ప్రసవానంతర సమయం తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ చాలా ముఖ్యమైనది ఎందుకంటే వారికి ఈ సమయంలో చాలా సంరక్షణ అవసరం. అయితే, ప్రసవం తర్వాత శృంగారంలో పాల్గొనలేరని దీని అర్ధం కాదు. ప్రసవం తరువాత లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడానికి తగిన సమయం ఏమిటనేది చాలా మంది మనసులో కలిగే ఒక ముఖ్యమైన ప్రశ్న. కాబట్టి, మీరు క్రొత్తగా తల్లైతే లేదా మీ భార్య ఇటీవల ప్రసవించినట్లయితే, ఈ వ్యాసం మీ కోసమే ఉద్దేశించబడింది. ప్రసవం తర్వాత సెక్స్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాల గురించి ఈ వ్యాసం చదవండి, మొదలు పెట్టడానికి తగిన సమయం మరియు సమస్యలు (ఏవైనా ఉంటే), జాగ్రత్తలు మరియు మొదలైనవి తెలియజేయడమైనది.

  1. గర్భం తర్వాత ఎప్పుడు సెక్స్ చేయవచ్చు - When to have sex after pregnancy in Telugu
  2. ప్రసవం తరువాత శృంగారం యొక్క సంక్లిష్టతలు - Complications of sex after pregnancy in Telugu
  3. ప్రసవం తర్వాత ఎలా శృంగారం చేయాలి - How to have sex after pregnancy in Telugu
  4. ప్రసవం తర్వాత సెక్స్ ద్వారా వ్యాపించే లైంగిక సంక్రమణ వ్యాధులు - STDs through sex after pregnancy in Telugu
  5. ప్రసవం తరువాత సెక్స్ కోసం జనన నియంత్రణ - Birth control for sex after pregnancy in Telugu
  6. ప్రసవం తర్వాత శృంగారం కోసం చిట్కాలు - Tips for sex after pregnancy in Telugu

బిడ్డకు జన్మనివ్వడం అనేది జీవితాన్ని మార్చే మరియు మిక్కిలి ఆనందంకరమైన అనుభవం. ఈ అనుభవం వివిధ జంటలకు వేరువేరుగా ఉంటుంది ఎందుకంటే ప్రతి గర్భం ప్రత్యేకమైనదే. ప్రతి తల్లితండ్రులకు వారి శిశువును చూసుకోవడంలో ఒక సొంత విధానం ఉంటుంది. కాబట్టి వారు, కొన్ని సమయాల్లో సెక్స్‌కు దూరంగా ఉండవచ్చు. ఇది రెండు కారణాల వల్ల కావచ్చు: ప్రసవం తర్వాత శృంగారం ఎప్పుడు ప్రారంభించాలో తెలియక లేదా సెక్స్ కోసం శిశివు సంరక్షణను పాటించుకోలేదనే అపరాధ భావం వలన. ఈ రెండు సందర్భాల్లో, భాగస్వాములు ఇద్దరూ సుముఖంగా ఉన్నపుడు మరియు మానసికంగా సిద్ధంగా ఉన్నపుడు ప్రసవం తర్వాత కూడా సెక్స్ చేయడం చాలా సాధారణమని అర్థం చేసుకోవాలి.

బిడ్డ పుట్టిన తర్వాత మీరు సిద్ధంగా ఉన్నట్లు అనిపించినప్పుడు సెక్స్ చేయడం సురక్షితం అయినప్పటికీ, రక్తస్రావం ఆగిపోయే వరకు (సహజ ప్రసవం విషయంలో), లేదా కుట్లు ఆరిపోయే వరకు (సిజేరియన్ డెలివరీ తర్వాత) వేచి ఉండాలని కొంతమంది నిపుణులు సలహా ఇస్తారు. మీ గర్భాశయం నయమయ్యే సమయంలో (సాధారణ స్థితికి వచ్చే సమయం) సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడం కోసమని ఇలా సూచించబడుతుంది, కాని చివరికి అది మీ ఇష్టం. అలాగే, గర్భధారణ సమయంలో మరియు ప్రసవ తర్వాత శరీరం అనేక మార్పులను ఎదుర్కొంటుంది. అందువల్ల, తల్లి శరీరం లైంగిక చర్యల కోసం తయారవ్వడం మరియు తగినంత బలం కలిగి ఉండటం చాలా ముఖ్యం.

(మరింత చదవండి: గర్భధారణ సమయంలో సెక్స్)

ప్రసవించిన ఎనిమిది వారాల్లో 50 శాతం జంటలు లైంగిక చర్యలో పాల్గొన్నారని గణాంక విశ్లేషణలు చెబుతున్నాయి. 75 శాతం జంటలు 12 వారాల నాటికి లైంగిక చర్యలో పాల్గొన్నారు. మరియు దాదాపు అందరు జంటలు బిడ్డను కన్న సంవత్సరంలో మళ్లీ శృంగారానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

సాధారణంగా ప్రసవం తరువాత శృంగారంతో ముడిపడి ఉండే కొన్ని సంక్లిష్టతలు ఈ క్రింద చర్చించబడ్డాయి.

  • సాధారణంగా సహజ ప్రసవం అపాయకరమైన గర్భాలతో ముడిపడి ఉండదు. అందువల్ల, సహజ ప్రసవ విషయంలో ప్రసవం తరువాత శృంగారం అధిక సమస్యలకు దారితీయదు. కొంతమంది మహిళలు కొద్దిగా యోని నొప్పిని అనుభవించవచ్చు, కానీ అది సమయానుగుణంగా  తగ్గుతుంది.
  • శస్త్రచికిత్స చేసి ప్రసవం చేసినప్పుడు, లేదా చీలిక ఏర్పడినప్పుడు, ఎపిసియోటోమీ (ప్రసవం కష్టంగా మారినప్పుడు దాన్ని సులభం చేయడానికి మరియు అంతర్గత అవయవాల చీలికను నివారించడానికి యోని భాగానికి కొద్దిగా కాటు పెట్టడం) లేదా కోలుకోవడంలో ఇతర సమస్యలతో బాధపడుతున్న మహిళలలో, ప్రసవం తర్వాత సెక్స్ ఒక సవాలుగా ఉంటుంది. అలాంటి స్త్రీలు సాధారణంగా నొప్పి మరియు యోని రక్తస్రావాన్ని కూడా అనుభవిస్తారు. అలాంటి స్త్రీలలో నయం కావడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది మరియు లక్షణాలు తగ్గిన తర్వాతే వారు సెక్స్ లో  పాల్గొనాలని సలహా ఇవ్వడం జరుగుతుంది.
  • ముఖ్యంగా చనుబాలు ఇచ్చే సమయంలో హార్మోన్ల మార్పులు, కూడా యోని పొడిగా మరియు సున్నితంగా మారడానికి కారణమవుతాయి.
  • బిడ్డ జన్మించిన తరువాత, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి, అయితే ప్రోలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రోలాక్టిన్ పాలను ఉత్పత్తి చేసేందుకు రొమ్ములను ప్రేరేపిస్తుంది. మొదటిలో పాల ఉత్పత్తిని ప్రేరేపించేందుకు ప్రారంభ ప్రసవానంతర కాలంలో ప్రోలాక్టిన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా, ప్రోలాక్టిన్ మాతృత్వ భావనను ప్రేరేపిస్తుంది. పాలిచ్చే తల్లికి ఒక రకమైన మానసిక అనుభూతి కలుగుతుంది, అది తన బిడ్డను ఎప్పుడూ చూడాలని మరియు పట్టుకుని ఉండాలనే భావనను కలిగిస్తుందని చెప్పవచ్చు.
  • చనుబాలిచ్చే సమయంలో కలిగే మరొక ముఖ్యమైన పరిణామం ఏమిటంటే, పాలిచ్చే తల్లి లైంగికంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు యోనిలో లూబ్రికేషన్ (తడి) లేకపోవడం. లైంగిక చర్యకు ప్రయత్నించినప్పుడు యోని పొడిబారి ఉండడం వలన నొప్పి కలుగుతుంది.
  • అలాగే ప్రసవం తర్వాత , మహిళల వక్షోజాలు సెక్స్ సమయంలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
  • అదనంగా, ప్రసవం సహజమైనదా లేదా సిజేరియనా అనే దానితో సంబంధం లేకుండా  కొంతమంది మహిళలు ప్రసవానంతర ఒత్తిడి మరియు నిరాశతో బాధపడుతుంటారు. ప్రసవం తర్వాత మీకు లైంగిక చర్యపై ఆసక్తి కలుగపోతుంటే మీ వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ప్రసవం తర్వాత మీ లైంగిక జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి వైద్యుల సలహా మీకు సహాయం చేయవచ్చు.

