మూసుకుపోయిన ఫెలోపియన్ నాళాలు అంటే ఏమిటి?
ఫెలోపియన్ నాళాలు అనేవి అండాశయాల నుండి గర్భాశయం వరకు అండాలను తీసుకువచ్చే రెండు చిన్న నాళాలు. మానవులలో, అండము యొక్క ఫలదీకరణం ఫెలోపియన్ నాళాల లోపల జరుగుతుంది. ఫెలోపియన్ నాళాలలో అడ్డంకులు మరియు నిరోధాలు అండాలు ఫెలోపియన్ నాళాలలోకి ప్రవేశించకుండా నివారించవచ్చు లేదా గర్భాశయ మార్గం గుండా వెళ్ళకుండా నిరోధించవచ్చు. ఇది గర్భాశయ స్థితి వలన లేదా STD (లైంగిక సంక్రమణల) వల్ల కలుగుతుంది మరియు దాని వలన ఎక్టోపిక్ గర్భాలు (గర్భాశయం వెలుపల గర్భధారణ) మరియు సంతానోత్పత్తి సమస్యలను నివారించడానికి శ్రద్ధ అవసరం.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ముసుకుపోయిన ఫెలోపియన్ నాళాలు వంధ్యత్వం, ఆలస్యం చేయబడిన ఋతుచక్రాలు లేదా చాలా చిన్నగా లేదా చాలా ఎక్కువగా ఉండే ఋతు చక్రాలు వంటివి తప్ప సంకేతాలు లేదా లక్షణాలను పెద్దగా చూపించవు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఫెలోపియన్ నాళం యొక్క అంతర్గత గోడల గాయాలు లేదా నాళాన్ని నిరోధించే అసాధారణ పెరుగుదలలు వంటివి ఫెలోపియన్ నాళాలు ముసుకుపోయే సాధారణ కారణాలు:
- అతుకులు (Adhesions)
- గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా చిన్న పొక్కులు
- క్లామిడియా (Chlamydia) మరియు గోనేరియా (gonorrhoea) వంటి అంటువ్యాధులు
- పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి
- ఎండోమెట్రీయాసిస్ (Endometriosis)
- ఫెలోపియన్ నాళాలకు సంబంధం ఉన్న మునుపటి ఎక్టోపిక్ గర్భం లేదా ఏదైనా ఉదర శస్త్రచికిత్స
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముసుకుపోయిన ఫెలోపియన్ నాళాలు వివిధ రేడియాలజికల్ (radiologic) లేదా స్కోపింగ్(scoping) పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేయబడతాయి:
- ఉదరం మరియు పొత్తికడుపు యొక్క X- రేలు
- ప్రత్యేకమైన ఎక్స్-రే అధ్యయనం, దానిని హిస్టెరోసాల్పెనోగ్రామ్ (hysterosalpingogram)అని పిలుస్తారు
- పెల్విస్ యొక్క అల్ట్రాసౌండ్
- లాప్రోస్కోపీ (Laparoscopy)
చికిత్స పద్ధతులు నాళాల నిరోధాన్ని తొలగించడానికి బహిరంగ లేదా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను కలిగి ఉంటాయి. ఈ క్రింది పద్ధతులను ఉపయోగిస్తారు:
- అడ్డంకి గర్భాశయం సమీపంలో ఉంటే, ఒక శస్త్రచికిత్సా లేని పద్దతి చేయబడుతుంది, దీనిలో చిన్న గొట్టం (లేదా కానన్లా) నాళాన్ని తిరిగి తెరవడానికి నాళంలోకి చేర్చబడుతుంది.
- విస్తృత లేదా లోతైన అడ్డంకులు ఉన్నట్లయితే,శస్త్రచికిత్స అనేది నాళం యొక్క అడ్డగించబడిన విభాగాన్ని తొలగించి, దాని ఆరోగ్యకరమైన చివరలను తిరిగి కలుపుతుంది.
- హైడ్రోసాల్పిన్క్స్లో(hydrosalpinx) (ద్రవం చేరడం కారణంగా గొట్టం నిరోధించబడితే), ద్రవం చేరిక యొక్క మూలం తొలగించబడుతుంది. గర్భాశయానికి ఒక క్రొత్త ముఖద్వారాన్ని సృష్టించవచ్చు.
- నాళం యొక్క చివరి భాగాన్ని,అండాశయం నుండి అండాలను తీసుకురావడానికి శస్త్రచికిత్స చేసి పునఃసృష్టి చేయవచ్చు.