అబ్సెన్స్ సెజర్స్ - Absence Seizures in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 19, 2018

March 06, 2020

అబ్సెన్స్ సెజర్స్
అబ్సెన్స్ సెజర్స్

అబ్సెన్స్ సెజర్స్ అంటే ఏమిటి?

అబ్సెన్స్ సెజర్స్  కొంత సమయం వరకు ఆకస్మికంగా స్పృహ తప్పిపోవడం మరియు తదేకంగా చూస్తూ కొంతసేపు  అలా ఉండిపోవడాన్ని(staring spells) సూచిస్తుంది.

అబ్సెన్స్ సెజర్స్ సుమారు 15 సెకన్లపాటు కొనసాగుతుంది, ఈ సమయంలో సంభవించే వ్యక్తి సూన్యం లోకి చూస్తూ ఉండి పోతాడు (అందుకే staring spells అని పిలుస్తారు). ఈ చిన్న క్షణం పాటు  ఆగిపోయిన స్పృహ తర్వాత, వ్యక్తి అకస్మాత్తుగా చురుకుగా ఉన్న స్థాయిని తిరిగి పొందుతాడు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అబ్సెన్స్ సెజర్స్ యొక్క ప్రాధమిక లక్షణం సూన్యం లోకి తదేకంగా చూస్తూ  ఉండిపోవడం. ఏదేమైనప్పటికీ, ఇది అనుకోకుండా జరుగుతుంది, మరియు ఆ వ్యక్తి దాని గురించి తెలియదు. అబ్సెన్స్ సెజర్స్ యొక్క ఇతర లక్షణాలు:

  • కనురెప్పలు కొట్టుకోవడం.
  • వేళ్లు రుద్దడం.
  • చేతులతో  చిన్న కదలికలు.
  • పునరావృత నోటి కదలికలులేదా పెదాలను కొరకడం.
  • 10-20 సెకన్ల పాటు సూన్యంలోకి చూస్తూ ఉండిపోవడం.

అబ్సెన్స్ సెజర్స్ ను అనుభవించినప్పుడు, వ్యక్తి హఠాత్తుగా వారు నిమగ్నమై ఉన్న కార్యకలాపాలను ఆపివేశారు, అవి:

  • అకస్మాత్తుగా నడవడం ఆపి మరియు కొన్ని సెకన్ల తరువాత  మళ్ళి ప్రారంభిస్తారు .
  • ఒక వాక్యం మాట్లాడటం  సగంలో నిలిపివేస్తారు మరియు కొన్ని సెకన్ల తర్వాత మళ్ళీ ప్రారంభిస్తారు

సెజర్స్ ను అనుభవించిన వెంటనే, వ్యక్తి అప్రమత్తంగా మారుతాడు మరియు సెజర్స్ సంభవించినట్లు  అతడికి తెలియదు. సెజర్స్ సాధారణంగా ఏ ఇతర పద్ధతిలో వ్యక్తిని గందరగోళంలో విడిచిపెట్టదు. అబ్సెన్స్ సెజర్స్ వ్యక్తి  స్ప్రుహ తప్పి పడిపోతాడని చెప్పలేము.

కొంతమంది వ్యక్తులు ఒక రోజులో చాలా సార్లు అబ్సెన్స్ సెజర్స్ సంభవించవచ్చు. పిల్లలలో, లక్షణాలు పాఠశాల పనితీరుతో జోక్యం చేసుకోవచ్చు. వాస్తవానికి, దృష్టిని తగ్గిపోడం మరియు పగటి కలలు అని అబ్సెన్స్ సెజర్స్  ను తప్పుగా అర్ధం చేసుకోవచ్చు.

ప్రధాన కారణాలు ఏమిటి?

మెదడులో ఒక అసాధారణ చర్య ఫలితంగా అబ్సెన్స్ సెజర్స్ ఏర్పడుతుంది. మెదడులోని కణాలు విద్యుత్ ప్రేరణలను (ఎలక్ట్రికల్ సిగ్నల్స్) మరియు రసాయనిక సంకేతాల ద్వారా  సమాచారం అందించుకుంటాయి. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అధికంగా పునరావృతం అబ్సెన్స్ సెజర్స్ లో అవుతాయి. అబ్సెన్స్ సెజర్స్ కు అంతర్లీన జన్యుపరమైన కారణం కూడా ఉండవచ్చు.  అబ్సెన్స్ సెజర్స్ ప్రమాదాన్ని పెంచే ఇతర అంశాలు:

  • ఫెనిటిన్ (phenytoin) మరియు కార్బమాజపేన్(carbamazepine) వంటి మూర్ఛ వ్యాధి  మందులు.
  • వేగమైన మరియు లోతైన  శ్వాస లేదా హైపర్వెంటిలేషన్ (hyperventilation).
  • తళుకు వెలుగు (flash light).

పిల్లల్లో  ఈ స్థితికి ఒక జన్యు పరమైన సంబంధం ఉండవచ్చు. 4-14  సంవత్సరాల వయస్సులో పిల్లలలో అబ్సెన్స్ సెజర్స్ ఎక్కువగా కనిపిస్తుంది.

ఎలా నిర్ధారించాలి  మరియు చికిత్స ఏమిటి?

అబ్సెన్స్ సెజర్స్ సంభవించడాన్ని సాధారణంగా వైద్య సమస్యగా పరిగణించనందువలన, అధికారిక నిర్ధారణ తరచుగా ఆలస్యం అవుతుంది. ఈ క్రింది పరీక్షలను అబ్సెన్స్ సెజర్స్ నిర్ధారణకు ఉపయోగించవచ్చు:

  • సెజర్స్ యొక్క ఏ ఇతర రోగలక్షణ కారణాలనైనా  గుర్తించడానికి రక్త పరీక్షలు.
  • MRI మరియు CT స్కాన్ మెదడులో ఏదైనా అసాధారణతను గుర్తించడం కోసం.
  • మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను తనిఖీ చేయడానికి ఎలక్ట్రోఎన్స్ఫాలోగ్రామ్ (Electroencephalogram) (EEG).

అబ్సెన్స్ సెజర్స్ చికిత్సకు సాధారణంగా  అబ్సెన్స్ సెజర్స్ వ్యతిరేక ఔషధాల ఉపయోగం ఉంటుంది. చాలా సందర్భాలలో, జీవనశైలి మార్పులు ఈ అబ్సెన్స్ సెజర్స్ ను పరిష్కరించడంలో ఉపయోగపడతాయి. ఉదాహరణకు, పిల్లల విషయంలో, పిల్లవాడి యొక్క పరిస్థితి గుర్తించి టీచర్ కు  సమాచారం అందించడం సహాయపడుతుంది. అరుదైన సందర్భాలలో, అబ్సెన్స్ సెజర్స్ యొక్క తరచూదానాన్ని తగ్గించేందుకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Absence seizure
  2. Johns Hopkins Medicine [Internet]. The Johns Hopkins University, The Johns Hopkins Hospital, and Johns Hopkins Health System; Absence Seizures
  3. Ewa Posner. Absence seizures in children. BMJ Clin Evid. 2008; 2008: 0317. PMID: 19450342
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Types of Seizures
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Seizures