విటమిన్ సి అంటే ఏమిటి?
విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది నారింజ మరియు నిమ్మకాయలు వంటి కొన్ని ఆహార పదార్ధాలలో సహజంగా ఉంటుంది. మరియు ఈ విటమిన్ ఆహార-సంబంధమైనదిగా కూడా అందుబాటులో ఉంటుంది. సి విటమిన్ ని “L- అస్కోర్బిక్ ఆమ్లం” అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో సహజంగా సంశ్లేషించబడదు, అంటే ఇది లభించే ఆహారాల్ని సేవిస్తేనే ఈ విటమిన్ మన శరీరానికి లభిస్తుంది. శరీరం యొక్క సాధారణ పనితీరులో సి విటమిన్ అనేక విధాలుగా తోడ్పడుతుంది మరియు దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సి విటమిన్ యొక్క చాలా అగత్యమైన విధి ఏంటంటే “కొలెజెన్ పీచుపదార్థాల” జీవ సంశ్లేషణగా (biosynthesis) పనిచేయడమే.
కొల్లాజెన్ ఫైబర్స్ అంటే ఏమిటి?
సంయోజిత కణజాలంలో కొల్లాజెన్ ప్రధాన నిర్మాణ పోషకాహారంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని మొత్తం ప్రోటీన్ పరిమాణంలో 25% నుండి 35% వరకు ఉంటుంది. కొలెజెన్ పీచుపదార్థం అనేది ఎముకలు, మృదులాస్థి, స్నాయువులు, చర్మం, ఆస్తిబంధకాలు మరియు చర్మంకింది పోర (అంటిపట్టు)ల్లో ఉండే ప్రధాన భాగం. గొప్ప తీగ బలం (అంటే సాగుడు బలం) గలది కాబట్టి కొలెజెన్ పీచుపదార్థం మన చర్మం యొక్క బలానికి స్థితిస్థాపకతకు కారణమవుతుంది. ఈ కొలెజెన్ పీచుపదార్థం యొక్క శక్తి వయసు పెరగడంతో పాటు క్రమంగా తగ్గుతుంది. ఇప్పటివరకు కనుగొనబడిన 28 రకాల కొలెజెన్ పీచుపదార్థాలు మన శరీరంలో ఉన్నాయి, కానీ 90% కొలెజెన్ పీచుపదార్థం అంతా ఒకటో రకానికి (Type 1) చెందినదే.
కొల్లాజెన్ ఫైబర్స్ సంశ్లేషణలో విటమిన్ సి సహాయపడుతుంది కనుక, ఇది (విటమిన్ సి) పుండ్లు/గాయాల వైద్యం, రోగం నుండి కోలుకోవడానికి మరియు కణజాల పునరుత్పాదన ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి శరీరంలోని విటమిన్ E లాంటి ఇతర అనామ్లజనకాల యొక్క చర్యను ప్రోత్సహించే ఒక శక్తివంతమైన అనామ్లజనకం (ప్రతిక్షకారిణి), ఇది స్వేచ్ఛా రాశులు కల్గించే నష్టాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి ఆహారం నుండి లభించే “నాన్-హీమ్ ఐరన్” యొక్క శోషణను మెరుగుపరుస్తుంది. అదనంగా, విటమిన్ సి కి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.