పొడవాటి, ఒత్తైన, మెరిసే జుట్టు కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. పొడవాటి ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి వివిధ స్త్రీలు వివిధ విధానాలను ప్రయత్నింస్తారు, కొంతమంది విటమిన్ ఇ లేదా బయోటిన్ సప్లిమెంట్లను కూడా ఉపయోగిస్తారు. జుట్టును బలోపేతం చేయడానికి మరియు దాని పెరుగుదలను పెంచడానికి సహాయపడే వివిధ ఉత్పత్తుల యొక్క ప్రయోజనాలపై అనేక పరిశోధనలు మరియు క్లినికల్ అధ్యయనాలు జరిగాయి.

జుట్టు రాలడం మరియు జుట్టు చిట్లడాన్ని నివారించడం కూడా జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో మరొక ముఖ్యమైన అంశం. నెత్తి (స్కాల్ప్) సంరక్షణ కూడా అంతే సమానంగా అవసరం ఎందుకంటే ఈ సంరక్షణ జుట్టు యొక్క ఆరోగ్యం మరియు స్థితిని మెరుగుపరుస్తుంది మరియు నెత్తి మరియు జుట్టు యొక్క వ్యాధులను నివారిస్తుంది. కాబట్టి, మీరు కూడా పొడవాటి జుట్టును త్వరగా పొందాలని కోరుకుంటున్నట్లయితే, ఈ వ్యాసం మీ కోసమే. జుట్టు వేగంగా పెరగడానికి మరియు జుట్టు చిట్లకుండా ఉండటానికి తీసుకోవలసిన చర్యలు దీనిలో వివరంగా చర్చించబడ్డాయి.

  1. జుట్టు పొడవుగా మరియు వేగంగా పెరుగడానికి గృహ చిట్కాలు - Home remedies for long and faster growth of hair in Telugu
  2. పొడవైన ఒత్తైన జుట్టుకు ఆరోగ్యకరమైన ఆహారం - A healthy diet for long thick hair in Telugu

ఆధునిక జీవనశైలి, ఒత్తిడి మరియు కాలుష్యం జుట్టును నిస్తేజంగా మరియు జీవములేనట్టు కనిపించేలా చేస్తాయి. జుట్టు అనేది మన ముఖానికి కిరీటం వంటిది మరియు చాలా మంది అందమైన కురుల కోసం చాలా డబ్బును ఖర్చుపెడుతుంటారు. ఈ క్రింద వివరంగా చర్చించబడిన కొన్ని సాధారణ గృహ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు కలలు కనే జుట్టును పొందవచ్చు.

జుట్టు పెరుగుదలకు కోడి గుడ్డు మాస్క్ - Egg mask for faster hair growth in Telugu

కోడి గుడ్డు మాస్క్ జుట్టు చిట్లడాన్ని నిరోధించడంలో అద్భుతాలు చేస్తుంది. గుడ్లలో అధిక స్థాయిలో ప్రోటీన్లు ఉంటాయి, ఇవి కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడతాయి. ఇది సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియం, ఫాస్పరస్ మరియు అయోడిన్ వంటి ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది, ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో మరియు చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. గుడ్డు పగులకొట్టి కొన్ని చుక్కల ఆలివ్ నూనె మరియు కొద్దిగా నీటిని దానిలో కలిపాలి అలా తయారు చేసిన మిశ్రమాన్ని పొడిగా ఉన్న మరియు తలస్నానం చేసిన జుట్టు మీద మాస్క్ లా పూసుకోవాలి. ముప్పై నిమిషాలు దానిని ఉంచి తర్వాత జుట్టును షాంపూతో కడగాలి.

