బెల్స్ పాల్సి ముఖ పక్షవాతం అంటే ఏమిటి?
బెల్స్ పాల్సి ముఖ పక్షవాతం అనేది ఒక వైపు ముఖ కండరాలు బలహీనంగా మారడం లేదా పక్షవాతానికి గురిఅయ్యే ఒక రకమైన ముఖ పక్షవాతం. ఈ కండరాలకు సరఫరా అయ్యే ముఖ నరాలు దెబ్బతినడం వలన ఇది ఏర్పడుతుంది. అయినప్పటికీ, కండరాలు తాత్కాలికంగా మాత్రమే ప్రభావితమవుతాయి, మరియు ఈ పరిస్థితి చికిత్సతో పూర్తిగా పరిష్కారమవుతుంది .
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
-
బెల్స్ పాల్సిలో సాధారణంగా ముఖంలో ఒక వైపు కండరాలు మాత్రమే ప్రభావితం అవుతాయి. కేసుల్లో దాదాపు 1% లో మాత్రమే, ప్రభావం ద్వైపాక్షికంగా ఉంటుంది.
-
ముఖ నరాలచే నియంత్రించబడే కదలికలు ప్రభావితమయ్యాయి. రోగులు కళ్ళు రెప్పలు మూయడం, తెరవడంతో కష్టపడతారు, ప్రభావిత వైపున నోరు తెరవడం, నవ్వడం మరియు నమలడంలో ఇబ్బంది పడతారు.
-
ముఖంలో ఆ వైపున, ముఖ్యంగా దవడ మరియు తలలలో నొప్పి ఉండవచ్చు.
-
కండరాల బలహీనత కారణంగా నోటి మూలలో నుండి ఉమ్మి జారిపోతుంది మరియు కనురెప్పలు వేలాడిపోతాయి.
-
నాలుక ముందు భాగంలో రుచి అనుభూతిని కూడా ప్రభావితం చేయవచ్చు.
బెల్స్ పాల్సికి ప్రధాన కారణాలు ఏమిటి?
బెల్స్ పాల్సికి ఖచ్చితమైన కారణం తెలియదు; అయినప్పటికీ, అనేక వైరల్ సంక్రమణలు ప్రేరేపిస్తాయి అని చెప్పబడుతున్నాయి. వీటిలో హెర్పెస్ సింప్లెక్స్ (herpes simplex), హెర్పెస్ జోస్టర్ (herpes zoster), హెచ్ఐవి (HIV), సైటోమెగలోవైరస్ (cytomegalovirus) మరియు ఎప్స్టీన్ బార్ వైరస్ (Epstein Barr virus) ఉన్నాయి.
ఈ వ్యాధికి ప్రమాద కారకాలు:
గాయం, వాపు లేదా ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నిర్ధారణకు, భౌతిక మూల్యాంకనంతో పాటు ఇమేజింగ్ మరియు రక్త పరీక్షలు కూడా అవసరం.
- వైద్యులు లక్షణాల ఆధారంగా ముఖాన్ని పరిశీలిస్తారు, మరియు కనురెప్పలు వాలిపోవడం, లాలాజలము జారిపోవడం, వంటి సంకేతాలను తనిఖీ చేస్తారు.
- ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT)స్కాన్ వంటి ఇమేజింగ్ పద్ధతులు ముఖ నరాల యొక్క స్థితిని చూడటానికి సహాయం చేస్తాయి.
- వైద్యులు వైరల్ సంక్రమణను (infection) అనుమానించినట్లయితే, దానిని నిర్ధారించడానికి రక్త పరీక్షఅవసరమవుతుంది.
- అఘాతం, లైమ్ వ్యాధి మరియు మెదడు కణితులు వంటి ఇతర సమస్యలను మినహాయించి రోగనిర్ధారణ అనేది ఉంటుంది.
బెల్స్ పాల్సికి సంబంధించిన చికిత్స గుర్తించిన కారణాలు లేదా ప్రమాద కారకాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
- కోర్టికోస్టెరాయిడ్స్ (corticosteriods) ఈ స్థితికి చికిత్స చేయడానికి ఉపయోగించే ప్రామాణిక మందులు. అవి 6 నెలల వ్యవధిలో ఉపశమనం కల్పిస్తాయి. అయినప్పటికీ, ఈ సమస్య మొదట్లో స్టెరాయిడ్లతో చికిత్స ప్రారంభించటం చాలా ముఖ్యం.
- వైరస్ కారణం అని అనుమానించబడితే, యాంటీవైరల్ మందులు ఇవ్వబడతాయి.
- మందులతో పాటు, ఫిజియోథెరపీ ద్వారా కండరాల వ్యాయామాలు కూడా సూచించబడతాయి.
- తీవ్రమైన సందర్భాల్లో, నాడి అణిచివేయబడిన లేదా గాయంతో ప్రభావితం ఐనా, శస్త్రచికిత్సా విధానం ముఖ పక్షవాతానికి ఉపశమనం కలిగించవచ్చు.
- ఈ పరిస్థితి కొన్ని నెలలలో పరిష్కరించబడుతుంది అరుదుగా పునరావృతమవుతుంది.