కళ్ళు మంటలు అంటే ఏమిటి?
కళ్ళులో మంట సమస్య అనేది దురద, కంటిలో సలపటం, మంట వంటి కఠినమైన బాధతో కూడుకుని ఉంటుంది. ఈ లక్షణాలతోబాటు కళ్ళ నుండి నీళ్లు కారడం కూడా జరుగుతుంది. కనురెప్పల వాపు (Blepharitis), కళ్ళు పొడిబారడం, కండ్లకలక మరియు కంటి అలెర్జీలు మండే కళ్ళకు సంబంధించిన సాధారణ కారణాలు.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- కళ్ళ నుండి ఉత్సర్గ (discharge)
- నీళ్లతో నిండిన కళ్ళు
- కంటి మంటతో బాటు కళ్ళు ఎరుపెక్కడం
అంతర్లీన వ్యాధిని బట్టి నిర్దిష్ట లక్షణాలు:
- కనురెప్పల వాపు (బ్లేఫరిటిస్): ఇది కనురెప్పల యొక్క వాపు. కనురెప్ప వెంట్రుకల మొదళ్ళలో కంటి కురుపు, జిడ్డుతో కూడిన చుండ్రు లాంటి పొక్కులు (flakes) వస్తాయి. (కంటి కురుపనేది ఎరుపెక్కిన, ఉబ్బిన, కనురెప్ప అంచు సమీపంలో వస్తుంది)
- పొడి కళ్ళు: కంటిలో సలపడం మరియు మంట వంటి బాధ ఉంటుంది; కన్ను ఎరుపెక్కడం; కంటిలో లేదా చుట్టూ శ్లేష్మం పొరలు ఏర్పాటు కావడం; కంటిలో ఎదో చిక్కుకున్నదన్న అనుభూతితో మధనపడడం.
- కంటి అలెర్జీ లేదా కండ్లకలక: కండ్లకలక కారణంగా వచ్చే కంటి దుష్ప్రభావాలు మరియు వాపు కళ్ళ మంటకు దారితీస్తుంది; వాపెక్కిన, బురదతో కూడిన కళ్ళు; కళ్ళవెంట నీళ్లు కారడం, ముక్కు మూసుకుపోయి, ముక్కులో దురద పుట్టడం, మరియు తుమ్ములు రావడం.
కళ్ళ మంటకు ప్రధాన కారణాలు ఏమిటి?
కళ్ళ మంటకు గల సాధారణ కారణాలు:
- బాక్టీరియా సంక్రమణ
- కన్నీటి గ్రంథులు మరియు నాళాలు పనిచేయకపోవడం
- దుమ్ము, పుప్పొడి వంటి చిరాకు పదార్థాలు కంటిలో పడి అలెర్జీకి కారణం కావచ్చు
- కళ్ళు ఎండవేడిమికి కమలడం, అతినీలలోహిత కాంతి (ultraviolet light) కి గురవడం
కళ్ళమంటకు అసాధారణ కారణాలు:
- పొగ, గాలి లేదా చాలా పొడి వాతావరణానికి బహిర్గతం
- సంపర్క కటకాలను (contact lenses) దీర్ఘకాలికంగా ఉపయోగించడం
- రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, థైరాయిడ్ లోపాలు మరియు ముఖచర్మరోగం (లూపస్)
- నిద్ర మాత్రలు, గుండెల్లో మంటకుగాను తీసుకునే కొన్ని మందులు
కళ్ళ మంటను ఎలా నిర్ధారిస్తారు మరియు దీనికి చికిత్స ఎమిటి?
మండే కళ్ళ రుగ్మతకు చికిత్స అంతర్లీన వ్యాధి నిర్ధారణ చాలా ముఖ్యమైనది. వైద్యుడు రోగి వైద్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకుంటాడు, ముఖ్యంగా ఏవైనా అలెర్జీలకు గురైనారా, మంట, అంటువ్యాధి కారక (ఇన్ఫెక్టివ్) ఎజెంట్లకు కళ్లు బహిర్గతమయ్యాయా అన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటారు.
కంటి వాపు మరియు కన్ను ఎరుపెక్కడాన్ని పరిశీలించడానికి ఒక చీలిక సూక్ష్మదర్శిని సహాయంతో శారీరక పరీక్ష చేయబడుతుంది. కన్నీళ్లు కారడం మరియు కళ్లలో కన్నీటి యొక్క స్థిరత్వ లక్షణం గురించి కూడా పరిశీలించబడుతుంది.
కళ్ళ మంటకు చికిత్స అంతర్లీన పరిస్థితిని బట్టి ఉంటుంది. వాటిలో ఉన్నవి:
- సంక్రమణ (infection) విషయంలో యాంటీబయాటిక్స్ .
- కళ్ళ మంట, కళ్ళకొచ్చిన వాపు ఉపశమనానికి కృత్రిమ కన్నీళ్లు లేదా కంటి చుక్కల మందు (decongestant eye drops ) మరియు వెచ్చని సంపీడనాలు.
- అలెర్జీ విషయంలో, డాక్టర్ ప్రత్యేక అలెర్జీ నుండి దూరంగా ఉండాలని సలహా ఇస్తాడు.
స్వీయ రక్షణకు కింది వాటిని కలిగి ఉంటుంది:
- మంచి పరిశుభ్రతను పాటించడం అత్యంత ముఖ్యమైనది.
- యాంటిబయోటిక్ స్ప్రేలు మరియు షాంపూ, శిశువు షాంపూలను (baby shampoos ) మీ కనురెప్పలు, జుట్టు మరియు చర్మాన్ని శుభ్రపర్చుకోవడానికి ఉపయోగించవచ్చు.
- సూర్యరశ్మి లేక ఎండ విషయంలో సూర్యకాంతికి కళ్లు బహిర్గతం కావడాన్ని నివారించేందుకు సన్ గ్లాసెస్ ఉపయోగించండి.
- దుమ్ము లేదా ఏదైనా ఇతర మంట-కారక అలెర్జీలను తొలగించడానికి సైలైన్ కంటి చుక్కమందు చాలా అవసరం.
- నీటిని పుష్కలంగా తాగడం మరియు చేప నూనె (supplement) మందులు కంటి తేమను నిర్వహించుకోవడంతో సహాయపడతాయి.