పేను కొరుకుడు అంటే ఏమిటి?
ప్రతి వ్యక్తికి, పురుష మరియు స్త్రీల ఇద్దరిలో ఇది సాధారణమైనది - ప్రతిరోజూ జుట్టు రాలడాన్ని కొంతవరకు అనుభవిస్తారు, సాధారణంగా రోజులకు100 వెంట్రుకుల వరకు రాలుతాయి. జుట్టు రాలడం కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. పేను కొరుకుడు అనేది సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలడంతో కలిగే ఒక పరిస్థితి.పేనుకొరుకుడు/అలోపేసియా అనేది ఈ క్రింది రకాలుగా గమనించవచ్చు:
- అలోపేసియా అరెటా (Alopecia areata), నెత్తి మీద జుట్టు సాధారణంగా చిన్న చిన్న ఖాళీలతో ఊడిపోతుంది,ఆ ఖాళీ సాధారణంగా గుండ్రంగా.
- అలోపేసియా టోటాలిస్ (Alopecia totalis), దీనిలో నెత్తి మీద నుండి పూర్తిగా జుట్టు రాలిపోతుంది.
- అలోప్సియా యూనివెర్సలిస్ (Alopecia universalis), దీనిలో శరీరం మీద నుండి కూడా జుట్టు రాలిపోతుంది.
జుట్టు తిరిగి పెరుగుతున్నా, అది మళ్లీ రాలిపోయే వైఖరిని కలిగి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పేనుకొరుకుడు, దాని విభిన్న రూపాల్లో, వివిధ లక్షణాలను చూపుతుంది:
- అలోపీసియా అరెటాలో గుండ్రంగా లేదా నాణెం-పరిమాణం ఖాళీలతో జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఉదయం మేల్కొన్నప్పుడు జుట్టు గుత్తులుగా దిండుపై కనపడుతుంది. ఖాళీల /మచ్చల పరిమాణం మారుతూ ఉండగా, కొన్ని ప్రాంతాల్లో జుట్టు సాంద్రతలో తగ్గుదల కనిపిస్తుంది. నెత్తి మీద జుట్టు నష్టం చాలా సాధారణం; అయితే, ఈ రకం పేనుకొరుకుడులో /అలోపేసియాలో కనురెప్పల వెంట్రుకలు, కనుబొమ్మలు లేదా గడ్డం మీద జుట్టు రాలడాన్ని చూడవచ్చు. మరో అరుదైన లక్షణం నెత్తి వెనుక నుండి జుట్టు నష్టం.
- అలోప్సియా టోటాలిస్ లో, ప్రజలు నెత్తి మీద పూర్తిస్థాయిలో జుట్టును నష్టపోవచ్చు.
- అలోప్సియా యూనివెర్సలిస్ విషయంలో, మొత్తం శరీరం నుండి జుట్టు నష్టం బాగా కనిపిస్తుంది.
- కొన్నిసార్లు పేనుకొరుకుడు గోర్లను కూడా ప్రభావితం చేయవచ్చు మరియు వాటిని నిస్తేజంగా, పెళుసుగా, గరుకుగా లేదా విరిగిపోయేలా చేయవచ్చు. గోళ్ళ సమస్యలు కొన్నిసార్లు పేనుకొరుకుడు మొదటి సంకేతం కావచ్చు.
ప్రధాన కారణాలు ఏమిటి?
పేనుకొరుకుడు ఒక జన్యుపరమైన సమస్యగా గుర్తించబడింది మరియు స్వయం ప్రతిరక్షక (autoimmune)వ్యాధిగా వర్గీకరించబడింది. అంటే శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ జుట్టు పై దాడి చెయ్యడం ప్రారంభిస్తుంది అని అర్థం. ఫలితంగా, విస్తృతమైన జుట్టు నష్టంకలుగుతుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్సఏమిటి?
పేనుకొరుకుడు సాధారణంగా ఒక చర్మవ్యాధి నిపుణులు నిర్ధారిస్తారు. ఈ పరిస్థితికి పరీక్షించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి, అవి:
- ఇతర స్వయం ప్రతిరక్షక (autoimmune) వ్యాధుల ఉనికిని తనిఖీ చేయడానికి రక్త పరీక్షలను నిర్వహించవచ్చు.
- కొన్నిజుట్టు వెంట్రుకలను వెంట్రుకలను తొలగించి పరిశీలించవచ్చు.
- పేనుకొరుకుడును నిర్ధారించడానికి చర్మ జీవాణుపరీక్షలు (biopsy) తీసుకోవచ్చు.
పేనుకొరుకుడుకి ఎటువంటి నివారణ నిర్వచించబడలేదు. జుట్టు పెరుగుదల సాధారణంగా దాని స్వంత విధికి తిరిగి చేరుకుంటుంది, మరియు జుట్టు మళ్ళి పెరగడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు పెరుగుదల వేగవంతమవుతుంది. జుట్టు పెరుగుదల వేగవంతం చేయడానికి క్రింది చికిత్సలలో కొన్ని వాటిని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తారు:
- రోగనిరోధక వ్యవస్థను అణచివేయడానికి కార్టికోస్టెరాయిడ్స్ (corticosteroids). వీటిని ఉపయోగించటానికి క్రీములు లేదా లోషన్ల రూపంలో ఇవ్వవచ్చు లేదా ప్రభావిత ప్రాంతాల్లోకి ఇంజెక్షన్ల ప్రవేశపెట్టవచ్చు. మాత్రలు కూడా లభ్యమవుతున్నాయి, కానీ దుష్ప్రభావాల కారణంగా ఇవి సాధారణంగా నివారించబడతాయి.
- అంత్రాలిన్ (Anthralin) రోగనిరోధక పనితీరు మీద లక్ష్యంగా పనిచేసే ఒక ఔషధం. ఇది శక్తివంతమైనది మరియు పూసిన ఒక గంట వరకు అలా వదిలి తర్వాత కడిగివేయ్యాలి.
- మినాక్సిడిల్ (Minoxidil) జుట్టు పెరుగుదల కోసంనెత్తి మీద, గడ్డం లేదా కనుబొమ్మల మీద కూడా పూయవచ్చు. ఇది పురుషులు మరియు స్త్రీలు మరియు పిల్లలకు సురక్షితంగానే ఉంటుంది మరియు దీనిని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.
- డిఫిన్సీప్రోన్ (Diphencyprone) అనేది ఔషధం, ఇది బట్టతల ఖాళీల లక్ష్యంగా పని చేస్తుంది. దీనిని పూసిన తర్వాత, ప్రతిచర్య జరుగుతుంది మరియు రోగనిరోధక వ్యవస్థ దానితో పోరాడటానికి తెల్ల రక్త కణాలను పంపుతుంది. ఈ ప్రక్రియలో, వెంట్రుకల కుదుళ్ళు ఉత్తేజపర్చబడతాయి, తద్వారా జుట్టు నస్టాన్ని నిరోధిస్తుంది.