నోటి పుండు లేదా కెంకర్ సోర్ అంటే ఏంటి?
నోటి పుళ్ళు అనేవి పంటి చిగుళ్ల అడుగున కణజాలంలో ఏర్పడే చిన్న గాయాలు లేదా పూతల. వీటిని యాప్తోస్ అల్సర్స్ (apthous ulcers)అని కూడా పిలుస్తారు,ఇది అంటువ్యాధి కాదు, కానీ తినడం మరియు మాట్లాడటం వంటి ప్రాథమిక పనుల్లో విపరీతమైన బాధను మరియు నొప్పిని కలిగిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నోటి పుళ్ళు సాధారణంగా నాలుక క్రింద, పెదవులు లేదా చెంపల లోపల లేదా చిగుళ్ళ అడుగునఏర్పడతాయి. అవి చూడడానికి అండాకారంలో ఉండి, మధ్యలో తెల్లటి-పసుపు రంగు మరియు అంచులలో ఎరుపు రంగులో ఉంటాయి. నోటి పుళ్ళ చుట్టూ తిమ్మిరి లేదా కాలిన గాయం వంటి భావన కలుగుతుంది. వివిధ రకాల నోటి పుళ్ళు లక్షణాలు:
స్వల్ప పుళ్ళు
- చాలా చిన్నవి
- అండాకారంలో ఉంటాయి
- ఎటువంటి మచ్చలు లేకుండా వాటికవే ఒక వారంలోనే నయం అవుతాయి
పెద్ద పుళ్ళు
- పెద్దవి మరియు లోతైనవి
- బాగా మందమైనవి
- చాలా బాధాకరమైనవి
- నయం కావడానికి అనేక వారాలు తీసుకుంటాయి మరియు తరచూ పెద్ద మచ్చల గుర్తుల్ని వదిలిపెడతాయి
బొబ్బల వంటి పుళ్ళు
- చాలా చిన్నవి
- గుంపులగా ఏర్పడి పెద్ద పుండులా కనపడతాయి
- ఎటువంటి మచ్చలు లేకుండా ఒక పక్షం రోజుల్లో నయమవుతాయి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నోటి పుళ్ళు పలు కారణాల వలన సంభవించవచ్చు, తరచుగా కొన్ని కారణాలు కలయికగా సంభవిస్తాయి.
- చెంప కొరకడం వలన ఏర్పడిన గాయం
- చాలా ఎక్కువగా, గట్టిగా లేదా తీవ్రంగా పళ్ళు తోమడం
- టూత్ పేస్టులో సోడియం లారీల్ సల్ఫేట్(Sodium lauryl sulphate) ఉంటే
- చాలా నూనె, మసాలా, ఆమ్లత ఉన్న లేదా పాల పదార్దాలు లేదా గింజలు కలిగి ఉన్న కొన్ని ఆహారాలకు సున్నితత్వం ఉండడం వలన
- జింక్, విటమిన్ B12 లేదా ఫోలిక్ ఆమ్లం యొక్క లోపం
- పుండును కలిగించే బాక్టీరియా యొక్క ఉండి ఉంటే
- స్త్రీలలో హార్మోన్ల మార్పులు
- ఒత్తిడి
- సిలియాక్, ప్రేగు వాపు వ్యాధి, బెహెట్స్ వ్యాధి, లేదా HIV సంక్రమణ / ఎయిడ్స్ వంటి వ్యాధులు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స?
నోటి పుళ్ళు లేదా కెంకర్ పుళ్ళ నిర్ధారణకు నోటిని మరియు పూతలను (పుళ్లను) పరిశీలిస్తే సరిపోతుంది. ఈ పుళ్ళు చాలాకాలం కొనసాగితే లేదా ఈ సమస్యకు కొన్ని అంతర్గత కారణాలు ఉన్నాయని వైద్యులు భావిస్తే దానికోసం కొన్ని పరీక్షలను సూచించవచ్చు.
చికిత్సలో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి, వైద్యులు సాధారణంగా వీటిని సలహా ఇస్తారు:
- వాపు మరియు నొప్పి కోసం డెక్సామెటసోన్ను(dexamethasone) కలిగి ఉన్న నోరు పుక్కిలించే మందులు (mouth rinses)
- హైడ్రోజన్ పెరాక్సైడ్ (hydrogen peroxide), ఫ్లోకోనోనైడ్ (fluocinonide)లేదా బెంజోకైన్ (benzocaine) కలిగి ఉన్న లేపనాలు (ointments) లేదా జెల్లులు
- పూతల కారణంపై ఆధారపడిన నోటి మందులు (Oral medicines)
- మందుల ద్వారా పుతలని కాల్చివేయడం లేదా నాశనం చేయడం
- లోపాల వలన పూతలు ఎరపడితే సప్లిమెంట్లు. ఉదా., విటమిన్ B12, ఫోలేట్ లేదా జింక్ సప్లిమెంట్లు
- మసాలాలు, పాలపదార్దాలు, గింజలు, నూనె ఆహారం లేదా ఆమ్ల ఆహార పదార్ధాల తొలగింపు వంటి ఆహార విధాన మార్పులు మరియు సమర్థవంతమైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం
- మంచి నోటి పరిశుభ్రత
- ఒత్తిడి నిర్వహణ