అగమ్మాగ్లోబులినేమియా అంటే ఏమిటి?
మానవ శరీరంలో “ఇమ్యూనోగ్లోబులిన్స్” అని పిలువబడే రోగనిరోధకతను పెంచే ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్ల లోపాన్ని కలిగి ఉన్న వారికి “అగమ్మాగ్లోబులినేమియా” వ్యాధి లేక “రోగ నిరోధకశక్తిలేమి” వ్యాధి వస్తుంది. అలాంటివారికి రోగనిరోధకశక్తి లోపం జీవితాంతం ఉండే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని కల్గి ఉండే వారు జీవితాంతం అంటురోగాలతో బాధపడే అవకాశం ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఇమ్యునోగ్లోబులిన్స్ లేకపోవటం వలన, అగమ్మాగ్లోబులినేమియా వ్యాధి ఉన్న వ్యక్తి అంటురోగాలకు గురై ఉంటాడు మరియు కింది వ్యాధులతో తరచూ బాధపడే అవకాశం ఉంది.
- ఆస్తమా - కారణం ఏమిటో తెలియదు.
- చెవులు, కళ్ళు మరియు చర్మం యొక్క అంటువ్యాధులు.
- రొమ్ము పడిశం (బ్రోన్కైటిస్) - ముక్కు యొక్క శ్వాస రంధ్రాల్లో వాపు.
- కడుపు లోపాలు మరియు జీర్ణ వాహిక అంటువ్యాధులు.
- ఎగువ శ్వాసకోశ అంటువ్యాధులు మరియు న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల అంటువ్యాధులు.
అగమ్మాగ్లోబులినేమియా వ్యాధి కల్గిన వారిలో జన్మించిన మొదటి ఐదు సంవత్సరాల్లోనే అంటువ్యాధులు ప్రబలుతాయి.
ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితికి ప్రధాన కారణం జన్యు లోపం, ఇది మగవారిపైనే ప్రభావం చూపిస్తుంది. ఈ లోపము వలన, రోగనిరోధకశక్తిని పెంచే కణాల పెరుగుదల నిరోధించబడుతుంది. ఈ పరిణామం వ్యక్తిని అంటువ్యాధుల ప్రమాదానికి గురిచేస్తుంది. ఈ పరిస్థితి ఉన్నవారికి అంటువ్యాధులు వచ్చే ప్రమాదం మాత్రమే కాదు, అంతకు పూర్వం ఉన్న అంటువ్యాధి నుండి ఇంకా పూర్తిగా కోలుకోకనే అంటువ్యాధులు పునరావృతమవుతుంటాయి. ఊపిరితిత్తులు, చర్మం, కడుపు మరియు కీళ్ళలో ఈ ఇన్ఫెక్షన్లు లేదా అంటూ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. జన్యు స్వభావం (genetic nature) కారణంగా, కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఆగమ్మాగ్లోబులనేమియా వ్యాధి బారిన పది బాధపడవచ్చు.
వ్యాధి నిర్ధారణ ఎలాగ మరియు దీనికి చికిత్స ఏమిటి?
అగమ్మాగ్లోబులినేమియా వ్యాధి ఉందా లేదా అన్న విషయం నిర్ధారించుకునేందుకు ప్రధాన మార్గం రక్త పరీక్షలు. ఇమ్యునోగ్లోబులైన్లు మరియు B లింఫోసైట్స్ యొక్క స్థాయిని రక్త పరీక్షలు గుర్తిస్తాయి.
ఈ పరిస్థితికి చికిత్స చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వైద్యులు ఇమ్మ్యూనోగ్లోబులైన్లను శరీరానికి అందించేందుకు “సబ్కటానియస్ ఇంజెక్షన్లు” లేదా ఇంట్రావెనస్ (అంటే నేరానికి ఇంజక్షన్) ద్వారా నిర్వహిస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, డాక్టర్లు ఎముక మజ్జ మార్పిడిని సిఫారసు చేయవచ్చు. పునరావృత అంటురోగాలను ఎదుర్కొనేందుకు వైద్యులు బలమైన యాంటీబయాటిక్స్ మందుల్ని క్కూడా సిఫారసు చేస్తారు. అన్ని చికిత్సలు కూడా అంటువ్యాధుల తరచుగా వచ్చే అంతరాన్ని (ఫ్రీక్వెన్సీ) మరియు తీవ్రతను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేయబడతాయి.