పాదం బొటన వేలు వంకర తిరగడం (బునియన్స్)అంటే ఏమిటి?
పాదం బొటన వేలు వంకర తిరగడం లేదా బునియన్ అంటే కాలి పాదం బొటన వ్రేలి మొదట్లో పెద్దగా ఒక బొడిపెలా ఏర్పడం కానీ ఉబ్బడం కానీ జరుగుతుంది అది పాదం యొక్క బొటన వేలును వంకర తిరిగేలా చేస్తుంది. ఇది పాదం బొటనవేలును రెండవ వేలు వైపుకు ఎక్కువ వొరిగిపోయేలా చేస్తుంది , దానివలన అది ఒక బొడిపె వలె కనిపిస్తుంది. ఈ బునియన్స్ కొంత మందిలో ఎటువంటి అసౌకర్యం కలిగించవు, కానీ మరికొంత మందిలో అవి చాలా బాధాకరముగా ఉంటాయి. బొటన వ్రేలి మొదట్లో బునియన్స్ ఉన్నవారికి, సహజంగా చిటికెన వేలు యొక్క మొదట్లో కూడా అటువంటి బొడిపెలు ఉంటాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బునియన్స్ ను గుర్తించడం చాలా సులభం. వాటిని గుర్తించే కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి:
- కాలి బొటన వేలు ఉమ్మడి (joint) వద్ద వాపు మరియు ఎరుపుదనం
- నిరంతరంగా లేదా అప్పుడప్పుడూ ఉండే నొప్పి
- మొదటి రెండు కాలి వేళ్ళ మధ్య ప్రాంతంలో కాయలు కాయడం (calluses లేదా కార్న్స్)
- కాలి బొటనవేలు మొదట్లో ఒక ఉబ్బు లేదా వాపు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వివిధ రకాల కారణాల వలన బునియన్స్ ఏర్పడతాయి. వీటిలో కొన్ని ఈ క్రింద ఉన్నాయి:
- పాదానికి గాయం
- వారసత్వమువల్ల సంక్రమించిన వైకల్యం
- పుట్టుకతోనే ఉన్న ఇతర వైకల్యాలు
- బిగుతుగా ఉండే పాదరక్షలు లేదా ఎత్తు ఎక్కువగా ఉన్న చెప్పులు ధరించడం ( కానీ ఇది ఒక సందేహాస్పదమైన కారణం)
- రుమటాయిడ్ ఆర్థరైటిస్
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
బునియన్ను నిర్ధారించడానికి వైద్యునికి పాదము యొక్క పరిశీలన అనేది సరిపోతుంది. అయితే, బునియన్ కలిగించిన నష్టం మరియు దాని యొక్క ఖచ్చితమైన కారణం అంచనా వేయడానికి అప్పుడప్పుడూ పాదం యొక్క ఎక్స్- రే(X- రే) ని వైద్యులు సూచించవచ్చు.
బునియన్స్ యొక్క చికిత్స మౌలిక చికిత్సా పద్ధతులు నుండి శస్త్రచికిత్స వరకు ఉండవచ్చు. పరిస్థితి యొక్క తీవ్రత మరియు నొప్పి యొక్క రకంపై ఆధారపడి చికిత్సా విధానం అనేది ఉంటుంది. ఈ క్రింద కొన్ని చికిత్స పద్ధతులు ఉన్నాయి:
- ఎక్కువ సౌకర్యవంతమైన పాదరక్షలకు మారడం
- నొప్పిని తగ్గించుకోవడానికి మరియు సౌకర్యవంతంగా ఉండడానికి , పాదం అడుగున మద్దతు ఇచ్చే మెత్తలు (support pads), టేప్లు లేదా బద్దలు (splints) ఉపయోగించడం
- ఆ ప్రాంతంలో ఒత్తిడి తగ్గించడానికి బూట్లలో ఏవైనా మెత్తని వస్తువులు పెట్టడం
- ఎరుపుదనం మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఆ ప్రాంతంలో మంచుగడ్డలు (ఐస్ గడ్డలు) తో రుద్దడం
- కొన్నిసార్లు శస్త్రచికిత్స సిఫార్సు చేయబడవచ్చు:
- ఎముక యొక్క ఒక భాగాన్ని తొలగించిన తరువాత బొటనవేలు ఉమ్మడిని నిఠారుగా మరియు మళ్లీసమానంగా చేయ్యడం
- కాలి బొటన వేలి ఉమ్మడి (joint) చుట్టూ వాపు కణజాలాన్ని తొలగించడం
- ప్రభావిత ఉమ్మడి (joint) యొక్క ఎముకలను తొలగించడం