సారాంశం
అపెండిక్స్ అనేది పెద్దపేగులో భాగమైన, అంధనాళానికి జతచేయబడిన ఒక సన్నని గొట్టం లాంటి అవయవము. ఇది ఉదరానికి క్రింది పక్క కుడి వైపున ఉంటుంది (ఛాతికి పొత్తికడుపుకి మధ్య ఉన్న ప్రదేశంలో). మన శరీరంలో అపెండిక్స్ యొక్క ఖచ్చితమైన పాత్ర తెలియనిదిగా మిగిలిపోయింది, కానీ ఇతర జంతువుల్లో; ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అపెండిసైటిస్ ఒక అత్యవసర పరిస్థితి, ఇందులో అపెండిక్స్ ఎర్రబడి పొత్తికడుపు క్రింది పక్క కుడివైపున తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇంతే కాకుండా, అపెండిసైటిస్ తో ఉన్నవారు వాంతులు, జ్వరం మరియు వెన్ను క్రింది భాగం నొప్పి వంటి లక్షణాలను ఎదుర్కుంటారు. రోగ నిర్ధారణ కొరకు, వైద్యులు దీని లక్షణాలను చూసి, అవసరమైతే ఒక క్లినికల్ పరీక్షను నిర్వహిస్తారు, అల్ట్రాసౌండ్, ల్యాబ్ టెస్టులు లేదా సిటీ స్కాన్లను సిఫార్సు చేస్తారు. అప్పెండెక్టమీ లేదా అప్పెండిసెక్టమీ అనేది అపెండిక్స్శ ను తొలగించడానికి పొత్తికడుపు లో ఒక గాటుని పెట్టేటువంటి ఒక శస్త్రచికిత్సా ప్రక్రియ . కొన్ని కేసులలో, యాంటిబయోటిక్ థెరపీని కూడా ఉపయోగిస్తారు. అపెండిక్స్ యొక్క సన్నని గొట్టం కు మలం మరియు ఆహార పదహార్దాల చేత అవరోధం కలిగినప్పుడు, అది చిట్లి ఆ పదార్ధాలు పొత్తికడుపు చుట్టుప్రక్క నాళాలకు వ్యాపితమై ఇన్ఫెక్షన్ ను కలిగిస్తాయి. ఇటువంటి సందర్భంలో, ఇన్ఫెక్షన్ ను సమయానికి అదుపు చేయడం అవసరము.