ప్రసవం తరువాత మంచి లైంగిక అనుభూతి కోసం ఈ క్రింది పద్ధతులను పాటించవచ్చు.

  • మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయడం (మూత్రవిసర్జన చేయడం) , వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా నొప్పులను తగ్గించే ఓవర్-ది- కౌంటర్ మందులు తీసుకోవడం వంటి విధానాలను ముందే ఉపయోగించుకోండి. శృంగారం తర్వాత మంటను ఎదుర్కొంటున్న సందర్భాల్లో, ఐస్ ముక్క ఉపయోగించి ఆ ప్రాంతాన్ని చల్లబరచుకోవడం మంచిది.
  • యోని పొడిదనాన్ని ఎదుర్కోవడంలో లూబ్రికెంట్ సహాయపడుతుంది.
  • యోని సెక్స్ కు ప్రత్యామ్నాయంగా మసాజ్, ఓరల్ సెక్స్ లేదా పరస్పర హస్త ప్రయోగం వంటివి కూడా ప్రయత్నించవచ్చు.
  • పూర్తిగా రొమ్ములు పాలతో నిండిపోయిన సందర్భంలో, వాటిని ముందే ఖాళీ చేయడం లేదా సంభోగం సమయంలో తువ్వాలు ఉపయోగించడం వంటివి చాలా ప్రభావవంతంగా ఉంటాయని రుజువు చేయబడింది.

(మరింత చదవండి: సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW

ఒకరికొకరికి వారి భాగస్వామి యొక్క ఆరోగ్య చరిత్ర గురించి తెలిసినప్పుడు, సాధారణంగా ప్రసవం తర్వాత మీ భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొనడం సురక్షితంగా పరిగణించబడుతుంది, అయినప్పటికీ, ఇది లైంగిక సంక్రమణ వ్యాధుల (ఎస్టీడీలు) ప్రమాదం లేదని సూచించదు.

ప్రసవ కాలం తరువాత ఎస్టీడీల గురించి ఒకసారి తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి వ్యక్తి తమ భాగస్వామితో కాకుండా వేరొకరితో లైంగిక సంబంధం కలిగి ఉంటే. ప్రసవం తర్వాత వారి భాగస్వామితోనే లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ, జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏ సమయంలోనైనా, మీ భాగస్వామికి లేదా మీకు ఏదైనా ఎస్టిడి సోకినట్లు అనుమానం కలిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

అంతేకాకుండా, తల్లి కనీసం ఆరునెలల వరకు బిడ్డకు తన పాలు ఇస్తుంది, మరియు అటువంటి సమయంలో ఎలాంటి సంక్రమణ అయినా పిల్లలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, గర్భం దాల్చిన తరువాత సెక్స్ ద్వారా ఎస్టీడీలు వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి రక్షణ చర్యలు  తీసుకోవడం మంచిది.

(మరింత చదవండి: సురక్షితమైన సెక్స్ ఎలా చేయాలి)

బిడ్డను ప్రసవించడం అనేది తల్లిలో అనేక మార్పులను తెస్తుంది, అందువలన ప్రసవం తర్వాత సెక్స్ చేయడానికి స్త్రీ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అంతేకాక, ఇప్పుడే ఒక బిడ్డను కలిగి ఉన్నారు మరియు ప్రసవం తరువాత సెక్స్ చేసే  విషయంలో జనన నియంత్రణ యొక్క స్థిరమైన పద్ధతి అవసరం. చనుబాలివ్వడం ఒక జనన నియంత్రణ పద్ధతిలా పనిచేస్తుంది ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే ప్రోలాక్టిన్ అనే హార్మోన్ అండం పరిపక్వం చెందడానికి కారణమయ్యే హార్మోన్లను నిరోధిస్తుంది మరియు  గర్భాశయ గోడ యొక్క సారవంతమైన (ఫెర్టైల్) అండాలను పోషించే చర్యను నిరోధిస్తుంది.

