ఆపుకోలేని మలవిసర్జన అంటే ఏమిటి?
మలవిసర్జనపై వ్యక్తికి అదుపు లేకపోవడాన్నే “ఆపుకోలేని మలవిసర్జన” (Bowel Incontinence) అంటారు. అంటే మలవిసర్జనకు పోవాలనుకున్నపుడు కొద్దిసేపు కూడా ఆపుకోలేకపోవడాన్నే ఆపుకోలేని భేది జబ్బుగా నిర్వచించొచ్చు. అందువలన, మల విసర్జన అకస్మాత్తుగా మరియు అసంకల్పితంగా లేదా అనుకోకుండా సంభవిస్తుంది, దీన్నే “ఆపుకోలేని భేది” చెబుతారు. ఈ రకమైన పరిస్థితి (జబ్బు) వృద్ధులలో, ముఖ్యంగా మహిళలలో కనిపిస్తుంది. ఇలా భేదిని ఆపుకోలేని పరిస్థితి అప్పుడప్పుడు, తీవ్రతను బట్టి, జరుగుతుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్తో సంప్రదించడం అవసరమవుతుంది. ఆపుకోలేని భేది అనే ఈ అప్రయత్నపూర్వకమైన మలవిసర్జకచర్య మనిషిని ఇబ్బందికరమైన పరిస్థితికి గురిచేసి మనుషులలో కలవడానికి వ్యాకులపడే స్థితిని కలుగజేస్తుంది. ఈ వ్యాకులత, ఆందోళనవల్ల ఈ జబ్బున్న వ్యక్తి సాంఘిక జీవితానికి దూరమయ్యే పరిస్థితికి దారి తీస్తుంది.
దీని ప్రధాన సంబంధ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఆపుకొనలేని భేది జబ్బు రెండు రకాలు. ఈ జబ్బు యొక్క వ్యాధి లక్షణాలు ఈ రెండు రకాలపై ఆధారపడి వేర్వేరుగా ఉంటాయి.
- వచ్చే మలాన్ని ఆపుకొనలేని తత్త్వం
మలవిసర్జనకు పోవాలన్న కోరిక మీకు కలగొచ్చు, అయితే టాయిలెట్కు చేరేవరకు కూడా మీరు భేది ని ఆపుకోలేక పోతారు (అంటే మలవిసర్జన మీ బట్టల్లోనే అయ్యే పరిస్థితి). - అప్రయత్న పూర్వక మలం (Bowel Faecal Incontinence)
ఈ రకమైన ఆపుకోలేని భేది రకంలో మలం విసర్జించక ముందు మీకు మలవిసర్జనకు పోవాలన్న ఉద్దీపన (ప్రేరేపణ) కానీ బుద్ధి కానీ పుట్టదు. మీకు తెలియకుండానే భేది ఉన్నచోట్లోనే అయిపోయి ఉంటుంది.
అపానవాయువు (flatulence) లేక గ్యాస్ ను నియంత్రించడంలో మరియు గాస్ తో కూడిన మలం యొక్క మచ్చలు లేదా మరకల విసర్జనల్ని నియంత్రించడంలో అశక్తత. .
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
ఆపుకొనలేని భేదికి గల వివిధ కారణాలు:
- అతిసారం
- తీవ్రమైన మలబద్ధకం .
- శస్త్రచికిత్స లేదా గాయం కారణంగా ఆసన కండరాలు బలహీనపడటం.
- శస్త్రచికిత్స లేదా గాయం కారణంగా పాయువు మరియు పురీషనాళంలో నరాల నష్టం.
- హేమోరాయిడ్స్ / మొలలు
- జారిన పురీషనాళం
- స్త్రీలలో యోని ద్వారా చూస్తే పురీషనాళం కానరావడం.
- క్రోన్స్ వ్యాధి, వ్రణోత్పత్తితో కూడిన పెద్దప్రేగు నొప్పి, మరియు ప్రేగు వాపు వ్యాధి వంటి జీర్ణశయాంతర ప్రేగు సమస్యలు .
- డయాబెటిస్ , పార్కిన్సోనిజం , స్ట్రోక్ , చిత్తవైకల్యం మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధి పరిస్థితులు .
- సాధారణ పురుడు (డెలివరీ).
- క్రియారహిత జీవనశైలి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు, చికిత్స ఏమిటి?
మీ వైద్యుడు మిమ్మల్ని శారీరక పరీక్ష చేసిన తరువాత మీ వ్యాధి లక్షణాలు మరియు ఇతర వైద్య పరిస్థితుల చరిత్రను మీ నుండి అడిగి తెలుసుకుంటాడు. పరిస్థితి యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత ఆధారంగా, డాక్టర్ ఇతర రోగనిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. అనోస్కోపీ (పాయువు లోపలి భాగాన్ని వీక్షించడానికి), అనోరెక్టల్ మ్యానోమెట్రీ (ఆసన కండరాలలోని బలహీనతను గుర్తించడానికి), ఎండోనల్ అల్ట్రాసోనోగ్రఫీ, మరియు డిపెక్కోగ్రఫీ (పాయువు, పురీషనాళం లేదా దాని కండరాలలో ఏవైనా సమస్యలునోచి గుర్తించడం కోసం ఈ అవయవ చిత్రాలను రూపొందించడం).
ఆపుకోలేని భేదికి చికిత్సలో:
- ఆహారంలో మార్పులు చేయండి, పీచు ఆహారాలు తీసుకోవడం మరియు నీరు పుష్కలంగా త్రాగడం.
- జీవనశైలి మార్పులు
- కండరాలను బలోపేతం చేయడానికి వ్యాయామం చేయండి.
- ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయంలో మలవిసర్జనకు వెళ్లే అలవాటును చేసుకునేందుకు తగిన శిక్షణను మీ అంతటా మీరే ఇచ్చుకోండి. .
- అంతర్లీన వ్యాధి కారణాలకు చికిత్స చేయడానికి మందులు.
- శస్త్రచికిత్స: వ్యాధి కారణం మరియు పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి శస్త్రచికిత్స ఉంటుంది.