి?
గుండె కండరాల వ్యాధి లేదా కార్డియోమయోపతి అనేది గుండె కండరాల యొక్క సమస్య, దీనిలో శరీరం భాగాలకు రక్తాన్ని ప్రసరణ చెయ్యడం కష్టమవుతుంది. కార్డియోమయోపతీ ఉన్నవారు తగిన సంరక్షణ మరియు శ్రద్ధలతో సాధారణ జీవితాలను గడపవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో అది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. కార్డియోమియోపతి సంరక్షణ అనేది వ్యక్తి బాధపడే సమస్య యొక్క రకం మీద ఆధారపడి ఉంటుంది -డైలేటెడ్ (dilated), హైపర్ట్రోఫిక్ (hypertrophic)లేదా రెస్ట్రిక్టెడ్ (restricted).
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రారంభ దశల్లో సంకేతాలను గుర్తించటం కష్టం, కానీ క్రమంగా, కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని:
- చీలమండ (ankle) మరియు పాదం చుట్టూ వాపు (మరింత సమాచారం: పాదం వాపు కారణాలు)
- అలసట, తగినంత శ్రమ లేకుండా కూడా
- నిరంతరంగా కడుపు ఉబ్బరం
- అదిరినట్టు లేదా దంచినట్టు ఉండే హృదయ స్పందన
- ఛాతీ యొక్క సంకోచం
- తల తిప్పడం
- ఊపిరి ఆడకపోవడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క ప్రధాన కారణం నిర్ధారించడం కష్టం, కొన్ని సందర్భాలలో అది వారసత్వంగా సంభవించవచ్చు. ఈ పరిస్థితికి దోహదపడే అంశాలు:
- రక్తపోటుకు సంబంధిత వ్యాధులు
- గుండెపోటు వలన నష్టం
- గుండె స్పందన సమస్యలు మరియు గుండె కవాటాలలో సమస్యలు (అరిథ్మియాలు మరియు కవాటాల లోపాలు)
- మందులు మరియు మద్య దుర్వినియోగం
- గుండె అంటువ్యాధులు (ఎండోకార్డయిటీస్)
- గుండెలో వాపు (పెరికార్డయిటీస్)
- ప్రోటీన్ జమకావడం (Protein deposits)
- గుండె కణజాలంలో లోపాలు
- కీమోథెరపీ
- గర్భంలో సమస్యలు
- పోషకాహార లోపం
- మధుమేహం, థైరాయిడ్ మరియు ఊబకాయం వంటి రుగ్మతలు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ప్రాథమిక రోగ నిర్ధారణలో భౌతిక పరీక్ష, కుటుంబ చరిత్ర మరియు మునుపటి వ్యాధుల సమాచార తనిఖీ ఉంటుంది. కారణాలు తెలుసుకున్న తర్వాత వైద్యులు ఈ పరీక్షలు సూచించవచ్చు:
- ఎక్స్-రే
- గుండె స్పందన మరియు కవాటాలను తనిఖీ చేయడానికి ఈసిజి (ECG)
- లక్షణాలు తనిఖీ కోసం ట్రెడ్మిల్ పై ఒత్తిడి పరీక్ష (stress test)
- రక్త నాళాలు తనిఖీకి కాథేటరైజేషన్ (Catheterization)
- అన్ని అవయవాల పనితీరు తెలుసుకోవడం కోసం రక్త పరీక్ష
- జన్యు పరీక్ష (Genetic testing)
చికిత్స కార్డియోమయోపతి రీతి మీద ఆధారపడి ఉంటుంది.
-
రక్తపోటును తగ్గించడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి, తక్కవ హృదయ స్పందన కోసం మరియు గడ్డకట్టడాన్ని నివారించడానికి మందులు ఉంటాయి
అమర్చిన పరికరాలు:
- గుండె లయను అంచనా వేసేందుకు ఐసిడి (ICD) లేదా ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డిఫిబ్రిలేటర్
- రక్త ప్రసరణకు సహాయకరంగా విఏడి (VAD) లేదా జఠరిక సహాయక పరికరం (ventricular assist device)
- అరిథ్మియాను నియంత్రించడానికి పేస్ మేకర్
- హృదయ గోడను సన్నబర్చడం మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి లేదా అరిథ్మియాకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొలగించడం లేదా తగ్గించడం
- రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి కొన్ని హృదయ కండరాల తొలగింపునకు ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స వంటి శస్త్రచికిత్స విధానాలు లేదా తీవ్ర సందర్భాలలో, గుండె మార్పిడి శస్త్రచికిత్స
- బరువు తగ్గించుకోవడం, వ్యాయామం, మెరుగైన ఆహారం, ధూమపానం ఆపివేయడం మరియు మద్యం వినియోగం తగ్గించడం, ఒత్తిడి మరియు నిద్ర నిర్వహణ వంటి జీవనశైలి మార్పులు