కపాలభాతి అనేది ప్రాణాయామంలో ఒక సాంకేతిక ప్రక్రియ, దీనిలో శ్వాస యొక్క ఆరోహణావరోహణల సాధన (మాడ్యులేషన్) ఉంటుంది, దీనిని సంస్కృతంలో ‘ప్రాణ’ అని కూడా పిలుస్తారు. ఇదొక యోగ సాధన, ఇది అంతర్గత శుద్దీకరణ సాంకేతికత (technique) గా పరిగణించబడుతుంది. “కపాల్ భాతి” ని ‘కపాల్’ (అంటే పుర్రె అని) మరియు ‘భాతి’ (అంటే మెరవడం లేక ప్రకాశించడం అని అర్థం) అనే పదాల నుండి స్వీకరించారు.      

కాపాలభాతి అనేది ‘శుద్ధి చేసుకోవడం మరియు శక్తిని విడుదల చేసే సాంకేతికత’ అని సూచిస్తుంది.

కపాలభాతి యొక్క ప్రధాన విధి అంతర్గత అవయవాలను శుభ్రపరచడం మరియు జీవక్రియను మెరుగుపరచడం. కానీ, దీనివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఈ టెక్నిక్ యొక్క సరైన దశలతో పాటు ఈ వ్యాసంలో దాని ప్రయోజనాలు కూడా చర్చించబడ్డాయి.

  1. దశలవారీగా కపాలభాతి సాధన క్రమం - Kapalbhati steps in Telugu
  2. కపాలభాతి ప్రయోజనాలు - Kapal bhati benefits in Telugu
  3. కపాలభాతి జాగ్రత్తలు - Kapalbhati precautions in Telugu

మీ ఇంట్లో కపాలభాతి ప్రాణాయామం సరిగ్గా చేయడానికి ఈ కింది దశలను క్రమంగా అనుసరించండి:

  • సౌకర్యవంతమైన ధ్యాన స్థితిలో కూర్చోండి.
  • కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి.
  • ఇప్పుడు, మీ ఛాతీ విస్తరించే వరకు మీ ముక్కు ద్వారా లోతుగా గాలిని పీల్చుకోండి.
  • పీల్చిన ఆ గాలిని, పొత్తికడుపు కండరాల యొక్క శక్తివంతమైన సంకోచాలను చేస్తూ, బయటకు వదలండి.
  • 40 చక్రాల వరకు (40 సార్లు) బలవంతంగా ఉచ్ఛ్వాసము మరియు నిష్క్రియాత్మక ఉచ్ఛ్వాసాన్ని కొనసాగించండి.
  • ఇప్పుడు, కపాలభాతి యొక్క ఒక చక్రం పూర్తి చేసి లోతైన శ్వాస తీసుకోండి.
  • మరో 2 రౌండ్లు చేయండి.

కాపాలభాతి సాధనను కొత్తగా ప్రారంభించేవారికి, ఒకే రౌండ్లో 40 శ్వాసల చక్రం సాధించడం సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి, మొదట మీరు 10 శ్వాసల్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రదర్శించేటప్పుడు మీరే ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం అని మీరు గమనించుకోవాలి,  శిక్షణ పొందిన నిపుణుడి మార్గదర్శకత్వంలో మాత్రమే దీన్ని సాధన చేయడం ప్రారంభించాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.

ముందున్న లలాట శ్వాస కోటరాలు (frontal air sinuses) యొక్క శుద్దీకరణకు సహాయపడటం ద్వారా  శరీర శక్తి మరియు వేడి స్థాయిలను పెంచడం ద్వారా, కపాలభాతి వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి; ఆ ప్రయోజనాలు క్రింద చర్చించబడ్డాయి.

  • జీర్ణక్రియకు: కపాలభాతి శరీరం నుండి టాక్సిన్లను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది. 2013 లో నిర్వహించిన ఒక అధ్యయనం కపాలభాతి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్ వ్యాధిని నిర్వహించడంలో దాని పాత్ర కనబర్చినట్టు తెలిసింది. 
  •  గుండె ఆరోగ్యానికి: ఒత్తిడిని తొలగించడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో కపాలభాతి సహాయపడుతుంది. అధిక రక్తపోటు గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె వ్యాధుల కోసం చికిత్స తీసుకునే వారు మందులతో పాటుగా కపాలభాతి కూడా చేయడం వలన అధిక ప్రయాజనం ఉంటుంది. 
  • బరువు నిర్వహణకు: కపాలభాతి బరువును తగ్గించడంలో ప్రభావంతంగా ఉంటుంది. ఈ విషయం 60 మంది అధిక బరువుతో ఉన్న వారి పై నిర్వహించిన అధ్యయనంలో రుజువైంది.  కపాలభాతి వలన వారి బిఎంఐ మరియు నడుము చుట్టూ కొలతలలో ప్రభావంతమైన తగ్గుదల కనిపించిందని ఈ  అధ్యయనం తెలిపింది.     
  •  చర్మం కోసం: కపాలభాతి టాక్సిన్లను తొలగించడం ద్వారా చర్మానికి సహజ మెరుపు మరియు కాంతిని అందిస్తుంది. మరియు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. 
  •  శ్వాసకు: ఫ్రంటల్ సైనసిస్ ను శుభ్రపరచడం ద్వారా కపాలభాతి శ్వాస క్రియకు సహాయం చేస్తుంది. తరుచుగా ఇది జలుబు, ఉబ్బసం, దగ్గు వంటి శ్వాసకోశ రుగ్మత చికిత్సలతో కూడా ఉపయోగపడుతుంది. ఇది క్షయ వ్యాధి చికిత్సలో కూడా సహాయపడుతుంది.
  • ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్యం కోసం: ఇతర ప్రాణాయామ ప్రక్రియల మాదిరిగానే కపాలభాతి కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారికి  కపాలభాతి ఒక అద్భుతమైన వ్యాయామం. ఇవికాక కపాలభాతి మెదడు యొక్క మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది.     
  1. కపాల్‌ భాతి చర్మానికి మేలు చేస్తుంది - Kapalbhati benefits for the skin in Telugu
  2. మంచి శ్వాసక్రియ కోసం కపాలభాతి - Kapalbhati for better respiration in Telugu
  3. ఒత్తిడి తగ్గింపు మరియు మానసిక ఆరోగ్యానికి కపాలభాతి - Kapalbhati for stress reduction and mental health in Telugu
  4. జీర్ణశక్తికి కపాలభాతి - Kapalbhati for digestion in Telugu
  5. గుండె ఆరోగ్యానికి కపాలభాతి - Kapalbhati for cardiovascular health in Telugu
  6. బరువు తగ్గడానికి కపాలభాతి - Kapalbhati for weight loss in Telugu
  7. పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి నివారణకు కపాలభాతి - Kapalbhati for the prevention of polycystic ovarian disease in Telugu

కపాల్‌ భాతి చర్మానికి మేలు చేస్తుంది - Kapalbhati benefits for the skin in Telugu

పేరే స్పష్టంగా సూచించినవిధంగా ‘కపాలభాతి’ అనేది ఒక యోగవిధాన ప్రక్రియ, ఇది శరీరంలోని విషపదార్థాలను (టాక్సిన్‌లను) తొలగించి బయటికి పంపేయడం ద్వారా మీ చర్మానికి సహజమైన కాంతిని అందించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, ఉత్సాహంగా మరియు శాశ్వతంగా మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. ఇది కాక, కపాలభాతి  శరీరం యొక్క శక్తి స్థాయిలకు చైతన్యం నింపడంలో కూడా సహాయపడుతుంది, ఇది మరొక యంత్రాంగం, ఇది మనల్ని మరింత యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.

మంచి శ్వాసక్రియ కోసం కపాలభాతి - Kapalbhati for better respiration in Telugu

లలాట శ్వాస కోటరాల (frontal air sinuses) దిబ్బడను తొలగించి శుభ్రపరచడంలో సహాయం చేయడం ద్వారా, కపాల్ భాతి  మంచి శ్వాసక్రియకు బాగా సహాయపడుతుంది. కాబట్టి, ఇది తరచుగా జలుబు, దగ్గు, రినిటిస్ (ముక్కులోని శ్లేష్మపొర యొక్క మంట లేక వాపు), సైనసిటిస్ (కోటరంలో మంట-వాపు), ఉబ్బసం మరియు ఇతర శ్వాసకోశ రుగ్మతల చికిత్సకు ఉపయోగిస్తారు. వాస్తవానికి, రోగి యొక్క సంప్రదాయిక క్షయ నిరోధక చికిత్సతో పాటు క్షయవ్యాధి నిర్వహణకు కపాల్ భాతి  సహాయపడగలదని తాజా అధ్యయనం కనుగొంది. ఏదేమైనా, ఈ పద్ధతిని సూచించినంత వరకు వ్యాధిగ్రస్త స్థితిలో చేయమని సిఫారసు చేయబడలేదు. మరోవైపు, శ్వాసకోశ రుగ్మతల నివారణకు ఆరోగ్యకరమైన విషయాలలో ఈ సాంకేతికత ఎక్కువగా సిఫార్సు చేయబడింది.

ఒత్తిడి తగ్గింపు మరియు మానసిక ఆరోగ్యానికి కపాలభాతి - Kapalbhati for stress reduction and mental health in Telugu

అనేక ప్రాణాయామ పద్ధతుల మాదిరిగానే, కపాలభాతి  మనస్సును ‘వర్తమాన క్షణంలో’ ఉండటానికి వీలు కల్పించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులపై ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా ఇది రుజువు చేయబడింది, ఈ టెక్నిక్ యొక్క అభ్యాసంతో ఆ  అధ్యయనంలో పాల్గొన్న వారు తక్కువ ఒత్తిడి స్థాయిని ప్రదర్శించారు. కాబట్టి, దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారికి కపాల్ భాతి ఒక అద్భుతమైన వ్యాయామం కావచ్చు.

ఇది కాక, కపాలభాతి  అభ్యాసం మెదడు యొక్క మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది. ‘దృశ్య ప్రతిచర్య సమయానికి’ కపాల్ భాతి ప్రాణాయామం యొక్క ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం కంటి వ్యాయామాలతో ఈ  కాపాలభాతి ప్రాణాయామాన్ని కలిపినప్పుడు ఈ పనితీరును పెంచడంలో సహాయపడుతుందని తేల్చింది.

కపాలభాతి  టెక్నిక్ సహాయంతో మీరు దృశ్య ఉద్దీపనకు ప్రతిస్పందించే సమయం తగ్గుతుందని ఇది సూచిస్తుంది. దృశ్య ప్రతిచర్య సమయాన్ని తగ్గించడం కూడా ఏకాగ్రత స్థాయిని మెరుగుపరుస్తుంది. ఈ టెక్నిక్ యొక్క ఈ ప్రయోజనాలన్నీ దీనిని పండితులు అపారంగా ఆచరించాలని సూచిస్తున్నాయి.

జీర్ణశక్తికి కపాలభాతి - Kapalbhati for digestion in Telugu

ఇది విషపదార్థాలని (టాక్సిన్స్) శరీరం నుండి తొలగించేయడంలో   సహాయపడుతుంది కాబట్టి, జీర్ణక్రియ మరియు నిర్మూలన ప్రక్రియలో కపాలభాతికి స్పష్టమైన పాత్ర ఉంది. జీర్ణవ్యవస్థ యొక్క కండరాలను శక్తిమంతం చేయడానికి ఇది గుర్తించబడింది. ఇంకా, 2013 లో పులితేన్పులు లేక   ‘గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిజార్డర్ (GERD)’ రుగ్మత నిర్వహణలో కపాల్ భాతి  ప్రాణాయామ సాంకేతికత యొక్క పాత్రను సూచించింది. ఈ అధ్యయనం తీవ్రమైన కేసుల నిర్వహణకు సంప్రదాయిక చికిత్స కంటే GERD యొక్క ఔషధ చికిత్సతో కలిపి కపాల్ భాతి  చాలా ప్రభావవంతంగా ఉందని నిర్ధారించింది.

గుండె ఆరోగ్యానికి కపాలభాతి - Kapalbhati for cardiovascular health in Telugu

రక్తపోటు స్థాయిలలో పదేపదే పెరుగుదల సంభవించడం ద్వారా రక్తపోటు యొక్క వ్యాధికారకంలో ఒత్తిడికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది, ఇది చివరికి ఈ గుండె రుగ్మతకు కారణమవుతుంది. ఒత్తిడిని తొలగించడాన్ని సులభతరం చేయడంతో పాటు, కపాలభాతి టెక్నిక్ రక్తపోటును తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది.

గుండెపోటు, గుండె నరాల వ్యాధులు (కొరోనరీ ఆర్టరీ రుగ్మత), మరియు స్ట్రోక్ వంటి మెదడునరాల (సెరెబ్రోవాస్కులర్) వ్యాధుల వంటి అనేక హృదయ-సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని మరింత పెంచే రక్తపోటును ప్రారంభంలోనే ఉత్తమంగా నిర్వహించబడుతుంది. కాబట్టి, ఈ పద్ధతిని ఉత్తమ గుండె ఆరోగ్యం కోసం సంప్రదాయఔషధానికి సహాయంగా ఉపయోగించాలని సూచించారు.

బరువు తగ్గడానికి కపాలభాతి - Kapalbhati for weight loss in Telugu

కపాలభాతి  ప్రాణాయామానికి బరువును తగ్గించే అపారమైన సామర్థ్యం ఉంది. అధిక బరువు కల్గిన 60 మంది వ్యక్తులు పాల్గొన్న ఒక వైద్య అధ్యయనం ఈ భావనకు మద్దతు ఇచ్చింది. ఈ అధ్యయనం కపాల భాతి ​​ప్రాణాయామం యొక్క సాధారణ అభ్యాసంతో శరీర ద్రవ్య సూచిక (body mass index-BMI) మరియు పొట్ట మడత యొక్క మందంలో గణనీయమైన తగ్గింపును నివేదించింది. నడుము మరియు తుంటి చుట్టుకొలతలోనూ గణనీయమైన తగ్గింపు నివేదించబడింది. సమతుల్య ఆహారం మరియు వ్యాయామంతో పాటు ఊబకాయం నిర్వహణలో కపాలభాతి ని ఉపయోగించవచ్చని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.

పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి నివారణకు కపాలభాతి - Kapalbhati for the prevention of polycystic ovarian disease in Telugu

ఆడవాళ్ళ హార్మోన్లను దెబ్బతీసే ‘పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి’ లేదా పిసిఓడి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలను బాధిస్తోంది. కొన్ని అధ్యయనాలు పిసిఒడి నిర్వహణలో కపాలభాతి  ప్రాణాయామం పాత్రను సూచించాయి, కాని ఆధారాలు పరిమితం. బరువు తగ్గించే ప్రక్రియ ద్వారా కపాలభాతి పోలీసీస్టిక్ అండాశయ వ్యాధి నిర్వహణలో సహాయపడే ఒక విధానం. ఈ రుగ్మతకు స్థూలకాయం ఒక ప్రధాన ప్రమాద కారకం కాబట్టి, కపాల్ భాతి  సహాయకంగా ఉంటుందని నిరూపించవచ్చు.

కపాలభాతి సాంకేతిక ప్రక్రియ సాధారణంగా సురక్షితంగా ఉంటుంది, శిక్షణ పొందిన నిపుణుడి పర్యవేక్షణ లేకుండా దీనిని ప్రారంభించకూడదు. కపాల్ భాతి సాంకేతికతను మొదటసారి సాధన చేయడం ప్రారంభించేవారు (beginners) ప్రయాసకు గురి కాకుండా ఉండాలి మరియు ఈ క్రింది పరిస్థితులు లేదా రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని అభ్యాసం చేయకూడదు:

మీరు అలసట, అస్పష్టమైన దృష్టి లేదా వికారం అనుభవిస్తే మీరు ఈ వ్యాయామం చేయకూడదని గమనించడం చాలా అవసరం. కపాల్భాతి సాధన వల్ల ఫుఫుసకుహరంలో గాలి ఉండటం (న్యుమోథొరాక్స్) అనే రుగ్మత వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం నివేదించింది, కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

और पढ़ें ...
Read on app