సారాంశం
ప్రపంచవ్యాప్తముగా, రొమ్ము క్యాన్సర్ అనునది స్త్రీలను ప్రభావితము చేసే సాధారణ క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణము ఏమనగా రొమ్ములో గడ్డ ఏర్పడడం. అయితే, వారి రొమ్ములో గడ్డ ఏర్పడడం అనునది రొమ్ము క్యాన్సర్ గల స్త్రీలందరిలో వృధ్ధి చెందదు(కలిగి ఉండరు). రొమ్ము క్యాన్సర్ యొక్క ఇతర లక్షణాలు, రొమ్ముల పైన చర్మము ఊడిపోవడం, చనుమొనల నుండి ద్రవం బయటకు రావడం, మరియు మెడ లేక కంఠం మరియు చంక భాగములలో గడ్డలను కలిగిఉండడం. అను లక్షణాలను కలిగి ఉంటుంది. మందులు మరియు సాంకేతికత యొక్క అభివృధ్ధితో, అనేక క్రొత్త డయాగ్నస్టిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి, ఇవి ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణను సులభతరం చేస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ అనునది నాలుగు విభిన్న దశలలో పురోగతి చెందుతుంది, వ్యాధిని ప్రారంభ దశలోనే కనుగొనడం అనునది సత్వర చికిత్సకు చికిత్సకు సహాయపడుతుంది, ఇది మనుగడ రేటును (జీవన ప్రమాణమును) పెంచుతుంది. నిర్ధారణ పరికరాలు, మమోగ్రఫీని ఉపయోగించి రొమ్ములను స్క్రీనింగ్ చేయుట, మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్ ఆర్ ఐ స్కాన్), మరియు రొమ్ములలో ఉన్న ద్రవాలు మరియు కణజాలమును స్క్రీనింగ్ చేయుట అను వాటిని కలిగి ఉంటాయి. బయోటెక్నాలజీ పరిణామాలు అనునవి రొమ్ము క్యాన్సర్ రావడానికి బాధ్యత వహించే తప్పుడు జన్యువుల నిర్ధారణకు సహాయపడతాయి. మాంసకృత్తులను గుర్తించుట పైన అధ్యయనము అనునది రొమ్ము క్యాన్సర్ కొరకు సరైన చికిత్స నియమమును కనుగొనుటను సులభతరము చేస్తుంది.
ఈ వ్యాధి యొక్క చికిత్స సంప్రదాయ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, మరియు హార్మోన్ల థెరపీ నుండి నూతన నానోటెక్నాలజీ-ఆధారిత సూత్రీకరణ పరిధి వరకు వృధ్ధి చెందింది. రొమ్ము క్యాన్సర్ అనునది క్రమమైన వ్యాయామము, శరీర బరువును నియంత్రించుట, మరియు ప్రసవం తరువాత కనీసం ఆరునెలల వరకు బిడ్డకు తల్లిపాలు పట్టించుట వంటి పధ్ధతుల ద్వారా కొంత వరకు నివారించవచ్చు. అయితే, రొమ్ము క్యాన్సర్ ఉన్న బలమైన చరిత్ర కలిగిన కుటుంబం తరువాతి తరాలకు వ్యాధి ప్రమాదమును అధికముగా పెంచుతుంది. అందువలన, ఇటువంటి సందర్భాలలో, క్రమముగా ఆరోగ్య-పరీక్ష లు (హెల్త్-చెకప్) చేయించుకోవడం అనునది రొమ్ము క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ కొరకు సహాయపడుతుంది. శరీరఊ యొక్క సాధారణ కణజాలముపైన క్యా న్సర్ కణజాలాలు దాడి చేసినప్పుడు సమస్యలు తలెత్తుతాయి, ఉదా., ప్రక్క కణజాలము పైన ఒత్తిడిని తేవడము వలన నొప్పి కలగడం, నరాలు లేక ప్రక్కన ఉన్న రక్తకణాల యొక్క అడ్డగింపు, మరియు ఇంకా అనేకమైన సమస్యలు తలెత్తుతాయి. అయితే, అధికమైన సమస్యలు రొమ్ము క్యాన్సర్ చికిత్స యొక్క ధుష్ప్రభావాల వలన ఏర్పడుతాయి, ఉదా., జుట్టు రాలిపోవడం, వాంతులు, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం మరియు మరికొన్ని సమస్యలు వస్తాయి. ఈ భయంకరమైన వ్యాధిలో మనగడ రేటును అభివృద్ధి చేసుకోవడానికి ప్రారంభములోనే రోగ నిర్ధారణ మరియు సత్వర చికిత్స అనునవి ప్రాథమిక అంశములు. రేడియేషన్, మందులను ఉపయోగించే కీమోథెరపీ మరియు శస్త్రచికిత్స అనునవి, క్యాన్సర్ యొక్క తీవ్రత మరియు వ్యాప్తి అధారముగా తీసుకునే మూడు అత్యంత సాధారణ పధ్దతులు.