నోటి మంట అంటే ఏమిటి?
నోటి మంట లేదా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ (BMS) లేదా స్కేల్డెడ్ మౌత్ సిండ్రోమ్ అనేది నాలుక, అంగిలి (palate) మరియు పెదవుల మీద తీవ్రమైన మంట భావన కలిగే ఉన్న ఒక పరిస్థితి.
ఇది ఒక అరుదైన పరిస్థితి మరియు దాని లక్షణాలు మరియు కారణాలు ఒక రోగి నుంచి రోగికి ఎక్కువగా మారుతుంటాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నోటి మంట లేదా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- ఇది నాలుక మీద మంట భావన వలె ఉండి, బాధాకరమైన మరియు ఒక కాలిన బొబ్బ గాయం వంటి అనుభూతిని కలిగిస్తుంది.
- వేడి టీ, లేదా ఆమ్లత ఉన్న పానీయాలు వంటి పానీయాలను తాగినప్పుడు ఈ పరిస్థితి మరింతగా పెరుగుతుంది.
- పెదవుల మీద లేదా నోటి మూలలో కూడా మంట అనుభూతిని కలిగించవచ్చు.
- రుచి అనుభూతి మారుతుంది కాబట్టి తినడం కష్టమవుతుంది.
- అరుదుగా, రోగికి నోటిలో తిమ్మిరి కూడా ఉండవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నోటి మంట యొక్క ప్రధాన కారణాలు:
- ప్రాథమిక నోటి మంట ఏవిధమైన ప్రత్యేక పరిస్థితి లేదా కారణంతో ముడి పడి ఉండదు . దీని కారణం తరచుగా తెలియదు.
- ద్వితీయ రకమైన నోటి మంట ఒక నిర్దిష్ట కారణం వలన లేదా అంతర్లీన వ్యాధి కారణంగా సంభవిస్తుంది.
- కాండిడా (candida), లేదా నోరులో పూతలు వంటి నోటి ఇన్ఫెక్షన్స్ మంట భావనని కలిగించవచ్చు.
- లాలాజల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు జిరోస్టోమియా లేదా నోరు ఎండిపోవడం (dry mouth) జరుగుతుంది. నోరు పొడిగా ఉండడం కూడా నోటి మంటకు దారితీస్తుంది.
- మధుమేహం లేదా థైరాయిడ్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు తరచూగా నోటి మంటను అనుభవించవచ్చు. హార్మోన్ల అసమతుల్యత అనేది జిరోస్టోమియాకు కారణమవుతుంది, ఇది మంట సంచలనానికి దారి తీస్తుంది.
- యాసిడ్ రిఫ్లక్స్ లేదా జిఇఆర్డి(GERD) వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్కు కారణం కావచ్చు.
- యాక్రిలిక్ తో తయారు చేసిన కట్టుడు పళ్ళు పదునైన అంచులు కలిగి ఉండవచ్చు, ఇవి బుగ్గల గోడలు లేదా నోటిలో పూతల మరియు కాలిన గాయాలు వంటి వాటిని కలిగించవచ్చు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స?
- రోగి యొక్క లక్షణాలు మరియు భౌతిక పరీక్షల ఆధారంగా నోటి మంట (BMS) యొక్క రోగ నిర్ధారణ అనేది చాలా సులభం. ఏదేమైనా, కారణం తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు నిర్వహించబడతాయి.
- మధుమేహం, థైరాయిడ్ వ్యాధుల కోసం రక్త పరీక్షలు.
- లాలాజల పరిమాణం మరియు నాణ్యతను తెలుసుకోవడం కోసం లాలాజల పరీక్ష.
నోటి మంట (BMS)చికిత్స :
- ప్రాధమిక నోటి మంట లేదా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ ఎటువంటి కారణముతో ముడి పడి ఉండదు, మంట అనుభూతిని తగ్గించటం ద్వారా చికిత్స చేయబడుతుంది. దీనికోసం, కొన్ని ఆహార మార్పులు అవసరం:
- మసాలా ఆహారం, ఆమ్లత ఉండే ఆహారం తినడం మానివేయాలి. ధూమపానం మరియు మద్యపానం కూడా లక్షణాలను మరింత ముదిరేలా చేస్తాయి, అందువల్ల వాటిని నివారించాలి
- అవసరమైన పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తినాలి.
- ద్వితీయ రకం నోటి మంట లేదా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ చికిత్స దాని యొక్క కారణాన్ని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది.
- యాసిడ్ రిఫ్లక్స్ ఆహార మార్పులు మరియు యాంటాసిడ్ మాత్రల ద్వారా నియంత్రించబడుతుంది.
- హార్మోన్ల రుగ్మతలు ఇన్సులిన్, మందులు, మరియు వ్యాయామాల ద్వారా నియంత్రించబడతాయి.
- అంటురోగాలు (infection) నోటి మంటకు కారణమైతే ఫంగల్ మందులు మరియు యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉంటాయి.
- గృహ సంరక్షణ చర్యలలో ఐస్ బిళ్లలను నమలడం, చల్లని పానీయాలు త్రాగటం లేదా ప్రభావిత ప్రాంతంలో కలబంద గుజ్జును పూయడం వంటివి చెయ్యవచ్చు.