ఆకలి లేకపోవడం - Anorexia Nervosa in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

November 26, 2018

March 06, 2020

ఆకలి లేకపోవడం
ఆకలి లేకపోవడం

ఆకలి లేకపోవడం అంటే ఏమిటి? 

ఆకలి లేమి లేక ఆకలి లేకపోవడం (Anorexia Nervosa ) అనేది మనిషికి తినడం గురించి ఉన్న ఓ రుగ్మత. ఆకలి లేకపోవడం అనేది తినడం గురించిన ఒక మానసిక అనారోగ్యం కూడా. ఈ రుగ్మతతో ఉండే వాళ్ళలో బరువు కోల్పోవడం కోసం (తిండి తినడంలో జరిగే హెచ్చు తగ్గుల వల్ల) అసంబద్ధమైన తక్కువ శరీర బరువు ఏర్పడుతుంది. రోగి వక్రమైన ఆలోచనలతో ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందాలనుకుంటుంటాడు. ఆ క్రమంలో బరువు కోల్పోవడం కోసం చాలా కష్టపడి వ్యాయామాదులు చేసేస్తుంటారు. ఆకలి లేకపోవడమనే ఈ జాడ్యం సాధారణంగా కౌమారదశలో ప్రారంభమవుతున్నప్పటికీ, ఇది చిన్న పిల్లలలో మరియు పెద్దలలో కూడా ఉండడం గమనించబడుతోంది.

ఆకలి లేకపోవడం (అనోరెక్సియా నెర్వోసా) యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? 

  • తినే అలవాట్ల లక్షణాలు లేక ఖాద్య ప్రవర్తన : 
    • మనిషి సన్నగా ఉన్నప్పటికీ చాలా పరిమిత ఆహారం తినడం
    • కారణం లేని (అహేతుక) సాకులతో తినడం తప్పించుకోవడమనే అలవాటు   
    • తినేటపుడు ఆహారం మరియు కేలరీల పట్ల ఎప్పుడూ మనసులో ఆలోచనలు పెట్టుకుని చాలా తక్కువ ప్రమాణంలో తినడం  
    • తరచుగా ఆహారాన్ని తింటున్నట్లు నటించడం లేక భోంచేశావా అని అడిగితే “ఆ, తిన్నాను” అంటూ అలవాటుగా  అబద్ధం చెప్పడం చేస్తూండడం.
    • స్వరూపం మరియు శరీర ఆకృతి లక్షణాలు:

  • ఆకస్మికంగా ఎక్కువ బరువు కోల్పోవడం
    • అధిక బరువు ఉన్నాననుకునే ఒక భ్రమతో ఆందోళన పడటం
    • మనసులో ఎప్పుడూ తన శరీరం అత్యుత్తమ ఆకృతిని కల్గి ఉండాలనే తపన
    • తన శరీరం, ఆకృతి గురించి నిరంతరం స్వీయ-విమర్శ
  • ప్రక్షాళన యొక్క లక్షణాలు (Symptoms of purging):
    • ఎక్కువగా వ్యాయామం చేయడం
    • తినడం అయింతర్వాత బలవంతంగా వాంతి చేసుకోవడం  
    • బరువు కోల్పోవడం కోసం మాత్రలు (ఉదా.,భేదిమందు) ఉపయోగించడం
  • గమనించదగిన హెచ్చరిక సంకేతాలు మరియు లక్షణాలు: నిరాశ, ఆందోళన, పెళుసైన ఎముకలు మరియు గోర్లు, తీవ్రంగా జుట్టు ఊడిపోవడం, తరచుగా మూర్ఛపోవడం.

ఆకలి లేకపోవడమనే రుగ్మత ప్రధాన కారణాలు ఏమిటి? 

ఆకలి లేకపోవడమ (అనోరెక్సియా)నే రుగ్మతకు ఒకే కారణం అంటూ ఏమీ లేదు, ఆకలి మందగించడానికి కారణాలు అనేకం.

  • ఆకలి లేకపోవడానిక సాధారణ కారకాలు:
    • పరిపూర్ణతావాదం (పెర్ఫెక్షనిజం), స్థిరభావంగల్గి ఉండడం (అబ్సెసివ్) మరియు పోటీతత్వ కుటుంబ లక్షణాలు
    • కుటుంబ వైరుధ్యాలు  
    • విద్యాసంబంధ ఒత్తిళ్లు
    • కుటుంబ సభ్యులలో తినే లోపాల చరిత్ర
  • ఆత్రుత (అవక్షేప) కారకాలు (Precipitating factors):
    • పీడిత-తాడిత బాల్యం abusive childhood
    • యుక్తవయస్సు లేదా కౌమారదశ ప్రారంభము

ఆకలి లేకపోవడాన్ని నిర్ధారించేదెలా, దీనికి చికిత్స ఏమిటి?

  • నిర్ధారణకు ప్రమాణం:
    • వ్యక్తి ఒక నిర్దిష్ట వయస్సు మరియు ఎత్తుకు తగిన బరువును నిర్వహించకుండా ఉండడం
    • మొదటే తక్కువ బరువు ఉన్నా కూడా అయ్యో బరువు పెరిగిపోతున్నాననే అనవసరమైన మరియు అవాస్తవ భయం
    • శరీర బరువు మరియు ఆకృతికి సంబంధించి వక్రీకరించబడిన  ఆలోచనలు
    • ఋతుస్రావం ప్రారంభమైన స్త్రీలలో కనీసం 3 నెలలు పాటు  ఎటువంటి ఋతుస్రావం కలగక పోవడం
  • చికిత్స: 
    • ఆసుపత్రిలో రోగిని చేర్చాక కోల్పోయిన పోషకాల్ని శరీరానికి భర్తీ చేయడానికి ఆహారాన్ని తినబెట్టే (refeeding) ప్రక్రియ ప్రారంభంలోనే జరుగుతుంది. ఇలా ఆహారాన్ని కొసరి తినబెట్టడమనేది ఆకలిలేమితో  ఆసుపత్రికి చేరిన పిల్లలు మరియు యువకులకు చాలా అవసరం.
    • రెండవ విధానంలో, మానసిక చికిత్సతో పాటు ఆహార నిపుణుల సలహా ఉంటుంది. ఇక్కడ, కుటుంబ సభ్యులు కూడా సదరు రుగ్మతకు గురైన వారికి ఆహారాన్ని తినిపించడంలో బాధ్యత తీసుకుని కొసరి తినబెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఫలితాలు ఒకింత నెమ్మదిగా సాధించబడతాయి, అయితే అధిక బరువును  నిర్వహించదానికి చాలా మటుకు అవకాశం ఉంది.  
    • ఆకలిలేమి రుగ్మతకు (అనోరెక్సియాకు) దీర్ఘకాలికం మరియు సంక్లిష్టతతో కూడిన మానసిక చికిత్స అవసరమవుతుంది. ఇది మేధావికాసానికి మరియు ప్రవర్తనా సరళికి సంబంధించింది. ఈ మానసిక చికిత్స జ్ఞాన పునర్నిర్మాణంపైన మరియు అవినాభావ సహాయక చికిత్సపై కూడా దృష్టి పెడుతుంది. ఆరోగ్యకరమైన చికిత్సా సంబంధాన్ని నిర్వహించడానికి అవినాభావ సహాయక చికిత్స అవసరం, ఇందులో ఆకలి లేమికి దారితీసే కారకాలు పరిశీలించబడతాయి మరియు వాటిని పరిష్కరించడం జరుగుతుంది.



వనరులు

  1. Janet Treasure, June Alexander. Anorexia Nervosa. Routledge, 2013 178 pages
  2. Evelyn Attia, B. Timothy Walsh. Anorexia Nervosa. Am J Psychiatry 164:12, December 2007.
  3. Jane Morris et al. Anorexia nervosa. BMJ. 2007 Apr 28; 334(7599): 894–898. PMID: 17463461
  4. HelpGuide. Anorexia Nervosa. [internet]
  5. Randy A. Sansone et al. A Primer on Psychotherapy Treatment of Anorexia Nervosa in Adolescents. Psychiatry (Edgmont). 2005 Feb; 2(2): 40–46. PMID: 21179635

ఆకలి లేకపోవడం వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 Years of Experience
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 Years of Experience
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 Years of Experience
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ఆకలి లేకపోవడం కొరకు మందులు

Medicines listed below are available for ఆకలి లేకపోవడం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.