గర్భవతుల్లో రొమ్ము నొప్పి అంటే ఏమిటి?
గర్భవతిగా ఉన్నప్పటి నుండి, శరీరం దాదాపుగా అర్థం చేసుకోలేని మార్పులకు గురవుతుంది. చాలా మార్పులు అంతర్గతంగా సంభవించినప్పటికీ, గమనించదగ్గ మార్పులు మరియు కొన్ని స్పష్టంగా ఉండవు, కాని మీకు వాటి అనుభూతి మాత్రం కల్గుతుంది. శిశువు కడుపులో పడి గర్భాశయం ఉబ్బెత్తుగా కన్పించడం గర్భధారణకు బహుశా చివరి చిహ్నం కాగా, రొమ్ములలో నొప్పి, సున్నితత్వం అనేవి గర్భధారణలో మొదట పరిశీలించ దగిన సంకేతాలు.
రొమ్ముల్లో ఆ నొప్పితో పాటు, ఈ నొప్పి ముట్టయ్యేందుకు ముందుగా వచ్చే రొమ్మునొప్పిని పోలి ఉంటుంది, సలుపు (సలుకులు), సున్నితత్వం మరియు రొమ్ముల యొక్క భారము కూడా గర్భవతికి అనుభవమవుతుంది.
గర్భవతుల్లో రొమ్ము నొప్పి యొక్క ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భధారణ సమయంలో కేవలం రొమ్ముల నొప్పి లక్షణం ఒక్కటే కాదు, శరీరం లోపల జరిగే పలు ఇతర మార్పులు మీకు అనుభూతికొస్తాయి. ఈ తరుణంలో మీ రొమ్ముల్లో మీరు గమనించే ఇతర మార్పులు మరి కొన్ని ఉన్నాయి:
- రొమ్ముల విస్తరణ మరియు పెరుగుదల, చనుమొనలు రొమ్ములలోంచి పొడుచుకుని బయటికి రావడం మరియు చనుమొన పరిసరం (areola) యొక్క ఉపరితలభాగం విస్తరణ
- రొమ్ముల మీద మరియు రొమ్ముల వెంట ఉండే నరాలు (సిరలు) నల్లబడడం, చనుమొనలు మరియు చనుమొన పరిసరం (areola) కూడా నల్లబడుతుంది.
- చిన్న గడ్డల్నిపోలి ఉండే చిన్న గ్రంథులు (tubercles) చనుమొనల పరిసరాల్లోని ఉపరితలంపై పెరుగుతాయి. వీటినే “మోంట్గోమేరీ యొక్క గ్రంథులు” అని పిలుస్తారు
- రొమ్ములు చాలా మృదువైనవిగా మరియు సున్నితత్వాన్ని సంతరించుకుంటాయి.
- కొందరిలో, గర్భధారణ ఆఖరి నెలల్లో, చనుమొనల్లోంచి మందమైన, పసుపురంగుతో కూడిన ద్రవస్రావం కల్గుతుంది.
- రొమ్ముల ఛాతీ మీద మరియు వాటి చుట్టుపక్కల దద్దుర్ల మార్కులు, చారలు మరియు నవపట్టడం (itchiness) వంటి చిహ్నాలు
(మరింత సమాచారం: గర్భధారణ ప్రారంభదశలో మరియు చివర్లో రొమ్ముల్లో వచ్చే మార్పులు)
గర్భవతుల్లో రొమ్ము నొప్పికి ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భధారణకు సంబంధించిన చాలా సంకేతాలు మరియు లక్షణాలు ఆడ హార్మోన్లలో జరిగే మార్పులతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ ఆడ హార్మోన్లు శిశువు యొక్క సంరక్షణ, రక్షణ మరియు శిశువు పెరుగుదలకు రెట్టింపుగా కృషి చేస్తుంటాయి. ముఖ్యంగా, బిడ్డ పుట్టిన తరువాత అనేక నెలల పాటు పాలు తాపడంద్వారా శిశువుకి పోషణను కల్పించేది తల్లి రొమ్ములే. గర్భధారణలో రొమ్ము నొప్పి లక్షణాలకు గల కొన్ని అన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి:
- ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలలో పెరుగుదల
- రొమ్ములకు రక్త ప్రసరణ స్థాయిల్లో పెరుగుదల, దీనికారణంగా, చనుమొనల చుట్టూ ప్రదేశం (areola) నల్లబడుతుంది. ఈ ప్రదేశంలో ఉండే సిరల్లోరక్తం అధికంగా చేరడంవల్లనే ఆ ప్రదేశం నల్లబడిండి.
- రొమ్ముల్లో కొవ్వు కణాలు పెంపొందించబడుతాయి, తద్వారా రొమ్ములు పెద్దవిగా తయారవుతాయి, దీనివల్ల చారల మార్కులు (stretch marks) ఏర్పడడం జరుగుతుంది.
గర్భవతుల్లో వచ్చే రొమ్ము నొప్పిని ఎలా నిర్ధారిస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఈ దశలో రోగ నిర్ధారణ అనుభవించిన నొప్పి మరియు అసౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది. వైద్యులు సాధారణంగా ఔషధాలను సూచించకుండా ఉండడమే కాకుండా రొమ్ములపైనా, ఛాతీపై రాయడానికి సూచించే మందులపట్ల కూడా గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండేట్టు వ్యవహరిస్తారు. గర్భవతులకు డాక్టర్లు చెప్పేదింతే: “మీరు ఓర్పుగా ఉండి, మేరు సౌకర్యంగా ఉండే స్థాయిని పెంచుకోవటానికి గల మార్గాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి” అని సలహా ఇస్తారు. సౌకర్యాన్ని పెంచుకునేందుకున్న పద్ధతులలో కొన్ని:
- అన్నివిధాలా రొమ్ములకు మద్దతును, సౌకర్యాన్ని కల్పించేదిగా ఉండే పెద్ద బ్రా ను ఉపయోగించడం. ఈ బ్రా పత్తి వంటి సహజమైన పదార్థంతో చేయబడినది, రొమ్ములకు శ్వాసపూరితమైనదిగా ఉండేట్టు చూసుకోవాలి.
- రొమ్ములపై గాట్ల చారల్ని(chapping or stretch marks) తొలగించేందుకు విటమిన్ E నూనెలు, లేదా ఇతర బలవర్థకమైన నూనెలు పూయడం మెత్తగా మర్దనచేయడంచేయచ్చు, కానీ ఇది కూడా డాక్టర్ తో సంప్రదించాకనే చేయమనిమీకుసలహా.
- రొమ్ముల్లో చికాకు మరియు సున్నితత్వాన్ని ఉపశమింపచేయడానికి మంచు ప్యాక్లను ఉపయోగించడం
- గర్భాధారణ సమయంలో, ముఖ్యంగా సంభోగం సమయంలో లేదా సంభోగప్రేరణ ప్రక్రియలో (foreplay ), భాగస్వామి గర్భవతి అయిన తన భాగస్వామి పట్ల చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది.