దాదాపు ప్రతి ఒక్కరు వారి బరువు పట్ల అసంతృప్తితో ఉంటారు; కొందరికి బరువు తగ్గడం కావాలి, మరి కొందరికి బరువు పెరగడం కావాలి.అధిక బరువు ఉండటం అనేది ఒక ప్రధాన సమస్య, కానీ, తక్కువ బరువు ఉండటం కూడా సమస్య కాకుండా ఉండదు. ఇది ఊబకాయం కంటే మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మధుమేహం లేదా గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రుగ్మతల యొక్క అభివృద్ధి కారణంగా ఊబకాయం ఉన్నవారు చనిపోతారు, కానీ తక్కువ బరువు ఉండడం ప్రత్యక్షంగా మరణ ప్రమాదంతో ముడిపడి ఉంటుంది.
ముఖ్యంగా మగవారు బరువు తక్కువగా ఉండటం, వలన వారిలో మరణ అవకాశాలు అధికంగా ఉంటాయని కొన్ని పరిశోధనలలో కనుగొన్న విషయాలు తెలిపాయి. కాబట్టి, ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏమి చేయవచ్చు? చిప్స్ మరియు కుకీల ప్యాకెట్లు తినడమా ? కాదు !!ఇది ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకు దారితీయదు, అవి వక్తిని 'స్కిన్నీ ఫ్యాట్'గా తయారు చేస్తాయి (వ్యక్తి సన్నగా ఉంటారు కానీ కడుపు చుట్టూ కొవ్వు చేరిపోతుంది). ఆరోగ్యంగా ఉండాలంటే, బరువు పెరుగుదల ప్రక్రియ కూడా ఆరోగ్యకరమైనదిగా ఉండాలి.
ప్రజల జీవనశైలిలో మార్పులు కారణంగా భారతదేశంలో 'స్కిన్నీ ఫ్యాట్' అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. సన్నగా ఉన్నవారిలో అనారోగ్యకరమైన కొవ్వు పెరిగిపోయినప్పుడు, అంతర్గత శరీర వ్యవస్థ ఊబకాయం ఉన్న వ్యక్తి వలె ఉంటుందని మరొక అధ్యయనం తెలిపింది. అటువంటి వ్యక్తులలో విసరల్ (అంతర్గత) కొవ్వు అధిక స్థాయిలో ఉంటుంది అది మధుమేహం, గుండెపోటు మరియు చిత్తవైకల్యం వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.
బరువు పెరగాలని కోరుకునే వారు విసరల్ ఫాట్ పొరను ఏర్పరచుకోవడం కాకుండా ఒక ఆరోగ్యకరమైన కండరాల ద్రవ్యరాశిని పెంచుకోవాలని సిఫారసు చేయబడుతుంది. ఈ వ్యాసం కొన్ని ఆహారాలు, భోజనం మరియు చిట్కాలను తెలియజేయడం ద్వారా, ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలను సాధించడానికి మీరు సహాయ పడుతుంది. కాని, ముందుగా, బరువు తక్కువగా ఉండడం అంటే ఏమిటో చూద్దాం?