Hair Growth Serum
₹596  ₹1699  64% OFF
BUY NOW

పొడవాటి జుట్టు కోసం ఉసిరి - Amla for long hair in Telugu

పొడవైన, ఒత్తైన జుట్టును పొందడంలో మీకు సహాయపడే ఒక చాలా సమర్థవంతమైన పోషకం ఉసిరి, దీనిని భారతీయ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. జుట్టు మరియు జుట్టు సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉసిరి చాలా కాలంగా సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఉపయోగించబడుతుంది. ఉసిరి నూనెతో నెత్తి మీద మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ జుట్టు వెంట్రుకలకు/ఫోలికల్స్ కు తగిన పోషణను అందిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

జుట్టు ఫోలికల్స్ నుండి చుండ్రు, జిడ్డు మరియు ధూళిని తొలగించడం ద్వారా ఉసిరి నూనె  స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. స్కాల్ప్ మీద తగినంత పిహెచ్ స్థాయిలను పునరుద్ధరించడానికి ఇది సహాయపడుతుంది తద్వారా అది తలలో ఎసెంషియాల్ నునెల (essential oils) ఉత్పత్తిని పెంచుతుంది. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ సి సరిపోకపోవడం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణం ఫ్రీ రాడికల్స్ యొక్క చర్యను న్యూట్రలైజ్ చేయడానికి సహాయపడుతుంది, తద్వారా జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. జుట్టుకు ఉసిరిని పట్టించడానికి ఉత్తమ మార్గం కొబ్బరి నూనెలో దాని పేస్ట్ లేదా పౌడర్‌ను కలిపి హెయిర్ మాస్క్‌గా వేసుకోవడం.

(మరింత చదవండి: యాంటీఆక్సిడెంట్ ఆహారాలు)

జుట్టు పెరుగుదలకు మెంతులు - Fenugreek for faster hair growth in Telugu

ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితమే మెంతుల సామర్థ్యాన్ని గుర్తించింది మరియు ఆరోగ్యం మరియు అందంలో వాటి ప్రయోజనాల వలన చాలా వరకు వాటిని ఉపయోగిస్తూనే ఉంది. మెంతులలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె మరియు ఫోలిక్ ఆసిడ్  పుష్కలంగా ఉంటాయి. అలాగే, మెంతులు పొటాషియం, కాల్షియం మరియు ఐరన్ వంటి ఖనిజాలకు నిల్వలుగా కూడా ఉంటాయి.

వీటిలో ప్రోటీన్ మరియు నికోటినిక్ ఆసిడ్ కూడా అధికంగా ఉంటాయి, ఇవి జుట్టు రాలడం మరియు చుండ్రుపై వ్యతిరేకంగా పనిచేయడంలో వాటి ప్రయోజనాలకు బాగా ప్రసిద్ది చెందాయి. మెంతులలోని ఈ సమ్మేళనాలు బట్టతల, జుట్టు పొడిబారడం, జుట్టు పలుచబడడం వంటి వివిధ రకాల నెత్తి (స్కాల్ప్) సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడతాయి. జుట్టు యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం, ఆహారంలో మెంతులను చేర్చడం అనేది ఒక ఉత్తమమైన చర్య.

జుట్టు పెరుగుదలకు కొబ్బరి పాలు - Coconut milk for the growth of hair in Telugu

కొబ్బరి పాలలో అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి పాల యొక్క ఆరోగ్య సహాయక లక్షణాల కోసం అనేక పరిశోధనలు జరిగాయి. అయితే, ఉత్తమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కొబ్బరి పాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయనేది ఒక ఆసక్తికరమైన విషయం. కొబ్బరి నూనెను జుట్టుకు ఎక్కువ సహాయపడే నూనెగా ఉపయోగించడం అందరికీ తెలిసినదే.

అయితే, కొబ్బరి పాలను ఉపయోగించడం కూడా అంతే సమానంగా ప్రయోజనకరంగా ఉంటుందని ఇటీవలి కాలంలో నిరూపించబడింది. కొబ్బరి పాలలో సమృద్ధిగా ఉండే ఐరన్, ఎసెన్షియల్ కొవ్వులు మరియు పొటాషియం శాతం చుండ్రు వంటి జుట్టు సమస్యలతో పోరాడటానికి మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కొబ్బరి పాలను తలకు పట్టించే ఉత్తమ మార్గం, వాటిని తాజాగా తయారుచేసి (కొబ్బరి నుండి తీసి) , నిమ్మకాయతో కలిపి స్కాల్ప్ కు మరియు జుట్టు మొదళ్లకు బాగా పట్టించి/పూసి మసాజ్ చేయడం. సుమారు ఒక 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత షాంపూతో కడిగేయాలి.

జుట్టు వేగంగా పెరుగడానికి ఆముదం నూనె - Castor oil for faster hair growth in Telugu

జుట్టు వేగంగా పెరగడానికి ఒక అద్భుతమైన చిట్కా ఆముదం నూనె. ఈ నూనె జుట్టు ఒత్తుగా మరియు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆముదం నూనె యాంటీఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి నెత్తి (స్కాల్ప్) పై ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే, ఆముదం నూనెలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి పొడిబారిన జుట్టు వెంట్రుకలలోకి చొచ్చుకువెళ్లి, ఆ వెంటుకలు తేమను నిలుపుకునేలా వెంట్రుకల షాఫ్ట్‌ను (కాండమును) మూసివేస్తాయి. వెంట్రుకల కుదుళ్ళలో ఈ నూనెతో మసాజ్ చేయడం ద్వారా  స్కాల్ప్ (నెత్తి) దానిలో ఉండే అన్ని పోషకాలను గ్రహిస్తుంది తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

పొడవైన జుట్టు కోసం కలబంద - Aloe vera for long hair in Telugu

కలబంద గుజ్జును, జుట్టుకు పూసినప్పుడు, అది జుట్టు పొడవుగా మరియు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. కలబంద గుజ్జును నేరుగా జుట్టుకు పట్టించవచ్చు, అది జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది మరియు నెత్తిని శుభ్రపరుస్తుంది. కలబంద గుజ్జు చుండ్రును తొలగించడంలో  చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

కలబంద రసం, వారానికి ఒకసారి త్రాగితే, అది శరీరంలోని టాక్సిన్లను తొలగించడానికి కూడా సహాయపడుతుంది మరియు ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. కలబంద గుజ్జును తీసి, నేరుగా మీ జుట్టు మరియు నెత్తి మీద పూయండి, సుమారు 30 నిమిషాలు ఉంచి, ఆపై షాంపూతో కడగండి.

పొడవైన ఒత్తైన జుట్టు కోసం అవోకాడో - Avocado for long thick hair in Telugu

ఆధునిక జీవనశైలిలో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడి. దీనివల్ల జుట్టు బలహీనంగా మారుతుంది అది జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అవోకాడోలోలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, అవి ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అవోకాడోలో ఎస్సెంషియాల్ ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి మరియు అవి జుట్టు వేగంగా పెరగడానికి పోషకాలను అందిస్తాయి.

అవోకాడో యొక్క యాంటీ ఇన్ఫలమేటరీ చర్య  నెత్తి పై వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అవోకాడోలోని నూనె జుట్టుకు మెరుపును ఇస్తుంది. అవోకాడోను ఆహారంలో చేర్చడం లేదా అవోకాడోను గుడ్లు మరియు బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల అది జుట్టు పై అద్భుతాలు చేస్తుంది.

పొడవైన ఒత్తైన జుట్టుకు పెరుగు - Yoghurt for long thick hair in Telugu

ఒక ముఖ్య ఆహార పదార్ధమైన పెరుగు, జుట్టు సంరక్షణ విషయంలో కూడా అపారమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పెరుగు వినియోగం చుండ్రును తొలగించడం ద్వారా నెత్తి (స్కాల్ప్) ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. పెరుగులో అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. పొడి మరియు దెబ్బతిన్న జుట్టులో వెంట్రుకలను బాగు (రిపేర్) చేయడానికి ఇది సహాయపడుతుంది. దెబ్బ తిన్న జుట్టును బాగు చేయడం వల్ల జుట్టు సహజంగా పెరగడానికి మరియు జుట్టు పరిమాణం పెరుగడానికి అది ఉపయోకరంగా ఉంటుంది. పెరుగును తలకు పట్టించడానికి, పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని, మీ జుట్టుకు పూసి/రాసి, సుమారు 60 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మంచి షాంపూతో కడిగేయండి.

