ఎముక నొప్పి ఏమిటి?
ఎముక నొప్పి అనేది ఓ వ్యాధి లక్షణం. ఇది ఎముక నొప్పి రూపంలో రోగికి స్పష్టంగా అవగతమవుతుంది. ఈ ఎముక నొప్పిలో సున్నితత్వం లేదా తీవ్ర అసౌకర్యం వంటి వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎముకలలో కనబడుతుంది. ఎముక నొప్పి సాధారణంగా చేతులు మరియు కాళ్ళలోని పొడవైన ఎముకలను బాధిస్తుంది. ఎముక నొప్పి వ్యాధిని తరచుగా నిర్లక్ష్యం చేసినప్పటికీ, వ్యక్తి యొక్క సాధారణ పనితీరును మరియు రోజువారీ జీవితాన్ని ఎముక నొప్పి తీవ్రంగా బాధిస్తుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎముక నొప్పి యొక్క లక్షణాలు అంతర్లీన లక్షణాలు (పరిస్థితి)తో సంబంధం కలిగి ఉంటాయి.
క్యాన్సర్తో సంబంధం ఉన్న ఎముక నొప్పి :
- వ్యాధి సోకిన ప్రాంతంలో ప్రారంభ సున్నితత్వం
- నిరంతరం లేదా అంతరాయంతో కూడిన నొప్పి ఉంటుంది, పని చేస్తున్నప్పుడే కాక విశ్రాంతిలో ఉన్నపుడు కూడా కూడా ఈ ఎముక నొప్పి బాధిస్తుంది.
బోలు ఎముకల వ్యాధికి సంబంధించిన ఎముక నొప్పి:
- తీవ్రమైన వెన్నునొప్పి
- భంగిమలో మార్పిడి
- ఎత్తు నష్టం
- నడిచే సామర్థ్యానికి లోపం
- దీర్ఘకాలిక వైకల్యం
కీళ్లవాపుకి సంబంధించిన ఎముక నొప్పి:
- తగ్గిన కీళ్ల వశ్యత (కీళ్లలో వాటి వంగుడు గుణం లోపించడం)
- కీళ్ల వాపు
- కీళ్లు బిర్రబిగుసుకుపోవడం (పెడసరం) మరియు వైకల్యం
- తగ్గించబడిన కదలికలు మరియు చర్యలు
పాగెట్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు :
- వెన్నెముక, పొత్తికడుపు మరియు కాళ్ళ వంటి బరువు మోసే ఎముకలలో నొప్పి
- ఎముకలో సూక్ష్మ-పరిమాణపు విరుగుళ్లు
ఇతర కారణాలవల్ల ఎముక నొప్పి కారణంతో ప్రత్యేకమైన నిర్దిష్ట లక్షణాలు కలిగి ఉండవచ్చు.
ఎముక నొప్పి యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?
ఎముక నొప్పి యొక్క అత్యంత సాధారణ కారణమే కానీ తక్కువ స్పష్టమైన కారణం ఏదంటే ఎముక క్యాన్సర్ (ప్రాధమిక క్యాన్సర్).
ఇతర కారణాలు:
- బోలు ఎముకలవ్యాధి (Osteoporosis)
- కీళ్లవాపు (ఆర్థరైటిస్)
- పాగెట్స్ వ్యాధి
- క్యాన్సర్ యొక్క కణాల (మెటాస్టాటిక్) వ్యాప్తి
- తగ్గిన రక్తసరఫరా (కొడవలి కణాల అనీమియా వ్యాధిలో లాగా )
- అస్థిమధ్యబాధ (ఎముక యొక్క వాపుతో బాటు అందుండి చీము కారుట)
- ఇన్ఫెక్షన్
- గాయం లేదా ఆఘాతం, ఎముక విరిగిన తర్వాత జరిగే ప్రమాదాలు
- ల్యుకేమియా
- మితిమీరిన గాయం
- పసిపిల్లల్లో విరుగుళ్లు (పసిపిల్లలలో సంభవించే ఒత్తిడి విరుగుళ్లు)
ఎముక నొప్పిని ఎలా నిర్ధారణ చేస్తారు, దానికి చికిత్స ఏమిటి?
అంతర్లీన పరిస్థితి రోగనిర్ధారణకుగాను అవసరమైన వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్ష తప్పనిసరి.
క్రింది పరీక్షలు సూచింపబడవచ్చు:
- రక్త పరీక్షలు (పూర్తి రక్త గణన మరియు అవకలన (భేదాత్మక) రక్త గణన పరీక్షలు వంటివి)
- ఎముక X-కిరణాలు (Bone X-rays)
- CT లేదా MRI స్కాన్
- హార్మోన్ స్థాయి అధ్యయనాలు
- పిట్యూటరీ మరియు అడ్రినల్ గ్రంధి కార్యవైఖరి పరీక్షలు
- మూత్ర విశ్లేషణ
ఎముక నొప్పి వ్యాధికి చేపట్టే చికిత్స దాని లక్షణం మరియు అంతర్లీన వ్యాధి అనే రెండింటినీ నయం చేసే చికిత్స ఉంటుంది. వీటితొ పాటు:
- మందులు: యాంటీబయాటిక్స్ (విషక్రిమి వినాశకాలు), యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు (నొప్పి నివారిణులు), హార్మోన్ల థెరపీ, అనాల్జెసిక్స్ (బాధనాశక ఔషధాలు) మరియు దీర్ఘకాలికంగా మంచంపైన్నే విశ్రాంతి తీసుకున్నటువంటి వారికి దాపురించే విరేచనకారక (లాక్సిటివ్స్) మందులు.
- ఎముకలనొప్పి, కీళ్ల వ్యాధులకు (ఆస్టియో ఆర్థరైటిస్) అదనపు చికిత్స చర్యలు ఉండవచ్చు:
- పైపూతగా నొప్పి-ఉపశమనం క్రీమ్లు
- వ్యాయామాలు మరియు భౌతిక చికిత్స
- ఉమ్మడి చీలిక లేదా పునఃస్థాపన చికిత్స (Joint splinting or replacement therapy)
- బోలు ఎముకల వ్యాధికి మరియు కీళ్ళవ్యాధి (ఆర్థరైటిస్) చికిత్సకు కూడా కింది ప్రక్రియలు ఉండవచ్చు:
- సాగతీత, బలోపేతం, భంగిమ మరియు చలన శ్రేణిపై పని చేసే వ్యాయామాలు
- పునరావాస ప్రక్రియలు
- పాగెట్ వ్యాధికి చేసే అదనపు చికిత్సలో ఇవి ఉన్నాయి:
- ఎముక పునర్నిర్మాణం రేటు తగ్గించడానికి మందులు
- ఎముక సంయోగం లేదా కీళ్ల భర్తీ కోసం కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం కావచ్చు
- ఎముక శక్తిని నిర్వహించడానికి, ఇంకా బరువు మోసే కీళ్ల నిరాటంక కదలికలకు (mobie) మరియు నొప్పి లేకుండా ఉండటానికి శారీరక వ్యాయామం
- ఎముక క్యాన్సర్ చికిత్సలో కింది చికిత్సలు ఉండవచ్చు:
- సర్జరీ
- కీమోథెరపీ
- రేడియోథెరపీ
- రోగనిరోధక చికిత్స