ఆంత్రాక్స్ (దొమ్మరోగం), (ప్లీడజ్వరం) - Anthrax in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

November 27, 2018

March 06, 2020

ఆంత్రాక్స్
ఆంత్రాక్స్

ఆంత్రాక్స్ అంటే ఏమిటి?

ఆంత్రాక్స్ అనేది బాసిల్లస్ ఆంత్రశిస్ ( Bacillus anthracis) అనే బ్యాక్టీరియ వలన సంక్రమించే ఒక అంటువ్యాధి. ఈ జీవి సాధారణంగా మానవుల కంటే జంతువులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది బీజాంశం (spore) రూపంలో నిద్రావస్థ దశ (dormant phase) లో ఉంటుంది మరియు బీజాంశాల వలె సంవత్సరాలు జీవించవచ్చు.ఈ బీజాంశాలు (spores ) అనుకూలమైన పరిస్థితులలో మొలకెత్తుతాయి మరియు వృద్ధిచెందుతాయి. మానవుల శరీరంలోకి అవి బీజాంశాల రూపంలో చేరతాయి, అప్పుడవి శరీరంలో క్రియాత్మకం అయ్యి వృద్ధి చెంది మరియు శరీరమంతా వ్యాపిస్తాయి తర్వాత వ్యాధిని కలిగించే టాక్సిన్ (విషపదార్దాలను ) ను ఉత్పత్తి చేస్తాయి. బొగ్గు అని అర్ధం వచ్చే ఒక గ్రీకు పదం ద్వారా ఆంత్రాక్స్ పేరు పెట్టబడింది. ఆంత్రాక్స్ సహజంగా చర్మంపై ముదురు నల్ల మచ్చలు కారణమవుతుంది కాబట్టి ఆ పేరు చెప్పబడింది.

తీవ్రవాదులు 2001 లో ఆంత్రాక్స్ను వ్యాప్తి చేసే పద్ధతిని ఉపయోగించారు. ఆంత్రాక్స్ యొక్క ఈ జీవరసాయన దాడి చాలా ఆందోళనని కలిగించింది, భవిష్యత్తులో ఇటువంటి దాడుల ద్వారా వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ఆంత్రాక్స్ యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఆంత్రాక్స్ యొక్క రకం మీద లక్షణాలు ఆధారపడి ఉంటాయి.

చర్మం తెగిన లేదా గాయం ద్వారా స్పోర్స్ (spores) మానవ శరీరంలోకి ప్రవేశించి మరియు చర్మం మీద దురదతో కూడిన నల్లటి పుండ్లు అభివృద్ధి చెందుతాయి దానిని చర్మపు ఆంత్రాక్స్ (Cutaneous anthrax) అని అంటారు.పుండ్లను తల, మెడ మరియు ముఖం మీద చూడవచ్చు. కొంతమందికి తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, జ్వరం వంటివి కూడా ఉంటాయి.

జీర్ణశయాంతర ఆంత్రాక్స్ (Gastrointestinal anthrax ) అనేది ఆంత్రాక్స్ సోకిన జంతువు యొక్క మాంసం తీసుకోవడం వల్ల సంభవించవచ్చు. లక్షణాలు ఫుడ్ పోయిసనింగ్ (food poisoning) లో మాదిరిగా వాంతులు సంభవింస్తాయి, కానీ తీవ్రమైన కడుపు నొప్పి, రక్తపాత వాంతులు మరియు నిరంతర అతిసారం కలిగవచ్చు.

స్పోర్ట్స్ (spores)ను పీల్చడం వలన ఏర్పడే ఆంత్రాక్స్ చాలా తీవ్రతరమైనది. ప్రారంభ లక్షణాలు జ్వరం, దగ్గు, అలసట, శరీర నొప్పి మరియు తలనొప్పి, జలుబు వంటివి ఉంటాయి, కానీ మరింతగా పురోగతి చెందితే శ్వాస సమస్యలను మరియు దిగ్బ్రాంతిని కలిగించవచ్చు.