జుట్టు పెరుగుదలకు ఆపిల్ సైడర్ వెనిగర్ - Apple cider vinegar for hair growth in Telugu

అవును, మీరు సరిగ్గానే విన్నారు (చదివారు). జుట్టు త్వరగా పెరగడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వెనిగర్ జుట్టు యొక్క ఆసిడ్ సమతుల్యతను (acid balance) కాపాడడంతో మరియు నెత్తిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది, తద్వారా జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టుకు అదనపు మెరుపును కూడా ఇస్తుంది మరియు దాని పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడానికి, ఒక పెద్ద బ్యాచ్ కోసం ఒక లీటరు నీటిలో 75 మి.లీ వెనిగర్ కలపి పలుచని సొల్యూషన్ ను తయారుచేసిన అప్పుడప్పుడు వాడవచ్చు లేదా ఒక చిన్న బ్యాచ్ కోసం ఒక కప్పు వెచ్చని వడకట్టిన నీటిలో 15 మి.లీ వెనిగర్ ను కలిపి అప్పటికప్పుడు వాడుకోవచ్చు.

జుట్టు వేగంగా పెరుగడానికి గ్రీన్ టీ - Green tea for faster hair growth in Telugu

ఆరోగ్యం మరియు బరువు తగ్గించే చర్యలను ప్రోత్సహించడంలో గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు అపరమైనవి. అయితే, గ్రీన్ టీ తాగడం అనేది మనం కోరుకుంటున్న అందమైన పొడవాటి జుట్టును పొందడంలో కూడా సహాయపడుతుందని తెలుసుకోవడం మనకు ఆసక్తి కలిగిస్తుంది. మంచి ఫలితాల కోసం టీ తయారీకి ఉడకబెట్టిన గ్రీన్ టీ ఆకులను కూడా నెత్తిమీద నేరుగా పూయవచ్చు.

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ఉత్తేజపరచడంలో సహాయపడతాయి, మరియు జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. గ్రీన్ టీ యొక్క ఆకులను నేరుగా జుట్టుకు పూయవచ్చు లేదా కొబ్బరి నూనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు, ఇది జుట్టుకు వీటిని పట్టించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఆ  మిశ్రమాన్ని తలకు పట్టించిన తర్వాత సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత మంచి షాంపూ మరియు కండీషనర్‌తో కడిగేయండి.

పొడవైన మెరిసే జుట్టు కోసం మందార - Hibiscus for long shiny hair in Telugu

మందార పువ్వులు, ఆకులు మరియు పెరుగు కలిపి చేసిన తయారుచేసిన మిశ్రమం జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా సహాయపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు లోపలి నుండి పోషణ అందిస్తుంది మరియు జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే, మందార పువ్వులు మరియు మెంతులు కలిపి తయారుచేసిన మిశ్రమం కూడా చుండ్రుకు సమర్థవంతమైన చికిత్సగా పనిచేస్తుంది  మరియు ఆరోగ్యకరమైన స్కాల్ప్ ను ప్రోత్సహాహిస్తుంది.

అదేవిధంగా, మందార పువ్వు మరియు ఉసిరి కలిపి తయారుచేసిన మిశ్రమాలు కూడా జుట్టు ఫోలికల్స్ ను బలోపేతం చేస్తాయి మరియు జుట్టును మృదువుగా చేస్తాయి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, అల్లం, గుడ్లు, ఉల్లిపాయ, కలబంద మరియు వేపలను విడివిడిగా తగినంత పరిమాణాలలో మందారంతో కలిపి ఉపయోగించడం వలన జుట్టు త్వరగా పెరుగుతుంది. ఏదైనా ఈ మిశ్రమాలను తలకు పట్టించి సుమారు 30 నుండి 45 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత షాంపూతో కడగాలి.

జుట్టు పెరుగుదలకు ఎరుపు జిన్సెంగ్ - Red ginseng for the growth of hair in Telugu

ఇటీవలి అనేక అధ్యయనాలలో జిన్సెంగ్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని తేలింది. ఇటీవలి అధ్యయనంలో, ఎర్ర జిన్సెంగ్ దానిలో ఉండే జిన్సెనోసైడ్లు (ginsenosides) అని పిలువబడే బయోయాక్టివ్ సమ్మేళనాల ప్రభావం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో పనిచేస్తుందని కనుగొనబడింది.

