సారాంశం
మలవిసర్జన సందర్భంగా అపానం నుండి రక్తం పడటాన్ని అపానం నుండి రక్తస్రావం అని పిలుస్తారు. సామాన్యంగా ఈ రక్తస్రావాన్ని మలవిసర్జన పూర్తయిన తర్వాత లేదా టాయిలెట్ పేపర్ ఉపయోగించినప్పుడు కనుగొంటాము. ఆసనము నుండి రక్తం పడటం (రెక్టాల్ బ్లీడింగ్) జీర్ణకోశ ప్రాంతము పైభాగం లేదా క్రింది భాగం నుండి రక్తస్రావం జరిగినట్లు పరిగణిస్తారు. రక్తస్రావం నోటినుండి అపానం వరకు ఏ భాగంలోనైనా జరగవచ్చు. దీనికి కారణం గుదము చినగడం కావచ్చు లేదా మూలవ్యాధి కావచ్చు. దీనివల్ల పొత్తికడుపులో నొప్పి లేదా బలహీనత ఎదురవుతుంది. కొన్ని సందర్భాలలో అపానం నుండి రక్తస్రావం పొంచి ఉన్న జబ్బుకు సంకేతం కావచ్చు. దీనితో వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఇట్టి రోగులకు సంపూర్తిగా బ్లడ్ కౌంట్ మరియు పెద్దప్రేగు దర్శనం వంటి వైద్య పరిశోధనలు జరుపుతారు. ఎదురవుతున్న జబ్బు కారణాన్ని పరిశీలించి చికిత్స కొనసాగిస్తారు. ఈ ప్రక్రియ ఖచ్చితంగా డాక్టరు మార్గదర్శకత్వంలో జరగాలి.