సారాంశం
అధిక రక్తపోటు అంటే శరీరంలోని రక్తం యొక్క ఒత్తిడి అనారోగ్య స్థాయిలకు చేరిందన్నమాటే. అధిక రక్తపోటును “హైపర్ టెన్షన్” అని కూడా అంటారు. రక్తపోటు అనేది రక్తనాళాల (ధమనుల) గోడలపై రక్తం తన ప్రసారంలో పెంచే శక్తి మరియు గుండె రక్తాన్ని పంపు చేసినపుడు రక్తం అందుకునే నిరోధకవిస్తరణా శక్తి. దీర్ఘకాలిక అధిక రక్తపోటు గుండె-సంబంధిత (హృదయ) ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
అధిక రక్తపోటు విస్తృతంగా రెండు ప్రధాన రకాలుగా విభజించబడుతుంది-ప్రాధమిక లేదా అత్యవసర రక్తపోటు మరియు ద్వితీయ రక్తపోటు. స్వల్ప రక్తపోటు ఏ లక్షణాలను పొడ జూపకుండా (వ్యాధిలక్షణ రహితంగా) ఉండచ్చు, అందువల్ల, రక్తపోటులో తేలికపాటి పెరుగుదల ఉన్నవారు తమకేర్పడిన పరిస్థితి గురించి వారికి తెలియదు. అయితే, అధిక రక్తపోటు కల్గినవారిలో, తలనొప్పి వంటి భయపెట్టే రోగలక్షణాలు ఉంటాయి. అధిక రక్తపోటు అనేది కొన్ని అంతర్లీన లేదా సంబంధిత ఆరోగ్య సమస్యల ఫలితంగా దాపురించి ఉండవచ్చు. అయితే, కొన్నిసార్లు, అధిక రక్తపోటుకు గల కారణం తెలియకుండానే ఉంటుంది. ప్రధానంగా, ఆహారంలో ఉప్పును నియంతరించడం, నిత్యశారీరక వ్యాయామం చేయడం మరియు తగిన మందులు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును సమర్థంగా నియంత్రించవచ్చు.
రోగిలో అధిక రక్తపోటును కనుగొనడంలో ఆలస్యం చేసినా, కనుగొన్న తర్వాత చికిత్సను ఆలస్యంగా మొదలుపెట్టినా, గుండెకు రక్త సరఫరా తక్కువై లేదా పూర్తిగా నిల్చిపోయి, తీవ్రమైన గుండెపోటు, (తీవ్రమైన మయోకార్డియల్ ఇంఫార్క్షన్) మరియు కంటి సమస్యలు (రెటినోపతీ) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలా అధిక రక్తపోటును ఆలస్యంగా కనుగొన్నపుడు, దాని తదుపరి పరిణామం అంతర్లీనంగా ఉండే వ్యాధికారకం మరియు స్వీకరించిన చికిత్సపై ఆధారపడి ఉంటుంది. అధిక రక్తపోటు, చక్కెరవ్యాధి లేదా డయాబెటిస్ ఉన్నవారికి వచ్చినట్లైతే అది వారిపై ప్రభావం చూపి కీడు చేసే ప్రమాదముంది. జీవితాంతం జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మరియు జీవితాంతం నిబద్ధతగా ఔషధాలను తీసుకోవడం అధిక రక్తపోటు సక్రమ నిర్వహణకు చాలా అవసరం. పరిస్థితి అలాగున్నపుడు, అధిక రక్తపోటు ఉన్నవారు ఔషధాలకు కట్టుబడి జీవనం సాగించడం కష్టం. అందుకే, నియతకాలికంగా ఆసుపత్రులకెళ్లి వైద్యులను సందర్శించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం మరియు వైద్యుని సలహాలను పాటించి ఎప్పటికప్పుడు తగిన జీవనశైలి మార్పులు చేసుకుంటే అధిక రక్తపోటును నిర్వహించడంలో రోగులు కృతకృత్యులవుతారు.