అయితే, చనుబాలివ్వడం అనేది గర్భనిరోధకం యొక్క 100 శాతం సురక్షిత పద్ధతి కాదు. ప్రసవానంతరం ఆరు నెలల లోపు, అధికంగా పాలిస్తూ ఉండడం మరియు ఋతు చక్రం సాధారణ స్థితికి రానప్పుడు మాత్రమే ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

గర్భధారణ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి తదుపరి గర్భధారణ కోసం 18 నుండి 24 నెలల వరకు వేచి ఉండటం చాలా మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రసవం తర్వాత సెక్స్ సమయంలో తీసుకోదగిన ప్రభావవంతమైన జనన నియంత్రణ పద్ధతులు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి.

  • కండోమ్ ( ఇద్దరిలో ఏ భాగస్వామి ఐన ఉపయోగించవచ్చు)
  • ఎటోనోజెస్ట్రెల్ (etonogestrel) వంటి గర్భనిరోధక ఇంప్లాంట్
  • గర్భనిరోధక ఇంజెక్షన్ మెడ్రాక్సిప్రోజెస్టెరాన్ (medroxyprogesterone) లేదా మినిపిల్ నోర్తిన్డ్రోన్ (minipill norethindrone) వంటి ప్రొజెస్టిన్-మాత్రమే ఉండే గర్భనిరోధకాలు
  • కాపర్ లేదా హార్మోన్ల ఇంట్రాటూరైన్ పరికరం (IUD)

ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిన్ రెండింటినీ కలిగి ఉండే జనన నియంత్రణ పద్ధతులు సలహా ఇవ్వబడవు, ఎందుకంటే వీటి వలన  ప్రసవం తరువాత వెంటనే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. జనన నియంత్రణ ఎంపికల గురించి తెలుసుకోవడానికి మీ ప్రసవానంతర సందర్శనల సమయంలో మీ వైద్యుల సలహా తీసుకోవాలి. అదనంగా, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిన్ రెండింటినీ కలిగి ఉండే జనన నియంత్రణ పద్ధతులు పాలిచ్చే మహిళలలో పాల ఉత్పత్తిని తగ్గిస్తాయని చాలా కాలంగా భావిస్తున్నారు, అయితే ఇది నిజం కాదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేసాయి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹495  ₹799  38% OFF
BUY NOW

గర్భం తల్లిదండ్రుల మీద చాలా ప్రభావం చూపుతుంది చేస్తుంది మరియు భాగస్వాములకు వారు కొద్దిగా దూరమైనట్టు అనిపించవచ్చు. ప్రసవం తర్వాత శృంగారమనేది భాగస్వాములను తిరిగి కలుపడానికి సహాయపడే ఒక సాధనం. ఈ క్రింద పేర్కొన్న చిట్కాలు ప్రసవం తర్వాత మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి  సహాయపడతాయి.

