సీఫుడ్ (సముద్రం నుండి లభించే ఆహారపదార్దాలు) మన ఆహార విధానంలో చేర్చగల అత్యంత పోషకమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం. ఇది విటమిన్లు మరియు ఖనిజాలతో సహా అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఒమేగా -3 కొవ్వులు అధికంగా ఉండే వనరులలో చేప ఒకటి. కానీ, మీరు చేపలంటే అంతగా ఇష్టపడకపోతే మరియు ఈ ఆరోగ్యకరమైన కొవ్వుల ప్రయోజనాలను పొందాలనుకుంటుంటే, మీరు చేపకు బదులుగా చేప నూనెను ఎంచుకోవచ్చు.
ఒమేగా -3 కొవ్వులే కాకుండా, చేపల నూనెలో విటమిన్ ఎ మరియు విటమిన్ డి కూడా కొంత మొత్తంలో ఉంటాయి, ఇవి ఈ చేప నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలను మరింత పెంచుతాయి.
సాల్మొన్ (మాగా) మరియు కాడ్ (డాల్పిన్, గుండు మీను) వంటి నూనె గల చేపల కణజాలాల నుండి తీయబడే చేప నూనె, ఇకోసాపెంటెనోయిక్ ఆసిడ్ (ఇపిఎ) [eicosapentaenoic acid (EPA)]మరియు డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం (డిహెచ్ఎ) [docosahexaenoic acid (DHA)] వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అత్యంత సమృద్ధిగా ఆహార వనరులలో ఒకటి, .
ఇపిఎ (EPA) మరియు డిహెచ్ఎ (DHA) లు కొన్ని ఇకోసానాయిడ్ల యొక్క పూర్వగాములు (ప్రీకస్సర్స్), ఇవి మానవ శరీరంలో వాపు యొక్క స్థాయిలను తగ్గిస్తాయి. మరియు మరొక ఉత్తమ విషయం ఏమిటంటే, అవి హానికరమైన కొలెస్ట్రాల్‌ను పెంచవు! కుంగుబాటు, ఆందోళన, క్యాన్సర్ మరియు మాక్యులర్ డిజనెరేషన్ వంటి అనేక ఇతర సమస్యలలో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్లు మరియు చేప నూనెల ప్రయోజనాలు విస్తృతంగా అధ్యయనం చేయబడ్డాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కొవ్వును చేపలు స్వయంగా తయారు చేయలేవు అయితే, అవి తినే నాచు (planktons) నుండి వాటి శరీరంలో ఏర్పడుతుంది.
చేప నూనె సప్లిమెంట్లను ద్రవ రూపంలో తీసుకోవచ్చు, అయితే, మీరు ఆ రుచిని ఇష్టపడకపోతే, చేప నూనె గుళికలను మీ స్థానిక మందుల దుకాణం నుండి సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్య సప్లిమెంట్ గా మాత్రమే కాక, ఆయింట్మెంట్లు, ఎమోలియంట్లు మరియు బాడీ ఆర్ట్ వంటి బాహ్యంగా ఉపయోగించే వాటిలో చేప నూనెల ఉపయోగం ఉంటుంది!