రక్తనాళాలు గట్టిపడడం (ఎథెరోస్క్లెరోసిస్) అంటే ఏమిటి?
ఎథెరోస్క్లెరోసిస్ అనేది శరీర ధమనులను (arteries) ప్రభావితం చేసే ఒక సమస్య, ఇది ధమని గోడలలో ఫలకం (plaque)ఏర్పడటం వల్ల ధమనినిగట్టిగా మరియు ఇరుకుగా చేసే ఒక సమస్య.
గోడ మందంగా మారడం వలన, క్రమంగా, ధమని ఇరుకుగా అవుతుంది, క్రమంగా దానికి సంబంధమున్న శరీర భాగానికి రక్త సరఫరా తగ్గిపోతుంది.
ఎథెరోస్క్లెరోసిస్ ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- ఎథెరోస్క్లెరోసిస్ ప్రారంభంలో ఉన్నప్పుడు లక్షణాలను చూపించదు. ఇది నెమ్మదిగా వృద్ధి చెందే వ్యాధి మరియు ఇది ప్రారంభ దశలో తరచుగా గుర్తించబడదు.
- ఎథెరోస్క్లెరోసిస్ యొక్క లక్షణాలు ప్రభావితమైన ధమనుల యొక్క స్థానాన్ని బట్టి ఉంటాయి.
- గుండెకు దారితీసే ధమనులలో అడ్డంకులు ఉంటే, ఎడమ చెయ్యి,భుజము లేదా దవడ వరకువ్యాపించే ఛాతీ నొప్పి ఏర్పడుతుంది (ఏంజిన).
- అథెరోస్క్లెరోసిస్వేరే అవయవాల యొక్క ధమని లో ఉంటే, ఆ అవయవంలో నొప్పి మరియు తిమ్మిరి ఉంటాయి.
- ఎథెరోస్క్లెరోసిస్ మెదడు యొక్క ధమనులలో ఉంటే, గందరగోళం, తలనొప్పి, అవయవాలలో బలహీనత, బలహీనమైన దృష్టి మరియు మైకము వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రధాన కారణాలు ఏమిటి?
ఎథెరోస్క్లెరోసిస్ జీవనశైలి, ఆహారం మరియు అలవాట్లు మరియు కొన్ని వైద్యసమస్యలకుసంబంధించిన అంశాల వలన ఏర్పడవచ్చు.
- అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మరియు మధుమేహం వంటి వైద్య సమస్యలు ఒక వ్యక్తికి ఎథెరోస్క్లెరోసిస్మరింతగాఏర్పడేలా చేస్తాయి.
- ధూమపానం, మద్యపానం, ఊబకాయం మరియు చలనంలేని జీవనశైలి వంటివి ప్రమాద కారకాలు.
- అధిక కొవ్వు ఆహారం, లేదా అధిక చక్కెర మరియు ఉప్పు కలిగిన ఆహారం కూడా కారణాలుగా ఉన్నాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యాధి నిర్ధారణ రోగి, వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్షల మరియు రోగి ఫిర్యాదులపై ఆధారపడి ఉంటుంది. శారీరక పరీక్ష సమయంలో, కార్డియాలజిస్ట్ నాడి మరియు హృదయ స్పందన యొక్క బలాన్ని తనిఖీ చేస్తాడు మరియు అసాధారణ హృదయ ధ్వనుల గురించి వింటాడు.
ఎథెరోస్క్లెరోసిస్ గురించి పరిశోధనలు:
- కొలెస్ట్రాల్, చక్కెర, సోడియం మరియు ప్రోటీన్ల స్థాయిని అంచనా వేయడానికి రక్త పరీక్షలు జరుగుతాయి.
- CT స్కాన్ ధమని అడ్డంకుల కోసం తనిఖీ చేయబడుతుంది.
- ఆంజియోగ్రామ్లో అడ్డంకుల తనిఖీ కోసంఒక రంగు ఉపయోగించబడుతుంది.
- ఒక డోప్లర్ ఆల్ట్రాసౌండ్ను కూడా ధమని అడ్డంకులను గుర్తించడానికి ఉపయోగించవచ్చు.
- ఇతర పరిశోధనలలో ఒత్తిడి పరీక్ష మరియు ECG ఉన్నాయి.
ఎథెరోస్క్లెరోసిస్ చికిత్సలో ఇవి ఉన్నాయి:
- ధూమపానం నిరోధించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం, జీవనశైలి మార్పులు సమస్యను మెరుగుపరుస్తాయి.
- రక్తపోటు తగ్గించడానికి మరియు కొలెస్ట్రాల్-నియంత్రణ మందులు ప్రతిస్కందకాలు (anticoagulants), మూత్రవిసర్జన మందులు ఉన్నాయి.
- అడ్డంకులు తీవ్రంగా ఉంటే, బైపాస్ లేదా యాంజియోప్లాస్టీ (angioplasty) వంటి శస్త్రచికిత్సలుగుండె శస్త్రచికిత్స ద్వారా నిర్వహించబడతాయి.
ఎథెరోస్క్లెరోసిస్ కోసం గృహ సంరక్షణ:
- అధిక కొవ్వు పదార్ధాలు మరియు సోడియం అధికంగా ఆహారాలు తినడం మానుకోండి. మాంసకృత్తులతో (protein) అధికంగా ఉండే ఆహారాలు తినాలి.
- క్రమమైన వ్యాయామం, కనీసం 30 నిమిషాలు.
- మీ ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవాలి మరియు పనిలో సామర్థ్యం అకస్మాత్తుగా తగ్గడం గమనించినట్లయితే డాక్టర్ను సంప్రదించండి.