అయినప్పటికీ, మానవ జుట్టుపై మరియు దాని మెకానిజం యొక్క చర్యలు  తగినంతగా తెలియలేదు మరియు ఈ విషయంలో మరిన్ని అధ్యయనాలు అవసరం. జిన్సెంగ్ యొక్క చర్య యొక్క సాధ్యమైన మెకానిజం కెరాటిన్ యొక్క పరోక్ష ప్రేరణను కలిగి ఉండవచ్చు, కెరాటిన్ జుట్టు కుదుళ్లలో ఉండే పిగ్మెంట్. జిన్సెంగ్ వేరులను చూర్ణం/పొడి చేసి కొబ్బరి నూనెతో కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు.ఈ మాస్క్ ను  సుమారు 20 నిమిషాలు అలానే ఉంచి, తరువాత శుభ్రంగా కడగాలి.

జుట్టు పెరుగుదలను వేగంగా ప్రోత్సహించడానికి ఉపయోగపడే అన్ని పదార్ధాలతో పాటు, కనీస అవసరమైన వాటిలో ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. మీరు లోపల నుండి ఆరోగ్యంగా లేనప్పుడు వివిధ పదార్ధాలను తలకు పట్టించడం వల్ల ఎటుంవంటి ప్రయోజనం ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం వల్ల సంభవించే కాలేయ వ్యాధులు తరచుగా జుట్టు రాలిపోవడం మరియు చుండ్రు వంటి జుట్టు సమస్యలతో ముడి పడి ఉంటాయి. కాబట్టి, ముందు సరిగ్గా తినడం ముఖ్యం.

జుట్టు పెరిగే ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు మీ జుట్టు బలంగా మరియు మెరిసేలా చేయడానికి మీ ఆహారంలో తగినంత ప్రోటీన్లను చేర్చాలని తెలుసుకోండి. జుట్టు పెరుగుదలను పెంచడానికి మరియు మీ జుట్టుకు పరిమాణాన్ని మెరుగుపర్చడానికి కొబ్బరి మరియు డ్రై ఫ్రూట్స్ కూడా సమానంగా అవసరం. ఆకుకూరలు, పండ్లు, మొలకలు, నట్స్ మరియు పెరుగు లను మీ ఆహారంలో ఎప్పుడూ చేర్చాలి.

జుట్టు మరియు క్యూటికల్స్ పెరుగుదలను నిర్వహించడానికి విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పండ్ల రూపంలో విటమిన్ల వినియోగం, ముఖ్యంగా సిట్రస్ పండ్ల వినియోగం కూడా చాలా అవసరం. డీహైడ్రేషన్ ను నివారించండి మరి మీ శరీరంలోని నీటి శాతాన్ని తగినంతగా నిర్వహించండి. డీహైడ్రేషన్ పొడి చర్మం మరియు నిస్తేజమైన జుట్టుకు దారితీస్తుంది. నెత్తి (స్కాల్ప్)కి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి తగినంత నీరు త్రాగాలి.

వనరులు

  1. Gyeong-Hun Park et al. Red Ginseng Extract Promotes the Hair Growth in Cultured Human Hair Follicles . J Med Food. 2015 Mar 1; 18(3): 354–362. PMID: 25396716
  2. Nan-nan Zhang, Dong Ki Park, Hye-Jin Park. Hair growth-promoting activity of hot water extract of Thuja orientalis . BMC Complement Altern Med. 2013; 13: 9. PMID: 23305186
  3. Mun Su Chung et al. An Asian traditional herbal complex containing Houttuynia cordata Thunb, Perilla frutescens Var. acuta and green tea stimulates hair growth in mice . BMC Complement Altern Med. 2017; 17: 515. PMID: 29197368
  4. Maria Fernanda Reis Gavazzoni Dias. Hair Cosmetics: An Overview . Int J Trichology. 2015 Jan-Mar; 7(1): 2–15. PMID: 25878443
  5. B Satheesha Nayak et al. A Study on Scalp Hair Health and Hair Care Practices among Malaysian Medical Students. Int J Trichology. 2017 Apr-Jun; 9(2): 58–62. PMID: 28839388
  6. Abdel Naser Zaid et al. Ethnopharmacological survey of home remedies used for treatment of hair and scalp and their methods of preparation in the West Bank-Palestine . BMC Complement Altern Med. 2017; 17: 355. PMID: 28679382
  7. E.B.C. Lima et al. Cocos nucifera (L.) (Arecaceae): A phytochemical and pharmacological review . Braz J Med Biol Res. 2015 Nov; 48(11): 953–964. PMID: 26292222
Read on app