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

పెద్ద కర్ర ఆకారంలో(rod -shaped) ఉండే బ్యాక్టీరియా బాసిలస్ ఆంత్రశిస్ (Bacillus anthracis) యొక్క బీజాంశం (spore) ఈ అంటువ్యాధికి కారణం. బ్యాక్టీరియా సాధారణంగా అనేక సంవత్సరాలపాటు బీజాంశం (spore) వలె నేలలోనే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ బీజాంసాలు విధ్వంస నిరోధకతను (resistant) కలిగి ఉంటాయి. సాధారణంగా, అవి మానవుల కంటే ఎక్కువ మేత మేసే జంతువులకు సోకుతాయి. మానవులు బీజాంశాలను శ్వాసతో పాటు పీల్చుకొవడం వలన లేదా ఆంత్రాక్స్ సోకిన జంతువు యొక్క మాంసం తినడం లేదా చర్మంపై గాయం లేదా పగులు మీద బీజాంసాలు (spores) పడినప్పుడు ఈ అంటువ్యాధి సోకుతుంది.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్సఏమిటి?

వైద్యులు వ్యక్తి యొక్క ఆరోగ్య చరిత్ర మరియు వృత్తి వివరాలు గురించి విచారణ చేస్తారు. లక్షణాలు ఆధారంగా, వైద్యులు వ్యాధి సోకిన చర్మ నమూనాలను, గొంతు శ్వాబ్స్, లేదా కఫం సేకరించడం మరియు బాక్టీరియా లేదా యాంటీబాడీస్ ఉనికిని నేరుగా చూడడానికి రక్త విశ్లేషణ ద్వారా నిర్ధారణ నిర్ధారించవచ్చు. ఛాతీ ఎక్స్-రే ద్వారా కూడా వైద్యులు రోగనిర్ధారణను చేస్తారు, ఇక్కడ ఛాతీ విస్తరించడం లేదా ఊపిరితిత్తులలో ద్రవం చూడవచ్చు.

అన్ని రకాల ఆంత్రాక్స్ కు యాంటీబయాటిక్ల తో చికిత్స చేయవచ్చు మరియు నయమవుతుంది; ఇతర ఔషధాలతో పాటు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన టాక్సిన్స్ చికిత్సకు యాంటిటాక్సిన్స్ కూడా వాడాలి. కొన్నిసార్లు ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ను కూడా ఉపయోగిస్తారు. యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా సూచించబడాలి మరియు డాక్టర్ల నుండి ప్రిస్క్రిప్షన్ (ఔషదపత్రం) తీసుకోవాలి. ఆంత్రాక్స్ కు గురైన వ్యక్తులు 60 రోజుల పాటు నివారణ యాంటీబయాటిక్స్ ను తీసుకోవాలి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వారి డెక్సిసైక్లిన్ (doxycycline), సిప్రోఫ్లోక్సాసిన్ (ciprofloxacin), లెవోఫ్లోక్సాసిన్ (levofloxacin), మరియు పరాన్నేరల్ ప్రోకాన్ పెన్సిలిన్ జి (parenteral procaine penicillin G) వంటి యాంటీబయాటిక్స్ ను ఆంత్రాక్స్ కోసం సూచించారు.

ఈ మూడు మోతాదులతో పాటు, ఈ బాక్టీరియాకు బహిర్గతం (expose) ఐన తరువాత టీకామందును (vaccination) ప్రారంభించాలి. టీకాలు (vaccines) సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండవు వాటిని ఆరోగ్య సంరక్షణ సాధకుని నుండి సేకరించాలి.

ఆంత్రాక్స్ అనేది ఒక నివేదించబడిన వ్యాధి; ఒక కేసు రోగనిర్ధారణ తర్వాత ఆరోగ్య సంస్థలకు తప్పక తెలియజేయాలి. B. అంత్రాసిస్ కు వ్యతిరేకంగా పనిచేసే ఇతర క్రియాశీల యాంటీబయాటిక్స్ డీకైసిక్లైన్, పెన్సిలిన్, అమోక్సిలిన్, అంపిపిల్లిన్, సిప్రోఫ్లోక్సాసిన్, కటిఫ్లోక్ససిన్, క్లోరాంఫేనికోల్ మొదలైనవి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Anthrax
  2. Melissa Conrad Stöppler. Anthrax. eMedicineHealth. [health]
  3. orld Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Guidance on anthrax: frequently asked questions
  4. National Institute of Health and Family Welfare. Anthrax. Health and Family Welfare. [internet]
  5. U.S. Department of Health & Human Services. A History of Anthrax. Centers for Disease Control and Prevention. [internet]

ఆంత్రాక్స్ (దొమ్మరోగం), (ప్లీడజ్వరం) వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు