ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలకు గర్భందాల్చడమనేది విశ్వంలోనే అత్యుత్తమ భావాల్లో ఓ భావాన్నికలిగి ఉండడమే అవుతుంది. మరి ఓ మహిళల గర్భం వచ్చిన వెంటనే, ఉత్సుకత కనబరిచేది దేనిగురించి అంటే తన గర్భంలో ఉన్నది ఆడ బిడ్డా లేక మగ బిడ్డా అనే దాని గురించి. ఏదేమైనా, తల్లిదండ్రులకు ప్రతి బిడ్డ, లింగంతో సంబంధం లేకుండా, దేవుడిచ్చిన బహుమానం. కాని (గర్భధారణ సమయంలో) దంపతులు వారి శిశువు యొక్క పోషణను తొందరగా మొదలుపెట్టాలని నిర్ణయించుకోవాలనుకుంటారు. అలాంటి దంపతులు చాలామందికి, గర్భధారణ వ్యవధి తొమ్మిది నెలలూ వేచి ఉండటం అంటే అది వాళ్లకు శతాబ్దాలుగానే అనిపిస్తుంది.

భారతదేశంలో, గర్భధారణ సమయంలో గర్భము లోని పిండం యొక్క లింగాన్ని (మగబిడ్డనా-ఆడబిడ్డనా అనే  విషయం) నిర్ణయించడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం. అనేకమంది పిండాల లింగాన్ని గుర్తించడానికి లైంగిక-నిర్ణాయక పరీక్షలను దుర్వినియోగం చేశారు, దీని ఫలితంగా గర్భంలోని ఆడ శిశువుల హత్యలకు (తల్లి గర్భంలోని ఆడ శిశువు యొక్క పిండాలను చంపడం) దారి తీస్తోంది. దేశంలో నిరంతరంగా కొనసాగుతున్న గర్భంలోని పిండం యొక్క లింగం ఎంపిక అభ్యాసం భారతదేశంలోని లింగ నిష్పత్తిని దెబ్బ తీయడానికి దారితీ స్తోంది  (దేశంలో ప్రతి వేయిమంది మగవారికి మహిళల సంఖ్య ఉనికి).

గర్భంలోని శిశువు లింగ  నిర్ధారణ మరియు ఎంపిక (సెక్స్ డిటర్మినేషన్ మరియు సెలెక్షన్) నేరానికి “ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (PCPNDT)” చట్టం ప్రకారం, శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష మూడేళ్ళ  జైలువాసంతో బాటు యాభైవేల రూపాయల జరిమానా లేదా ఐదు సంవత్సరాలు జైలు శిక్షను విధించి, దానితోబాటు జరిమానాను ఒక లక్ష రూపాయల వరకూ పెంచవచ్చు. ఈ శిక్ష గర్భంలోని శిశువు యొక్క లింగాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులకు మాత్రమే కాక, రోగ నిర్ధారణ చేసే వైద్యుడికి కూడా వర్తిస్తుంది. అందువల్ల, బాధ్యతగల పౌరులు మరియు కాబోయే  తల్లిదండ్రుడలుగా ఉండటంతో పాటుగా బిడ్డను ఆశిస్తూ తల్లి-దండ్రుల స్థానం పొందబోయే ఈ అధిక ఆనందదాయక దశలో మీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం.

మనందరం చూసినవిధంగా, ఓ మహిళ గర్భందాల్చింది అంటే ఆ వార్త కుటుంబం పరిధి దాటి పరిసర ప్రాంతాలలో తెల్సిన వారందరికీ దావానలం (wild fire అడవిలో మంట) లాగా వ్యాపిస్తుంది. చాలామంది మీరు మీ గర్భంలో మోస్తున్నది అబ్బాయా లేదా అమ్మయా అని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు. ఏదేమైనా, ఈ అంచనాలకు సంబంధించి ఎలాంటి శాస్త్రీయమైన రుజువు లేదు. ఈ వ్యాసం, గర్భంలోని శిశువుకు సంబంధించి,  ప్రజల ఉత్సుకత మరియు శిశువు యొక్క లింగనిర్ధారణ గురించి వారి సంప్రదాయిక నమ్మకాలను తృప్తిపరచడానికి మాత్రమే వ్రాయబడింది. మీరొక మగ శిశువును గర్భమందు మోస్తున్నారనే విషయాన్ని గుర్తించడానికి వివిధ సంస్కృతుల్లో అనుసరించబడుతున్న కొన్ని ప్రసిద్ధమైన పురాణకాలపు నమ్మకాలను ఇక్కడ చర్చించడమైంది.

  1. గర్భధారణ సమయంలో మహిళకు ముఖంపై మొటిమలొస్తే, కడుపులో ఉన్నది మగ శిశువా లేక ఆడ శిశువా? - Acne during pregnancy, baby boy or girl? In Telugu
  2. మూత్రం రంగు అనేది గర్భంలో శిశువు బాలుడన్నదానికి గుర్తు - Urine colour is a sign of a baby boy in Telugu
  3. గర్భస్థ శిశువు మగబిడ్డ అనడానికి సంకేతాలు గర్భవతి రొమ్ముల పెరుగుదల - Signs of baby boy pregnancy include breast growth in Telugu
  4. గర్భధారణ రేఖ (లేదా లైన్ నిగ్రా) అనేది మగ శిశువు లక్షణం - Pregnancy line or linea nigra is a symptom of baby boy
  5. గర్భంలో మగ శిశువు సంకేతానికి గర్భవతి చేతులు మరియు కాళ్ళు చల్లగా ఉండటం - Baby boy in womb symptoms include cold hands and feet in Telugu
  6. పొడిబారిన చర్మం ఉంటే పుట్టబోయే శిశువు మగబిడ్డే - Having a baby boy gives you a dry skin in Telugu
  7. బరువు పెరగకపోవడమనేది గర్భస్థ శిశువు మగబిడ్డే అనడానికి ఒక లక్షణం - No weight gain is a symptom of conceiving baby boy in Telugu
  8. గర్భంలో శిశువు బాలుడైన పక్షంలో తక్కువ తీవ్రతతో కూడిన ఉదయకాలపు జబ్బు - Less intense morning sickness in case of a baby boy in Telugu
  9. గర్భవతి యొక్క చర్మం మెరుస్తూ ఉంటే అది మగశిశువుకు చిహ్నమా? - Glowing skin, is it a baby boy? inTelugu
  10. మగశిశువు పిండం యొక్క హృదయ స్పందన వేగవంతంగా ఉంటుంది - Boy foetus have a faster heart beat inTelugu
  11. గర్భం దిగువన ఉబ్బెత్తుగా ఉంటే మీ గర్భంలో మగశిశువు పెరుగుతున్నాడనడానికి ఒక సంకేతం - Low baby bump position is a sign that you're having a boy in Telugu
  12. గర్భవతి పుల్లని ఆహారాల్ని ఎక్కువగా తినడం ఆమె మగబిడ్డను మోస్తోందన్నదానికి లక్షణం - Eating more of savory food is a symptom of having a boy in Telugu
  13. గర్భవతి ఎడమవైపు తిరిగి నిద్రపోయేట్లైతే అది మగపిండం లక్షణం - Left sleep position is a boy fetus symptom in Telugu
  14. గర్భిణీ స్త్రీలకు పొడవాటి జుట్టుంటే వాళ్ల గర్భంలో అబ్బాయి ఉన్నట్టే అర్థమా? - Long hair in pregnant women, does it mean it's a baby boy? in Telugu
  15. ఆహారపు కోరికలు తీవ్రంగా ఉంటే గర్భంలో ఉండేది బాలుడుగా ఆశించవచ్చు - Intense cravings are a symptom of expecting a baby boy

కల్పన (myth)

గర్భధారణ సమయంలో ముఖంపై మొటిమలు రావడం అనేకమంది మహిళల్లో కానవచ్చే మరొక లక్షణం. అలా మొటిమలొస్తే ఆ మహిళ ఒక ఆడశిశువును గర్భమందు మోస్తోందనేది చాలా మంది నమ్మకం.

నిజం (fact)

"ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ డెర్మటాలజీ" ప్రకారం, గర్భధారణ సమయంలో సేబాషియస్ గ్రంధుల (చమురు గ్రంధుల) చర్య పెరుగుతుంది, దానివల్ల గర్భవతుల చర్మంపై హెచ్చిన కాంతిని (గ్లో) కలిగివుంటారు. అయినప్పటికీ, చాలా మంది మహిళలు ఈ గ్రంథుల అధిక పనితీరు కారణంగా మోటిమలతో బాధపడుతుంటారు. మొటిమలు మరియు పిండం యొక్క లింగాన్ని నిర్ధారించుకోవడం మధ్య సంబంధం గురించి ఎలాంటి ఆధారాలు లేవు. మోటిమల సమస్య కోసం మీ వైద్యుడిని సంప్రదించడం మరియు మీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం సమస్యకు పరిష్కారం లభించడంతో సహాయపడవచ్చు.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

కల్పన (myth)

పిల్లల యొక్క లింగం మీద ఆధారపడి మూత్రం రంగు మారుతుందన్న దాని గురించి మరొక ప్రసిద్ధ కల్పన ఉంది. గర్భవతి అయిన స్త్రీ ముదురు రంగు మూత్రాన్ని విసర్జించినట్లైతే ఆమె గర్భంలో ఉండేది మగ శిశువు అయిఉంటుందని చెబుతారు. అయితే, మూత్రం లేతగా మరియు మబ్బు మబ్బుగా ఉంటే, ఆమె గర్భంలో పెరుగుతోంది ఆడశిశువు (అమ్మాయి) అయిఉండవచ్చని సూచించబడింది.

నిజం (fact)

2017 లో నిర్వహించిన ఒక అధ్యయనం, “ గర్భిణీల్లో మరియు చంటిపిల్లల తల్లులలో  మూత్రం ఏకాగ్రతకు మూత్రం ఓ గుర్తు,” ప్రకారం, గర్భధారణ సమయంలో మూత్రం రంగు మార్పు అనేది ఆ స్త్రీ ఎంత పరిమాణంలో నీరు తాగుతారు, హార్మోన్ల మార్పులు, మూత్రంలో ప్రోటీన్ల యొక్క విసర్జన, తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో తక్కువ నీటిని వినియోగిస్తున్న స్త్రీ మూత్రంలోని హార్మోన్ల లేదా ప్రోటీన్ల అధిక సాంద్రత కలిగి ఉంటుంది, ఆమె ముదురు రంగు మూత్రాన్ని కలిగి ఉంటుంది. అయితే, దీనికి, శిశువు యొక్క లింగానికి ఏదైనా సంబంధం ఉన్నదీ, లేనిదీ  ఇంకా తెలియదు.

కల్పన (myth)

గర్భవతి రొమ్ముల పెరుగుదలలో తేడా ఉందడమనేది (అంటే ఒక రొమ్ము పెద్దదిగా పెరిగి మరొకటి చిన్నదిగా ఉండడం) కూడా గర్భధారణ గురించి ఉన్న కల్పనల జాబితాలో ఒకటి.   గర్భధారణ సమయంలో రొమ్ముల పెరుగుదలలో తేడా అంటే, ఒక రొమ్ము మరొకదాని కన్నా ఎక్కువగా పెరుగుతుంది, అలాంటపుడు ఆ గర్భవతి రొమ్ముల పరిమాణాన్ని బట్టి తన గర్భంలో పెరుగుతున్నది అమ్మాయా లేదా అబ్బాయా అన్నది ఊహించుకోవచ్చు.  కుడి రొమ్ము ఎడమరొమ్ము కన్నా పెద్దదిగా పెరుగుతుంటే, అది మగ శిశువుకు సంకేతంగా చెప్పొచ్చు. .

(మరింత చదువు - రొమ్ము నొప్పికి కారణాలు )

నిజం (fact)

గర్భధారణ సమయంలో రొమ్ముల పెరుగుదల భిన్నంగా ఉంటుంది, అంటే ఒకటి పెద్దగా మరొకటి చిన్నదిగా ఉంటుందని పరిశోధకుకు సూచిస్తున్నారు. రొమ్ముల పెరుగుదల హార్మోన్ల మార్పులు, కణజాల నిర్మాణం మరియు అమరిక మీద ఆధారపడి ఉంటుంది అని పరిశోధకులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో, గ్రంథుల హార్మోన్లు మరియు జన్యు కారకాల ప్రభావంతో రొమ్ములు పెరుగుతాయి. గర్భవతి రొమ్ముల్లో వచ్చే ఈ మార్పు కాబోయే తల్లి తన శిశువుకు ఆహారం అందించడానికి గర్భవతి శరీరాన్ని సిద్ధం చేయడానికి జరిగే ఒక సహజ శరీర ప్రక్రియ. రెండు రొమ్ముల యొక్క పెరుగుదల ఆకృతులలో వాటి పరిమాణంలో ముఖ్యమైన తేడాలు ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలలో రొమ్ము పెరుగుదల ద్వారా పిల్లల లింగం నిర్ణయించడం కుదరదు.

కల్పన (myth)

గర్భం ఉబ్బుపై (baby bump) మధ్యలో ఒక నలుపు రేఖ ఉనికిని గురించి తరచుగా చెప్పబడే మరొక కథ గర్భవతి కడుపులో ఉన్నది మగబిడ్డే అనే విషయానికి సంబంధం కలిగి ఉంది.

నిజం (fact)

‘జర్నల్ ఆఫ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెడిసిన్’  ప్రకారం, గర్భం పైన నల్లటి నిలువు చార (లైన్ నిగ్రా) అనేది గర్భధారణ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన శిశు గర్భంపై (baby bump) సంభవించే ఒక సన్నని నల్లటి మధ్య రేఖ. ఇది ఒక సాధారణ గర్భం-సంబంధిత లక్షణం, అయినప్పటికీ, ఇలాంటి గర్భంపై చారలు రావడమనేది అందరు గర్భవతుల విషయంలో సంభవించదు.

(మరింత చదువు: పిగ్మెంటేషన్ కోసం గృహ చిట్కాలు)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹892  ₹999  10% OFF
BUY NOW

కల్పన (myth)

గర్భంలో మగశిశువు ఉంటే గర్భవతి యొక్క చేతులు మరియు కాళ్ళు చల్లగా ఉండటం జరుగుతూ ఉంటుంది. చాలా సంస్కృతుల్లో నిజమని విశ్వసించే కల్పనల్లో ఇదీ ఒకటి. దీనిప్రకారం, గర్భవతి అయిన స్త్రీ తన గర్భంలో  ఆడ శిశువు పెరుగుతూ ఉంటే ఆమెకు ఈ చేతులు కాళ్ళు చల్లగుండే లక్షణాల అనుభూతి ఉండదు.

నిజం (fact)

పరిశోధనాత్మక అధ్యయనాల ప్రకారం, చేతులు మరియు కాళ్ళలో చల్లగా ఉండటం అనేది రక్త ప్రసరణలో తగ్గుదల కారణంగా సంభవిస్తుంది. గర్భధారణ సమయంలో కొన్ని తేలికైన  వ్యాయామాలు చేయడంవల్ల సాధారణంగా ఈ లక్షణాన్ని అధిగమించి ఉపశమనం పొందవచ్చు.

కల్పన (myth)

గర్భధారణ సమయంలో చర్మం పొడిబారడం అనే లక్షణం అనుభవించే స్త్రీకి కడుపులో మగశిశువు ఉంటాడనేది ఓ సాధారణ నమ్మకం.

నిజం (fact)

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ ప్రకారం, గర్భధారణ సమయంలో, చర్మ కణజాలం వేగంగా పెరుగుతుంది మరియు సాగబడుతుంది. ఇది చర్మపు గ్రంధుల ద్వారా చమురు ఉత్పత్తిలో తగ్గింపుకు దారితీస్తుంది. ఫలితంగా, గర్భవతి చర్మంలో పొడిదనం (dryness) ఏర్పడుతుంది.

కల్పన (myth)

సాధారణంగా గర్భధారణలో స్త్రీలు బరువు పెరగడం జరుగుతుంది. తొడలు, తుంటిప్రదేశం మరియు ముఖంలో బరువు పెరిగితే ఆ గర్భవతి ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుందనేది తరతరాలుగా నిరంతరంగా వస్తోన్న ఓ నమ్మకం, అయితే కేవలం శిశువు పెరుగుతోన్న గర్భం మాత్రమే బరువు పెరిగితే ఆమె మగబిడ్డకు జన్మనివ్వాలి.

నిజం (fact)

వివిధ స్త్రీలు వారి శరీరంలో కొవ్వు కణాల పంపిణీని వేర్వేరుగా కలిగి ఉండటం అనేది శాస్త్రీయ వాస్తవం, అదేవిధంగా వారి శరీరం జీవక్రియలో వ్యత్యాసం కూడా ఉంటుంది. కొందరు మహిళలు కడుపు, తుంటిభాగం, తొడలు మరియు ముఖంలో కొవ్వు కణాలను కలిగి ఉంటారు, ఇతరులు వారి శరీరంలో సమాన పంపిణీని కలిగి ఉంటారు. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో చురుకుగా ఉన్నవారు మరియు చాలా ఆహారపు కోరికలు లేనివారు ఇతరులకన్నా తక్కువ బరువును పొందుతారు. సేవించే ఆహారంలో చాలా చక్కెర లేదా లవణం ఉంటే గర్భవతి (కాబోయే తల్లి) శరీరంలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిలుపుదలకు దారితీస్తుంది అదనపు కిలోల బరువుకు కూడా దారి తీయవచ్చు. శరీర జీవక్రియకి బాధ్యత వహిస్తున్న థైరాయిడ్ హార్మోన్ల స్థాయి కూడా గర్భంతో ఉన్న మహిళలో తగ్గుతుంది, దానివల్ల  బరువు పెరగవచ్చు.

(మరింత చదువు - థైరాయిడ్ సమస్యలు)

Ashokarishta
₹359  ₹400  10% OFF
BUY NOW

కల్పన (myth)

ఉదయకాలపు జబ్బులక్షణమనేది గర్భవతులకు ఒక సాధారణ లక్షణం. అయినప్పటికీ, చాలామంది నమ్మేదేమంటే, గర్భంలో ఉన్నది ఆడ శిశువు అయితే ఆ గర్భవతి మరింత తరచుగా మరియు ఎక్కువ తీవ్రతతో కూడిన ఉదయకాలపు జబ్బును అనుభవిస్తారు. మరోవైపు, అది ఒక మగశిశువు అయితే ఉదయకాలపు జబ్బు తక్కువ సమస్యాత్మకమైనదిగా ఉంటుంది.

నిజం (fact)

వైద్యులు నమ్మేదేమంటే ప్రతి స్త్రీ యొక్క గర్భం భిన్నంగా ఉంటుందని. "వికారం మరియు వాంతులు యొక్క గర్భధారణ" పై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, ఇది కొవ్వు ఆహార పదార్థం, తల్లి జన్యుతత్త్వం మరియు విష పదార్ధాల నుండి పిండాలను కాపాడడానికి అనుగుణంగా ఒక యాంత్రిక పద్ధతిగా సంభవిస్తుంది. విపరీతమైన అనారోగ్యం మరియు శిశువు యొక్క లైంగిక సంబంధం మధ్య చాలా శాస్త్రీయ ఆధారాలు లేవు.

కల్పన (Myth)

కొందరు నమ్మేదేమంటే గర్భంలో ఉన్నది ఆడ శిశువు అయినట్లైతే గర్భవతి తన పొట్టలోని  కుమార్తెకు తన అందాన్ని ఇచ్చేస్తుంది, అటుపై మొత్తం గర్భధారణ సమయంలో ఆమె చాలా పేలవంగా కనిపిస్తుంది లేదా చర్మ సమస్యలను ఎదుర్కొంటుంది.  అయితే, అదే గర్భంలో ఉన్నది మగబిడ్డ అయినట్లయితే, గర్భవతి సాధారణంగా అలా పేలవంగా ఉండదు, చర్మ సమస్యలుండవ్, పైగా ఆమె చర్మం మెరుస్తూ ఉంటుంది!

(మరింత చదవండి - చర్మ వ్యాధి చికిత్స )

నిజం (fact)

గర్భవతి హార్మోన్లలోని హెచ్చుతగ్గుల కారణంగానే ఆమె యొక్క చర్మంలో మ్మార్పులు చోటు చేసుకుంటాయని, శిశువు యొక్క లింగానికి, గర్భవతి చర్మం మెరిసేదానికి సంబంధం గురించి ఇంకా రుజువు కాలేదు అని పరిశోధకులు సూచిస్తున్నారు.

(మరింతచదవండి - హార్మోన్ల అసమతుల్యత చికిత్స)

కల్పన (myth)

తల్లి కడుపులో పెరుగుతున్న శిశువు యొక్క హృదయ స్పందనకు మరియు శిశువు లింగానికి అనుబంధం గురించి ఓ పాతకథ ఉంది. అదేమంటే, గర్భస్థ శిశువు బాలుడు అయితే ఆ శిశువు గుండె ఆడ శిశువు గుండె కంటే వేగంగా కొట్టుకుంటుందని. దీన్నిబట్టి పిండం యొక్క లింగాన్ని ఊహించేవారు.

నిజం (fact)

ఓ వైద్య పత్రిక ‘జర్నల్ ఆఫ్ ప్రీనాటల్ మెడిసిన్’ జర్నల్ ప్రకారం, పిండం యొక్క గుండె గర్భం యొక్క నాలుగవ వారంలో అభివృద్ధి చెందుతుంది మరియు అప్పటి నుండి గుండె కొట్టుకోవడం (హార్ట్ బీటింగ్) మొదలవుతుంది. పిండం యొక్క గుండె రేటు ఐదవ వారంలో 110 bpm (బిపిఎం అంటే నిమిషానికి గుండె కొట్టుకునే వేగం), తొమ్మిదవ వారంలో 170, మరియు తరువాత క్రమంగా పదమూడవ వారం నాటికి 150 bpm కు తగ్గుతుంది. అందువల్ల, హృదయ స్పందనల మార్పు అనేది ఎందుకంటే శిశువు యొక్క శరీరం పెరుగుతూ ఉంటుంది, శిశువు శరీరం పెరుగుదల అవసరాలకు తగినట్లు మరియు పిండం యొక్కశరీరం సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన అనేక మార్పులకు అనుగుణంగా హృదయం గురవుతుంది, గుండెకొట్టుకోవడంలో మార్పులు కూడా అందులో భాగమే.

కల్పన (myth)

గర్భస్థ శిశువు యొక్క లింగం గురించి మరొక ప్రసిద్ధ కల్పిత కథ ఉంది, అదేమంటే గర్భంలో శిశువు ఎంత దిగువన ఉంది లేదా ఎగువన ఉన్నదాన్ని బట్టి పిండం అబ్బాయా లేక  అమ్మాయా అనేదాన్ని చెప్పడం. గర్భం దిగువ భాగంలో పిండం కనిపిస్తే అది మగ శిశువు అయి ఉంటుందనేది ఆ నమ్మకం. అదే గర్భం ఎగువభాగంలో గనుక పిండం స్థిరపడి ఉంటే అది ఆడ శిశువు అని నమ్మడం.

నిజం (fact)

“గర్భాశయంలోని పిండం యొక్క స్థానం మీద మావి యొక్క స్థానం మరియు దాని ప్రభావం” అన్న పై జరిగిన ఒక అధ్యయనం సూచించిందేమంటే మావి గర్భాశయంతో కలుగజేసే స్థాయి గర్భస్థ శిశువు యొక్క స్థితిని నిర్ణయిస్తుందని. శిశువు కడుపులో ఏవిధంగా ఏ స్థానంలో ఉందన్న సంగతికి-శిశువు లింగానికి సంబంధం లేదు, అది సూచన కాదు.

కల్పన (myth)

ఉప్పు-పులుపుతో  కూడిన మరియు కారంగా ఉండే ఆహారం కోసం ఆశపడే గర్భవతులు తరచూ ఒక మగ శిశువు(baby boy) కు జన్మనిస్తారనేది చెప్పబడుతోంది, అయితే చక్కెర మరియు తీపి ఆహారాన్ని గర్భధారణ సమయంలో ఎక్కువగా తినేవారు ఆడ శిశువుకు  జన్మనిస్తారనేది ఓ నమ్మకం.

నిజం (fact)

మహిళల ఆహారపు కోరికలు అనేవి ఆహార ప్రాధాన్యత మరియు వ్యక్తిగత ఎంపికలకు సంబందించినవని పరిశోధన సూచిస్తుంది. వివిధ రకాలైన ఆహారాల కోసం గర్భవతి అయిన మహిళ ఆశపడటం అనేది పూర్తిగా ఆమె యొక్క ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది, అంతేగాని పిండం యొక్క 'లింగంపై కాదు.

కల్పన (myth)

ఆడవాళ్లు ఎవరైతే ఎక్కువగా వారి ఎడమ వైపు తిరిగి నిద్రిస్తుంటారో అలాంటి వారు గర్భవతులైతే వాళ్ళు తమ గర్భంలో అబ్బాయిని మోస్తున్నట్లు ఓ నమ్మకం. అయితే ఆడశిశువును గర్భంలో మోస్తున్నవారు ఎక్కువగా తమ కుడివైపు తిరిగి నిద్రిస్తుంటారు అనేదీ ఒక నమ్మకం.

నిజం (fact)

నిద్రకు ఎడమ వైపు ఎక్కువ సౌకర్యవంతమైనదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి, అయితే, దీనికి మరియు పిండం యొక్క లింగానికి ఎలాంటి శాస్త్రీయ సంబంధం గల ఆధారం లేదు.

కల్పన (myth)

గర్భిణీ స్త్రీలకు జుట్టు ఎక్కువగా పెరిగి ఉండటం గురించి మరో కల్పన జనులలో ఉంది. అదేంటంటే, గర్భిణీ స్త్రీ యొక్క జుట్టు విపరీతంగా పెరిగి ఉంటే, ఆమె జుట్టు మృదువుగా మరియు మెరుపును సంతరించుకుందంటే, ఆమె తన కడుపులో ఓ చిన్నారి మగ శిశువునే మోస్తోందనేది ఓ సూచన.

