సారాంశం
కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) అంటే మన శరీరంలోని అన్ని కీళ్ళు, మోకాళ్లు, మోచేతులు, తుంటి, మరియు చీలమండలాల్లో వాపులతో కూడిన నొప్పితో బాధిస్తూ ఉండడం. నొప్పి, వాపు ఉన్న చోట ఎరుపురంగుదేలి ఉండడం కూడా కీళ్ళనొప్పుల లక్షణం. కీళ్లనొప్పులు అనేవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కణాలను మరియు ఉపాస్థి (కీళ్లలో గట్టినరాలు’ లేదా ‘cartilages) నరాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి. ఇలా కీళ్ళు, వాటిసమీప ప్రాంతాలపై కీళ్లనొప్పులు దాడి జరిపి రోగిని నొప్పిస్తాయి. కదలినప్పుడల్లా కీళ్లలో తీవ్ర నొప్పిని కలుగజేసి కష్టాలు తెచ్చి పెడతాయి. కీళ్లనొప్పులు పలు రకాలు. కానీ కీళ్లనొప్పుల్లో ‘రుమటాయిడ్’ నొప్పులు, బాల్యపు కీళ్లనొప్పులు మరియు ఆస్టియోఆర్థరైటిస్ అనే రకాలు అత్యంత ప్రబలమైనవి. కీళ్ళనొప్పులకు ఎటువంటి శాశ్వత పరిహారం లేదు కానీ ఈ సంకటం దాపురించినపుడు తగిన జాగ్రత్తలతో దీన్ని నిర్వహించకోవడం వలన నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇంకా, అలా జాగ్రత్తలు తీసుకోవడం మూలాన కీళ్లనొప్పులతో ముడిపడి ఉన్న హృదయకండరాల జబ్బులు మరియు తీవ్రమైన కీళ్లనష్టాలను నిరోధించకోవచ్చు.