రొమ్ము సమస్యలు అంటే ఏమిటి?
రొమ్ము క్యాన్సర్ ను మినహాయించి, రొమ్ముల్నిబాధించే ఇతర రుగ్మతల్ని రొమ్ము సమస్యలుగా పరిగణిస్తారు, అందుకే ఇవి సాధారణంగా నిరపాయమైనవి. ఏ వయస్సులోనైనా రొమ్ము సమస్యలు సంభవించవచ్చు. కొన్ని రొమ్ము సమస్యలు యుక్తవయస్సులో సంభవిస్తాయి, కొన్ని గర్భధారణ సమయంలో లేదా చనుబాలివ్వడం వలన ఏర్పడతాయి, అయితే కొన్ని వయసు పెరగడం వలన కూడా కావచ్చు. రొమ్ము సమస్యల్ని సాధారణంగా “నిరపాయమైన రొమ్ము వ్యాధులు” అని పిలుస్తారు.
రొమ్ముసమస్యల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రొమ్ము సమస్యల యొక్క సంకేతాలు మరియు లక్షణాలు వాటి వివిధ స్వభావాలు మరియు వాటికైన వివిధ నష్ట రూపాల్నిబట్టి ఉంటాయి. మీకు గనుక రొమ్ము సమస్య ఉంటే, మీకు క్రింది సంకేతాలు మరియు లక్షణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనుభవం కావచ్చు:
- రొమ్ములో నొప్పి
- రొమ్ములో గడ్డలు (lumps) గర్భాశయ కంతి కారణంగా కావచ్చు లేదా ఎక్కువ కొవ్వు పెరుగుదల కారణంగా రావచ్చు.
- రొమ్ములో తిత్తి పెరుగుదల
- చనుమొనలు విలోమం అవటంవల్ల
- చనుమొనలు నుండి స్రావాలు
- చనుమొనల్లోపగుళ్లు మరియు కురుపులు
- అదనపు చనుమొనలు ఉండటం
- రొమ్ము చర్మం రూపం లో మార్పు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
రొమ్ము సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చు. ఆ కారణాల్లోఇవీ ఉన్నాయి:
- అసాధారణ రొమ్ము పెరుగుదల
- వాపు
- హార్మోన్ల మార్పులు మరియు అసమానతలు
- చనుబాలిచ్చే సమయంలో రొమ్ము నాళాలలో కురుపులు లేదా సెప్సిస్ (sepsis) కలిగించే అంటువ్యాధులు
- రొమ్ములో పాలు నిశ్చలత (స్రవించక పోవడంవల్ల)
- రొమ్ములు పెద్దవి చేయడం కోసం ఉపయోగించిన సిలికాన్ లేదా మైనము వంటి విదేశీ పదార్థాల ఉనికి
- ప్రమాదం లేదా శస్త్రచికిత్స కారణంగా రొమ్ముకు గాయం లేదా ఆఘాతం
- రొమ్ము యొక్క క్షయ అనేది అరుదైనదే కానీ రొమ్ములోగాయమవడానికి క్షయ కారణమయ్యే సాధ్యత ఉంది.
రొమ్ముసమస్యల్ని ఎలా నిర్ధారించేది, వీటికి చికిత్స ఏమిటి?
రొమ్ము రూపంలో లేదా పనితీరులో ఏదైనా మార్పు కనిపిస్తే దానిపట్ల తక్షణ శ్రద్ధ మరియు సరైన రోగ నిర్ధారణ చేయడం తప్పనిసరి, ఇది ప్రాణాంతకస్థితి కాదని ధ్రువపర్చుకోవడానికి ఇది అవసరం.
రొమ్ముల స్వీయ-పరిశీలన రొమ్ము సమస్యలను గుర్తించడానికి ఉత్తమ మరియు సరళమైన మార్గం. రొమ్ముల్లోగడ్డ ఉందనిపిస్తే, క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని విశదపర్చుకోవడానికి, మీరు చెక్-అప్ కోసం వెళ్ళడం చాలా ముఖ్యం. ఇందుగ్గాను ఉపయోగపడే రోగనిర్ధారక పద్ధతులు క్రింది విధంగా ఉన్నాయి:
- అల్ట్రాసౌండ్
- మామోగ్రఫీ
- కోర్ సూది బయాప్సీ (Core needle biopsy)
- టిష్యూ బయాప్సీ
- రోగలక్షణ పరిశోధన
రోగనిర్ధారణ పరీక్షల నివేదికల ఆధారంగా చికిత్స యొక్క మార్గం నిర్ణయించబడుతుంది. చికిత్స పద్ధతులలో కొన్ని:
- నొప్పికి గురైన చనుమొనల కోసం ఉపశమనం కల్గించే క్రీమ్
- రొమ్ముసమస్యలకు చనుబాలిచ్చే సమయంలో వచ్చే సమస్యలే కారణమైతే, సరైనరీతిలోపాలుపట్టడం, క్రమమైన సమయంలోమరియు టెక్నిక్ ప్రకారం పాలివ్వడాన్నిపాటించడం.
- రొమ్ము గడ్డల్ని (కణితుల్ని) శస్త్రచికిత్స ద్వారా తొలగింపు
- తిత్తి నుండి ద్రవాన్ని ఆస్పిరేషన్ ద్వారా తీసేయడం.
- శస్త్రచికిత్స ద్వారా తిత్తి తొలగింపు
- చాలా అరుదుగా రొమ్ము తొలగింపు (ప్రాణాంతక అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మాస్టెక్టమీ శస్త్ర చికిత్స చేయించుకొమ్మని సూచింపబడొచ్చు.
- హార్మోన్ల అసమతుల్యత రొమ్ము సమస్యకు కారణమైతే, హార్మోన్ల మాత్రలు సంతులనాన్ని పునరుద్ధరించడానికి సూచించబడవచ్చు