నిజం (fact)

"ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఉమెన్స్ డెర్మటాలజీ" ప్రకారం, గర్భధారణ సమయంలో, వెంట్రుకల కుదుళ్ళు (హెయిర్ ఫోలికల్స్) చాలా మంచి ఉచ్ఛదశలో ఉంటాయి, జుట్టు ఒక సెంటీమీటర్ పొడవు పెరుగుతుంది. అయినా, శిశువు యొక్క లింగానికి-తల్లి జుట్టు పెరుగుదలకు ఉన్న సంబంధమేంటో ఇప్పటికీ ఒక మిస్టరీలానే (మర్మము) ఉంది.

కల్పన (myth)

గర్భవతికుండే వివిధ ఆహారాలు తినాలన్న కోరికల గురించి ఎక్కడైనా సరే ఎక్కువగా మాట్లాడే అంశంగా ఉంటుంది. దీనికి సంబంధించి సంప్రదాయిక నమ్మకం ఏమిటంటే, గర్భం దాల్చిన స్త్రీకి ఆహారపు కోరికలు చాలా ఎక్కువగా కలిగి ఉన్నట్లైతే అలాంటివారి గర్భంలో అబ్బాయే ఉంటాడు అని.

నిజం (fact)

"ఊరగాయలు మరియు ఐస్ క్రీం! గర్భధారణలో ఆహార కోరికలు: పరికల్పన, ప్రాథమిక ఆధారాలు మరియు భవిష్యత్ పరిశోధన కోసం ఆదేశాలు ", అనే అధ్యయనం ప్రకారం, గర్భిణీ స్త్రీలలో ఆహార కోరికలు చాలా సాధారణం. అయితే, గర్భిణీ స్త్రీలకు అలాంటి ఆహారపు కోరికలేవీ లేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆహార కోరికలకు ప్రధాన కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు, గర్భిణీ స్త్రీ యొక్క పోషకాహార అవసరాలు మరియు పిండ-సంబంధ విషాన్ని తొలగించే ప్రేరేపణ మరియు సాంస్కృతిక నియమాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే, గర్భస్థ శిశువు లింగానికి మరియు గర్భవతి ఆహార కోరికలకు మధ్య సంబంధం ఉందనడానికి ఎలాంటి శాస్త్రీయ సాక్ష్యం కనుగొనబడలేదు.

వనరులు

  1. Noel M. Lee, Sumona Saha. Nausea and Vomiting of Pregnancy. Gastroenterol Clin North Am. 2011 Jun; 40(2): 309–vii. PMID: 21601782
  2. Catherine C. Motosko et al. Physiologic changes of pregnancy: A review of the literature. Int J Womens Dermatol. 2017 Dec; 3(4): 219–224. PMID: 29234716
  3. Oriana Valenti et al. Fetal cardiac function during the first trimester of pregnancy. J Prenat Med. 2011 Jul-Sep; 5(3): 59–62. PMID: 22439077
  4. Amy L. McKenzie et al. Urine color as an indicator of urine concentration in pregnant and lactating women. Eur J Nutr. 2017; 56(1): 355–362. PMID: 26572890
  5. Antônio Arildo Reginaldo de Holanda et al. Ultrasound findings of the physiological changes and most common breast diseases during pregnancy and lactation. Radiol Bras. 2016 Nov-Dec; 49(6): 389–396. PMID: 28057965
  6. Natalia C. Orloff, Julia M. Hormes. Pickles and ice cream! Food cravings in pregnancy: hypotheses, preliminary evidence, and directions for future research. Front Psychol. 2014; 5: 1076. PMID: 25295023
  7. Filipov E, Borisov I, Kolarov G. [Placental location and its influence on the position of the fetus in the uterus]. Akush Ginekol (Sofiia). 2000;40(4):11-2. PMID: 11288622
  8. Priya Soma-Pillay et al. Physiological changes in pregnancy. Cardiovasc J Afr. 2016 Mar-Apr; 27(2): 89–94. PMID: 27213856
Read on app