  • ఉత్తమ విధానం నెమ్మదిగా చేయడం. ఫోర్ ప్లేలో పాల్గొనవచ్చు మరియు ఇది అసలైన  శృంగారానికి దారితీయవలసిన అవసరం లేదు. మొదట కౌగిలించుకోవడం మరియు సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు, తద్వారా క్రమంగా మళ్లీ లైంగిక స్పర్శను అలవాటు చేసుకోవచ్చు. 
  • లైంగిక ప్రేరణ కలిగినప్పటికీ మీ యోని తడిగా ఉండకపోవచ్చు మరియు మునుపటి కంటే పొడిగా ఉండవచ్చు. అందుకోసం సౌకర్యవంతంగా ఉండటానికి లూబ్రికెంట్ వాడండి. కండోమ్‌లను ఉపయోగిస్తుంటే నూనె ఆధారిత లూబ్రికెంట్లను ఉపయోగించవద్దు, ఎందుకంటే అవి లీక్ ను కలిగించవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో, ప్రసవం తర్వాత శృంగారంలో పాల్గొనడానికి ముందు లూబ్రికెంట్ల సహాయంతో హస్త ప్రయోగం కూడా సహాయకరంగా ఉంటుందని నిరూపించబడింది.
  • మీరు సిద్ధంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా, తొందరపడకుండా ప్రయత్నించండి. ప్రసవం తరువాత శృంగారం సహజంగా అనిపించాలి, మరియు మీరు మీ భాగస్వామి ఇద్దరూ సిద్ధంగా మరియు పూర్తిగా ప్రేరేపించబడాలి. సంభోగం చేసేటప్పుడు, మీరు సున్నితంగా భావిస్తున్న చోట ఎక్కువ ఒత్తిడి కలిగించని భంగిమను ప్రయత్నించండి. స్త్రీ  తాను పైన ఉండే భంగిమ ద్వారా ప్రారంభించవచ్చు, ఎందుకంటే ఇది చొచ్చుకుపోయే రేటు మరియు లోతును నియంత్రించగలిగిన సామర్ధ్యాన్ని ఆమెకు ఇస్తుంది.
  • సంభోగంలో ఏ సమయంలోనైనా అసౌకర్యం కలిగితే, కొంతసేపు ఆగిపోవడమే మంచిది. మీరు మళ్లీ ప్రేరణను భావిస్తే, లైంగిక చర్యను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించవచ్చు. కఠినమైన కదలికలు లేనందున ఓరల్ సెక్స్ కూడా ప్రయత్నించవచ్చు. అయినప్పటికీ, సంక్రమణ ప్రమాదాన్ని నివారించడానికి కండోమ్ లేదా ఓరల్ డెం (oral dam) పరికరాలను ఉపయోగించమని సిఫార్సు చేయబడుతుంది. 
  • ఒకవేళ అలసట యొక్క భావన అధికంగా ఉంటే, శిశువు నిద్రపోయే సమయంలో సెక్స్ చేయటానికి ప్రయత్నించండి, తద్వారా మీరు ఆస్వాదించడానికి అధికంగా అలసిపోరు. ఓపికగా ఉండండి, ఎందుకంటే మీ బిడ్డ రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు విషయం కొద్దిగా తేలికవుతుంది. 
  • వ్యాయామం లేదా ధ్యానం ద్వారా ఉపశమనం పొందడానికి ప్రయత్నించండి. కటి భాగపు వ్యాయామాలు మీ యోనికి కండరాల మునుపటి స్థితిని తిరిగి తీసుకురావడానికి సహాయపడతాయి. ఈ వ్యాయామం నయమయ్యే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది మరియు మీ లైంగిక జీవితం మీద అద్భుతాలు చూపుతుంది.
  • మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, బాగా తినండి, ద్రవాలు పుష్కలంగా తీసుకోండి మరియు మీకు కుదిరిన ప్రతిసారి విశ్రాంతి తీసుకోండి. బిడ్డను చూసుకోవడం చాలా అవసరం అయితే మీ శక్తిని కాపాడుకోవడం కూడా మీరే చూసుకోవాలి.

వనరులు

  1. Yu J et al. Randomized Trial Comparing the Physiological and Psychological Effects of Different Relaxation Interventions in Chinese Women Breastfeeding Their Healthy Term Infant. Breastfeed Med. 2019 Jan/Feb;14(1):33-38. PMID: 30351172
  2. Sobhgol SS et al. The Effect of Pelvic Floor Muscle Exercise on Female Sexual Function During Pregnancy and Postpartum: A Systematic Review. Sex Med Rev. 2019 Jan;7(1):13-28. PMID: 30301705
  3. Kristensen IH et al. First-time mothers' confidence mood and stress in the first months postpartum. A cohort study. Sex Reprod Healthc. 2018 Oct;17:43-49. PMID: 30193719
  4. Mori E et al. Relationship between the mode of conception and depressive symptoms during the first 6 months post-partum in Japan. Reprod Med Biol. 2018 Apr 10;17(3):275-282. PMID: 30013429
  5. Viola Polomeno. Sex and Breastfeeding: An Educational Perspective . J Perinat Educ. 1999 Winter; 8(1): 30–40. PMCID: PMC3431754
Read on app